Anirudh Kavya Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లికి నిర్మల సీతారామన్, రిసెప్షన్‌కి సోనియా గాంధీ- కళానిధి మారన్ ఆహ్వానం!
Anirudh Kavya Wedding Invitation To Sonia Gandhi Nirmala Sitharaman: అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ల వివాహ వేడుక పనులు వేగవంతమయ్యాయి. నవంబర్ 21న చెన్నైలో జరగనున్న వీరి వెడ్డింగ్ రిసెప్షన్‌కు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లను కళానిధి మారన్ స్వయంగా ఆహ్వానించారు.
Anirudh Kavya Wedding Invitation To Sonia Gandhi Nirmala Sitharaman: ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌ల పెళ్లి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్దిరోజులుగా ప్రచారంలో ఉన్న వీరి పెళ్లి వార్తలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా అధికారిక ముద్ర పడగా, తాజాగా వివాహ ఆహ్వానాల పర్వం శరవేగంగా సాగుతోంది.

ఢిల్లీలో వెడ్డింగ్ కార్డులు పంపిణీ చేసిన కళానిధి మారన్
నవంబర్ 21న చెన్నై నగరంలో వైభవంగా జరగనున్న వివాహ విందు (రిసెప్షన్) కోసం సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్, ఆయన సతిమణి కావేరి మారన్లు దేశరాజధాని ఢిల్లీలో పలువురు ప్రముఖులను కలిశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి రిసెప్షన్ కార్డును అందించారు.
ఆర్థిక శాఖ మంత్రికి ఇన్విటేషన్
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొన్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను సన్ నెట్‌వర్క్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.
రేవంత్ రెడ్డి ట్వీట్‌తో బయటపడ్డ అసలు విషయం
అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ల వివాహ వార్తలు చాలాకాలంగా వార్తల్లో నిలుస్తున్నప్పటికీ, ఇరు కుటుంబాలు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఇటీవల హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిన కళానిధి మారన్ దంపతులు, ఆయనను పెళ్లికి ఆహ్వానించారు.
సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
"సన్ గ్రూప్ ఛైర్మన్ శ్రీ కళానిధి మారన్, వారి సతిమణి శ్రీమతి కావేరీ మారన్ నన్ను కలసి కావ్య మారన్-అనిరుధ్ రవిచందర్ వివాహ విందుకు ఆహ్వానించారు" అని సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో ఈ విషయం అధికారికంగా బయటకు వచ్చింది.
ఐపీఎల్ పాపులారిటీ, అనిరుధ్ మ్యూజిక్ మ్యాజిక్
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మ్యాచ్‌ల వేళ స్టేడియంలో కనిపించే కావ్య మారన్‌కు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన క్రేజ్ ఉంది. మ్యాచ్‌లలో జట్టు జయాపజయాల వేళ ఆమె ఇచ్చే హావభావాలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి.
సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు
అంతేకాకుండా.. షారుఖ్ ఖాన్ 'కింగ్', రజనీకాంత్ 'ధర్మన్', కమల్ హాసన్ 'భారతీయుడు 3' (ఇండియన్ 3) ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు అనిరుధ్ రవిచందర్. ఇకపోతే చెన్నై వేదికగా జరగనున్న అనిరుధ్, కావ్య వివాహ వేడుకకు సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


