Akshara Haasan: మూడుసార్లు 10th ఫెయిల్, చదువు ఆపేశా, ఎప్పటికైనా డైరెక్టర్ అవుతా: కమల్ హాసన్ చిన్నకూతురు అక్షర హాసన్

Akshara Haasan About High School Fail And Direction: విశ్వనటుడు కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్ తన వ్యక్తిగత, సినీ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైస్కూల్‌లో మూడుసార్లు ఫెయిల్ అయి చదువు వదిలేశానని, నటనలోకి రాకముందు కొరియోగ్రాఫర్‌గా పనిచేశానని వెల్లడించారు.

Published on: Oct 2, 2026, 10:10:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Akshara Haasan About High School Fail And Direction: సినిమా పరిశ్రమలో స్టార్ కిడ్స్ ప్రయాణం అనగానే అందరూ పూలబాట అని అనుకుంటారు. కానీ, వారి వెనుక ఎన్నో రకాల సవాళ్లు, సొంత నిర్ణయాలు ఉంటాయి. లోకనాయకుడు కమల్ హాసన్, నటి సారికల చిన్న కుమార్తె, శ్రుతి హాసన్ చెల్లెలు అక్షర హాసన్ ఇటీవల సైరస్ బ్రూచా పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను పంచుకున్నారు.

మూడుసార్లు 10th ఫెయిల్, చదువు ఆపేశా, ఎప్పటికైనా డైరెక్టర్ అవుతా: కమల్ హాసన్ చిన్నకూతురు అక్షర హాసన్
మూడుసార్లు 10th ఫెయిల్, చదువు ఆపేశా, ఎప్పటికైనా డైరెక్టర్ అవుతా: కమల్ హాసన్ చిన్నకూతురు అక్షర హాసన్

కొరియోగ్రాఫర్‌గా తొలి అడుగులు.. ఆ తర్వాతే నటన!

సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ, తన ప్రయాణం ఎంతో భిన్నంగా సాగిందని అక్షర వివరించారు. సాధారణంగా సినీ ప్రముఖుల పిల్లలు నేరుగా హీరోలుగా లేదా హీరోయిన్లుగా పరిచయమవుతుంటారు. అక్షర మాత్రం తన ప్రయాణాన్ని కొరియోగ్రాఫర్‌గా ప్రారంభించారు. మొదట స్నేహితుల మ్యూజిక్ వీడియోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసినట్లు ఆమె తెలిపారు.

"నా మొదటి ఉద్యోగం నటన కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ పని కూడా కాదు.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించాను. డైరెక్షన్ చేయాలనే లక్ష్యంతోనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ప్రయత్నించకుండా వద్దని ఎలా చెబుతాం అనే ఉద్దేశంతోనే నటనలోకి అడుగుపెట్టాను. భవిష్యత్తులో కచ్చితంగా మెగాఫోన్ పట్టి దర్శకత్వం వహిస్తాను" అని అక్షర హాసన్ వెల్లడించారు.

మూడుసార్లు ఫెయిల్.. చదువుకు గుడ్ బై!

నేటి రోజుల్లో సెలబ్రిటీలు తమ పరాజయాలను దాచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ అక్షర హాసన్ తన విద్యాభ్యాసం గురించి అత్యంత పారదర్శకంగా మాట్లాడారు. హైస్కూల్ చదువుల్లో తాను అనుకున్నంతగా రాణించలేకపోయానని చెప్పారు.

పాఠశాల విద్య పూర్తి కాకపోయినా, డ్యాన్స్ వంటి కళల్లో శిక్షణ తీసుకుని ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉందనే అంశంపై స్పందిస్తూ తన అనుభవాన్ని పంచుకున్నారు అక్షర హాసన్. హైస్కూలు (10వ తరగతి) పరీక్షల్లో వరుసగా మూడుసార్లు ఫెయిల్ కావడంతో చదువుపై ఆసక్తి పోయిందని, దాంతో ఇక పాస్ కావడం కష్టమని గ్రహించి చదువుకు స్వస్తి చెప్పినట్లు అంగీకరించారు.

'నటులు కావాలని ఒత్తిడి చేయలేదు'.. తల్లిదండ్రుల ప్రోత్సాహం

కమల్ హాసన్, సారిక వంటి దిగ్గజ నటుల కుమార్తె అయినప్పటికీ తమపై ఇంట్లో ఎలాంటి ఒత్తిడి లేదని అక్షర స్పష్టం చేశారు. నటన వైపు రావడం తమ సొంత నిర్ణయమని చెప్పారు.

"మేము నటుల పిల్లలం కాబట్టి కచ్చితంగా నటులమే కావాలని నా తల్లిదండ్రులు ఎప్పుడూ ఒత్తిడి తేలేదు. నటన ఇష్టం లేకపోతే వేరే రంగంలో స్థిరపడమని చెప్పారు. మీ మనసుకు నచ్చింది చేయమని చెప్పడమే మాపై ఉన్న పెద్ద బరువును దించింది" అని అక్షర హాసన్ పేర్కొన్నారు.

సినిమాల విషయానికొస్తే తమ ఇంట్లో నిర్మొహమాటంగా విమర్శలు చేసుకుంటామని తెలిపారు. నటన బాలేకపోతే "చాలా చెత్తగా నటించావు" అని ముఖం మీదే చెప్పేస్తారని, చిన్న చిన్న తప్పులను తమకే వదిలేసి నేర్చుకోమంటారని వివరించారు.

కెరీర్ మైలురాళ్లు

ఇకపోతే నటిగా మారకముందు అక్షర హాసన్ 2010లో రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో వచ్చిన 'సొసైటీ' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమాలో ఆమె తల్లి సారిక నటించారు. కమల్ హాసన్ తెరకెక్కించిన 'శభాష్ నాయుడు' చిత్రానికి సహాయ దర్శకురాలిగా సేవలందించారు అక్షర.

ప్రారంభంలో వచ్చిన అనేక నటన ఆఫర్లను తిరస్కరించారు అక్షర హాసన్. కానీ, 2015లో ఆర్. బాల్కీ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్, ధనుష్ కాంబినేషన్‌లో వచ్చిన 'షమితాభ్' చిత్రం ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేశారు అక్షర హాసన్. తమిళంలో అజిత్ కుమార్ సరసన 'వివేగం' (2017) చిత్రంలోనూ నటించారు. ఇటీవల 'సిమ్యులాక్రా' చిత్రంలో కనిపించి మెప్పించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More