Janhvi Kapoor Scenes:తప్పు తెలుసుకున్నాం, సీన్లు మారుస్తాం- జాన్వీ కపూర్‌ను శృంగారవస్తువులా చూపించడంపై బుచ్చిబాబు పోస్ట్

Buchi Babu Sana On Removing Janhvi Kapoor Scenes Peddi: రామ్ చరణ్ పెద్దిలో జాన్వీ కపూర్‌ని శృంగార వస్తువులా చూపించిన విధానంపై ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో దర్శకుడు బుచ్చిబాబు సాన అధికారికంగా క్షమాపణలులు ప్రకటించారు. ఆ వివాదాస్పద సీన్లను సినిమా నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు.

Published on: Jun 6, 2026, 12:21:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Buchi Babu Sana On Removing Janhvi Kapoor Scenes Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన కాంబినేషన్‌లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలై రెండు రోజులు కూడా గడవకముందే ప్రపంచవ్యాప్తంగా రూ. 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది.

తప్పు తెలుసుకున్నాం, సీన్లు మారుస్తాం- జాన్వీ కపూర్‌ను శృంగారవస్తువులా చూపించడంపై బుచ్చిబాబు పోస్ట్
తప్పు తెలుసుకున్నాం, సీన్లు మారుస్తాం- జాన్వీ కపూర్‌ను శృంగారవస్తువులా చూపించడంపై బుచ్చిబాబు పోస్ట్

మితిమీరిన రీతిలో

అయితే, ఈ భారీ సక్సెస్ ఆనందంలో ఉన్న చిత్రబృందానికి ఒక ఊహించని వివాదం తలనొప్పిగా మారింది. పెద్ది సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (అచ్చియమ్మ పాత్ర) గ్లామర్‌ను మితిమీరిన రీతిలో, మహిళలను కించపరిచేలా చూపించారంటూ ప్రేక్షకుల నుంచి, ముఖ్యంగా మహిళా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యల్లువెత్తాయి.

హీరోయిన్లను గ్లామర్ కోసం వాడుకునే ఆట వస్తువు కింద చూస్తున్నారని నెట్టింట్లో తెగ చర్చ నడుస్తోంది. ఈ వివాదం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంతో దర్శకుడు బుచ్చిబాబు సాన శనివారం (జూన్ 6) ఉదయం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బహిరంగ క్షమాపణలు చెప్పారు.

నెటిజన్ల ఆగ్రహం.. అసలేం జరిగింది?

'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పాత్రను కేవలం ఒక గ్లామర్ బొమ్మకే పరిమితం చేశారనేది ప్రధాన ఆరోపణ. సినిమా ప్రారంభంలో వచ్చే అచ్చియమ్మ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ నుంచే ఈ వివాదం మొదలైంది. రామ్ చరణ్ పాత్ర మొదటిసారి జాన్వీని చూసినప్పుడు.. కెమెరా యాంగిల్స్ ఆమె శరీరాకృతిని చాలా అసభ్యకరంగా, కేవలం ఒక భోగవస్తువులా (Sex Toy) చూపించాయంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

అంతేకాకుండా, సినిమాలో హీరో తన స్నేహితులతో మాట్లాడుతూ.. అచ్చియమ్మ అనుమతి లేకుండానే ఆమెను తాకాలని ఉందంటూ చెప్పే డైలాగులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ఒక సీన్‌లో కరెంట్ పోయిన సమయంలో అచ్చియమ్మ నిరాకరిస్తున్నప్పటికీ, హీరో ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం వంటి అంశాలు థియేటర్లలో ప్రేక్షకులను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాయి.

'మెయిల్ గేజ్' (పురుషుల దృక్పథం) తోనే ప్రతి సీన్‌ను షూట్ చేశారంటూ సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ తీవ్రమైన వ్యతిరేకతపై దర్శకుడు బుచ్చిబాబు సాన ఎక్స్ లో సుదీర్ఘమైన నోట్ రాస్తూ స్పందించారు.

తప్పు తెలుసుకున్నాం.. సీన్లు మారుస్తాం: బుచ్చిబాబు

"ఒక దర్శకుడిగా సినిమా అనేది ప్రేక్షకులను అలరించడానికి, స్ఫూర్తినింపడానికి మాత్రమే ఉపయోగపడాలని నేను నమ్ముతాను. అది ఎవరినీ అసౌకర్యానికి గురిచేయకూడదు, గౌరవానికి భంగం కలిగించకూడదు" అని బుచ్చిబాబు అన్నారు.

"'పెద్ది' చిత్రంలోని కొన్ని సీన్లపై వస్తున్న ఫీడ్‌బ్యాక్‌ను మేము చాలా సీరియస్‌గా తీసుకున్నాం. వెండితెరపైనా, నిజజీవితంలోనూ నాకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉంది. ఏ మహిళా పాత్రను తక్కువ చేసి చూపించాలనే ఉద్దేశం మాకు లేదు. ఒకవేళ సినిమాలోని ఏ భాగమైనా అలా అనిపించి ఉంటే, ప్రేక్షకుల సెంటిమెంట్లను గౌరవిస్తూ మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాము" అని బుచ్చిబాబు పేర్కొన్నారు.

ప్రేక్షకులతో ఏర్పడే బంధం వల్లే

అంతటితో ఆగకుండా, విమర్శలు వచ్చిన సీన్లను వెంటనే సవరించనున్నామని డైరెక్టర్ బుచ్చిబాబు సాన ప్రకటించారు. "ప్రేక్షకులతో ఏర్పడే బంధం వల్లే సినిమా ఎదుగుతుంది. సమాజంలో మారుతున్న ఆలోచనలు, సున్నితత్వాలను గమనించాల్సిన బాధ్యత కథకులుగా మాపై ఉంది" అని బుచ్చిబాబు తెలిపారు.

"ప్రతి మహిళ గౌరవించబడాలి, విలువైనదిగా చూడబడాలి. అందుకే విమర్శలు వచ్చిన ఆయా సీన్లలో మార్పులు చేయాలని మేము నిర్ణయించాము. తమ అభిప్రాయాలను నిజాయితీగా పంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని బుచ్చిబాబు తన లేఖలో ముగించారు.

బాక్సాఫీస్ వద్ద తగ్గని 'పెద్ది' జోరు

జాన్వీ కపూర్ పాత్ర చిత్రణపై ఇంత వివాదం నడుస్తున్నప్పటికీ, రామ్ చరణ్ బాక్సాఫీస్ స్టామినాకు ఇవేమీ అడ్డంకిగా మారలేదు. మాస్ ఆడియన్స్‌కు ఈ స్పోర్ట్స్ డ్రామా విపరీతంగా నచ్చేయడంతో థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి.

కేవలం రెండు రోజుల్లోనే వరల్డ్‌వైడ్‌గా రూ. 150 కోట్ల గ్రాస్ సాధించి, రామ్ చరణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది పెద్ది. ఇప్పుడు వివాదాస్పద సీన్లను కత్తిరించడం లేదా మార్చడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు మరింతగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో కలెక్షన్స్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More