Amitabh Jaya: భార్య లేట్ చేయకుండా త్వరగా రెడీ కావాలా? జయపై అమితాబ్ బచ్చన్ వాడే ట్రిక్ ఇదే! తిట్ల నుంచి కాపాడుతుందంటూ!
Amitabh Bachchan Trick To Wife Jaya Bachchan: తమ భార్యలు ఫంక్షన్స్, పార్టీలకు లేట్ కాకుండా త్వరగా రెడీ కావాలని చాలా మంది భర్తలు అనుకుంటారు. అందుకోసం తన భార్య జయా బచ్చన్‌పై వాడే ఓ ట్రిక్‌ను బిగ్ బి అమితాబ్ బచ్చన్ తాజాగా పంచుకున్నారు. అమితాబ్ చెప్పిన ట్రిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Amitabh Bachchan Trick To Wife Jaya Bachchan: భారతీయ సినీ పరిశ్రమలో ఐకానిక్ దంపతులుగా పేరుపొందిన అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ ఐదు దశాబ్దాలకు పైగా ఆదర్శ దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు. బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ ఓటీటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC 18) వేదికగా బిగ్ బీ తరచూ తన కుటుంబ విశేషాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజా ఎపిసోడ్‌లో
తాజాగా ప్రసారమైన ఒక ఎపిసోడ్‌లో భార్య జయా బచ్చన్‌తో ఉండే సరదా సన్నివేశాలను, ఆమె లేట్ కాకుండా ఉండేందుకు తాను వాడే ప్రత్యేక "ట్రిక్"ను బయటపెట్టారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.
సమయానికి రెడీ అవ్వాలంటే ఆ ఒక్క ప్లాన్!
కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొన్న ఒక మహిళా కంటెస్టెంట్ అమితాబ్‌ను ఒక సరదా ప్రశ్న అడిగారు. ఫంక్షన్లు, పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు జయా బచ్చన్ రెడీ అయ్యేంత వరకు మీరు వేచి చూస్తుంటారా? అని ప్రశ్నించగా బిగ్ బీ చిరునవ్వుతో సమాధానమిచ్చారు.
"మేము ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు నేను ఒక చిన్న ట్రిక్ ఫాలో అవుతాను. ఫంక్షన్ సమయం సాయంత్రం 6 గంటలు అయితే, ఆమెకు 5 గంటలకే అని చెప్తాను. దాంతో ఆమె 3:30 లేదా 4 గంటలకే సిద్ధమవ్వడం ప్రారంభిస్తారు. అలా మేము అనుకున్న సమయానికి సరిగ్గా చేరుకుంటాం" అని అమితాబ్ బచ్చన్ సరదాగా వెల్లడించారు.
ఇంటికి ఆలస్యమైతే ఆ వాట్సాప్ మెసేజే రక్షణ!
ఇంతకుముందు ఎపిసోడ్‌లో కూడా ఇంటికి ఆలస్యంగా వస్తే జయా బచ్చన్ కోప్పడతారా అని మరొక కంటెస్టెంట్ అడిగినప్పుడు అమితాబ్ బచ్చన్ సమయస్ఫూర్తితో వ్యవహరించే తీరును పంచుకున్నారు.
"రోజూ ఉదయాన్నే నిద్రలేవగానే ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో చేతులు జోడించిన ఎమోజీ పెట్టి సందేశం పంపుతాను. ఈరోజు షూటింగ్ ఆలస్యమవుతుంది, నాకోసం డిన్నర్ చేయకుండా వేచి చూడకండి అని ముందే చెప్పేస్తాను. అలా ముందుగానే సమాచారం ఇవ్వడం నన్ను తిట్ల నుంచి కాపాడుతుంది. ఒకవేళ చెప్పడం మరచిపోతే మాత్రం.. ఎక్కడున్నావ్? ఈ సమయానికి ఇంటికి రావడం ఏంటి? అని క్లాస్ పీకుతారు" అని బిగ్ బీ నవ్వులు పూయించారు.
50 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ ప్రయాణం
1971లో వచ్చిన 'గుడ్డి' సినిమా సెట్స్‌లో అమితాబ్, జయా బచ్చన్‌ల పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1972లో 'ఏక్ నజర్' చిత్రంలో నటిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య బంధం బలంగా మారింది. 1973లో వచ్చిన 'జంజీర్' సినిమా ఘనవిజయం సాధించడంతో స్నేహితులతో కలిసి లండన్ పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
కలిసి విదేశాలకు వెళ్లాలంటే
ఈ విషయంపై అమితాబ్ తన తండ్రి హరివంశరాయ్ బచ్చన్ అనుమతి కోరగా, "ఇద్దరూ కలిసి విదేశాలకు వెళ్లాలంటే ముందు పెళ్లి చేసుకోవాలి" అని ఆయన స్పష్టం చేశారు. తండ్రి మాటను గౌరవిస్తూ 1973 జూన్ 3న అత్యంత సన్మితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది.
మనవళ్లు, మనవరాళ్లతో
పెళ్లయిన వెంటనే అదే రోజు లండన్ విమానం ఎక్కేశారు అమితాబ్, జయా బచ్చన్ దంపతులు. శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్ వీరి పిల్లలు కాగా.. మనవళ్లు, మనవరాళ్లు అయిన నవ్య నవేలి, అగస్త్య నంద, ఆరాధ్య బచ్చన్‌లతో ఈ జంట ఎంతో సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


