Peddi Box Office: పెద్ది ఆటతో కొట్టుకుపోయిన బాలీవుడ్ మెగాహిట్స్- టాప్ 3లో రామ్ చరణ్ మూవీ- తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?
Peddi Box Office Collection Day 1: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ ఊచకోత మొదలైంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన పెద్ది బాక్సాఫీస్ వద్ద తొలిరోజే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించి, రామ్ చరణ్ సోలో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది.
Peddi Box Office Collections Day 1: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఏంటో 'పెద్ది' సినిమా నిరూపించింది. సూపర్ హిట్ 'ఆర్ఆర్ఆర్', ఫ్లాప్ మూవీ 'గేమ్ ఛేంజర్' తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన పక్కా మాస్ స్పోర్ట్స్ డ్రామా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి.

పెద్ది బాక్సాఫీస్ విధ్వంసం
'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య గురువారం (జూన్ 4) విడుదలైన 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఊహించని రేంజ్‌లో విధ్వంసం మొదలుపెట్టింది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే కనిపిస్తున్న ఈ ట్రెండ్, తొలిరోజు కలెక్షన్స్‌లో స్పష్టంగా కనిపించింది. రామ్ చరణ్ మాస్ పవర్ ముందు బాక్సాఫీస్ రికార్డులు బద్దలయ్యాయి.
బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ఊచకోత
దేశవ్యాప్తంగా సుమారు 3000 స్క్రీన్లలో విడుదలైన 'పెద్ది', అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 20 కోట్ల గ్రాస్ వసూలు చేసి, దాదాపు 8.2 లక్షల టిక్కెట్లు తెగడం సినిమాపై ఉన్న అంచనాలకు అద్దం పట్టింది. సక్నిల్క్ నివేదిక ప్రకారం, భారత్‌లో తొలిరోజు పెద్ది సినిమా రూ. 40.66 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది.
ఇందులో అత్యధిక వాటా తెలుగు రాష్ట్రాల నుంచే ఉంది. తెలుగు వెర్షన్ ఏకంగా రూ. 36.99 కోట్ల నెట్ సాధించింది. థియేటర్లలో రోజంతా 68 శాతానికి పైగా ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. కాగా, బుధవారం రాత్రి వేసిన పెయిడ్ ప్రీవ్యూస్ ద్వారానే రూ. 18.50 కోట్లు రాబట్టింది. వీటితో కలుపుకుని 'పెద్ది' మొత్తం తొలిరోజు కలెక్షన్స్ రూ. 59.16 కోట్లకు చేరాయి. ఇది రామ్ చరణ్ సోలో కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్.
'పఠాన్', 'గద్దర్ 2' రికార్డులు అవుట్..
'పెద్ది' ఊపు ముందు పలు బాలీవుడ్ మెగాహిట్‌లు కొట్టుకుపోయాయి. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' (రూ. 30 కోట్లు), సన్నీ డియోల్ 'గద్దర్ 2' (రూ. 40 కోట్లు), షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ. 57 కోట్లు) ఫస్ట్ డే కలెక్షన్స్‌ను 'పెద్ది' అధిగమించింది (ప్రీవ్యూలతో కలుపుకుని).
అలాగే, రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' రికార్డును కూడా తుడిచిపెట్టేసింది. 'గేమ్ చేంజర్' తొలిరోజు రూ. 50 కోట్లు సాధించినా, నెగిటివ్ టాక్ వల్ల తర్వాత చతికిలపడింది. కానీ, 'పెద్ది'కి పాజిటివ్ రివ్యూలు వస్తుండటంతో లాంగ్ రన్ ఊహించని విధంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
హిందీలో మాత్రం డిసప్పాయింట్
కాగా, పాన్ ఇండియా సినిమాగా ప్రచారం చేసినా హిందీ బెల్ట్‌లో 'పెద్ది' ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అక్కడ కేవలం 15 శాతం ఆక్యుపెన్సీతో రూ. 2.84 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఉత్తరాది ప్రేక్షకులకు రామ్ చరణ్ ముఖం పరిచయం ఉన్నా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించినా హిందీ ఓపెనింగ్స్ నిరాశపరిచాయి.
పెద్ది వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఏది ఏమైనా, 2026లో అత్యుత్తమ ఓపెనింగ్స్ సాధించిన భారతీయ సినిమాలలో 'పెద్ది' మూడో స్థానంలో (టాప్ 3) నిలిచింది. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్ 2' (రూ. 102 కోట్లు), ప్రభాస్ 'ది రాజా సాబ్' (రూ. 62 కోట్లు) తర్వాత 'పెద్ది' నిలిచింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా పెద్ది సినిమాకు తొలి రోజు రూ. 112.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ఇండియా టుడే పేర్కొంది.
11వ తెలుగు సినిమాగా
దీంతో గ్లోబల్‌గా 100 కోట్ల ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టిన 11వ తెలుగు సినిమాగా రికార్డ్ సాధించింది రామ్ చరణ్ పెద్ది సినిమా. ఇక ఇండియాలో రూ. 80 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


