Amitabh Bachchan: 3 ఫ్లోర్లు, 33 లక్షలు- 21.88 కోట్లకుపైగా ఆదాయం- అర్థరాత్రి 3 గంటలకు అమితాబ్ బచ్చన్ ఫోన్!
Amitabh Bachchan Leases 3 Floors For 33 Lakh: ముంబైలోని అందేరీ వెస్ట్‌లో ఉన్న తన కమర్షియల్ ప్రాపర్టీని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీజుకు ఇచ్చారు. ప్రముఖ న్యూట్రిషన్ బ్రాండ్‌కు మూడు ఫ్లోర్లను నెలకు రూ.33 లక్షల భారీ అద్దెకు అప్పగించారు. అలాగే, అయోధ్యలో రూ. 100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టారు.
Amitabh Bachchan Leases 3 Floors For 33 Lakh: బాలీవుడ్ షెహన్‌షా అమితాబ్ బచ్చన్ కేవలం వెండితెరపైనే కాదు, రియల్ ఎస్టేట్ పెట్టుబడుల్లోనూ తన మార్క్ చూపిస్తున్నారు. ముంబై సహా దేశంలోని పలు కీలక ప్రాంతాల్లో ప్రాపర్టీలు కొనుగోలు చేస్తూ భారీగా రాబడులు ఆర్జిస్తున్నారు.

మూడు ఫ్లోర్ల కమర్షియల్ స్పేస్
తాజాగా ముంబైలోని అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న తన మూడు ఫ్లోర్ల కమర్షియల్ స్పేస్‌ను ప్రముఖ న్యూట్రిషన్ సంస్థ 'ట్రూనాటివ్ ఎఫ్‌యాండ్‌బీ ప్రైవేట్ లిమిటెడ్' (TruNativ F&B Pvt Ltd) కు లీజుకు ఇచ్చారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్.
నెలకు రూ. 33 లక్షల అద్దె..
ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ డేటా ప్లాట్‌ఫామ్ 'జాప్‌కీ' (Zapkey) సేకరించిన పత్రాల ప్రకారం ఈ డీల్ ఖరారైంది. అందేరీ వెస్ట్‌లోని ఓషివారా లింక్ రోడ్డులో ఉన్న 'సిగ్నేచర్' భవనంలో పై అంతస్తులలోని మూడు ఫ్లోర్లను అమితాబ్ లీజుకు ఇచ్చారు. మొత్తం 8,428 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన ఈ ప్రాపర్టీకి నెలకు రూ.33 లక్షల అద్దె చెల్లించేలా ఒప్పందం కుదిరింది.
రూ. 21.88 కోట్లకుపైగా అద్దె
అంటే చదరపు అడుగుకు నెలకు సుమారు రూ.392 అద్దె లభిస్తోంది. 2026 ఆగస్టు 15 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదేళ్ల లీజు కాలంలో అమితాబ్‌కు మొత్తం రూ.21.88 కోట్లకు పైగా అద్దె రూపంలో రానుంది. ఈ ఒప్పందం కోసం కంపెనీ రూ.1.98 కోట్లను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది.
ఐదేళ్ల కాంట్రాక్ట్, 5 శాతం పెంపు
ప్రతి ఏటా అద్దెలో 5 శాతం పెంపు ఉండేలా లీవ్ అండ్ లైసెన్స్ అగ్రిమెంట్ రూపొందించారు. భవనంలో తొమ్మిది వాహనాలను పార్కింగ్ చేసుకునే ప్రత్యేక హక్కును కూడా ఈ లీజులో కల్పించారు.
లోటస్ సిగ్నేచర్ బిల్డింగ్‌లో
ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అమితాబ్ బచ్చన్ లీజు డీల్స్ కొత్తేమీ కాదు. 2023లో కూడా లోటస్ సిగ్నేచర్ బిల్డింగ్‌లోని తన నాలుగు ఆఫీసు యూనిట్లను ప్రముఖ సంగీత సంస్థ 'వార్నర్ మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్'కు లీజుకు ఇచ్చారు.
కమర్షియల్ ప్రాపర్టీలపై బిగ్ బీ దృష్టి
2024 మార్చి నుంచి అమల్లోకి వచ్చిన ఆ ఒప్పందం ద్వారా అమితాబ్ బచ్చన్‌కు నెలకు రూ.17.30 లక్షల ఆదాయం వస్తోంది. ముంబైలో కమర్షియల్ ప్రాపర్టీలకు ఉన్న భారీ డిమాండ్‌ను బిగ్‌బీ సరిగ్గా సద్వినియోగం చేసుకుంటున్నారు.
అయోధ్యలోనూ రూ.100 కోట్ల దాకా పెట్టుబడులు
ముంబైకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోనూ అమితాబ్ భారీగా భూములు కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) ప్రాజెక్టులలో ఆయన వరుసగా పెట్టుబడులు పెడుతున్నారు.
అర్థరాత్రి 3 గంటలకు ఫోన్
అయోధ్యలో 15 వేల చదరపు అడుగుల ప్లాట్ కోసం అమితాబ్ స్వయంగా అర్థరాత్రి 3 గంటలకు ఫోన్ చేసి మాట్లాడారని అభినందన్ లోధా ఒక సదస్సులో వెల్లడించారు. 2026 మార్చిలో కూడా అయోధ్యలో రూ.35 కోట్లతో 2.67 ఎకరాల భూమిని బిగ్ బీ కొనుగోలు చేశారు. అయోధ్యలో ఆయనకు ఇది మూడో పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ కావడం గమనార్హం.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


