Niharika: ఆత్మను చంపేశారు, పవిత్రత పోయింది.. హీరోయిన్ నిహారిక హిందీ సినిమా రీమిక్స్ పాటపై సంగీత దర్శకుడు ఫైర్

Jatin Pandit On Niharika NM Remix Song: తెలుగు హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ నటించిన లేటెస్ట్ హిందీ సినిమా భాయ్ తేరా స్టార్ హై. ఈ సినిమాలోని రీమిక్స్ చేసిన ఆంఖో సే తునే 2.O సాంగ్‌పై ప్రముఖ సంగీత దర్శకుడు జతిన్ పండిత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాటలోని ఆత్మను చంపేశారని, పవిత్రత పోయిందని ఆరోపించారు.

Published on: Aug 1, 2026, 11:44:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jatin Pandit On Niharika NM Remix Song: 90వ దశకంలో భారతీయ సంగీత ప్రియులను ఊపేసిన "ఆంఖో సే తునే కా కెహ్ దియా" పాట రీమిక్స్ రూపంలో మళ్లీ ముందుకొచ్చింది. అయితే ఈ కొత్త వెర్షన్ 'ఆంఖో సే తునే 2.0'పై ఒరిజినల్ కంపోజర్ జతిన్ పండిత్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఆత్మను చంపేశారు, పవిత్రత పోయింది.. హీరోయిన్ నిహారిక హిందీ సినిమా రీమిక్స్ పాటపై సంగీత దర్శకుడు ఫైర్
ఆత్మను చంపేశారు, పవిత్రత పోయింది.. హీరోయిన్ నిహారిక హిందీ సినిమా రీమిక్స్ పాటపై సంగీత దర్శకుడు ఫైర్

తెలుగు హీరోయిన్ హిందీ సినిమా

బాలీవుడ్ పాపులర్ యంగ్ యాక్టర్ రాఘవ్ జుయల్, తెలుగు హీరోయిన్ నిహారిక ఎన్ఎమ్ నటించిన హిందీ సినిమా 'భాయ్ తేరా స్టార్ హై'లో ఈ రీమిక్స్ పాటను ఉపయోగించారు. పాటలోని మధురమైన భావాన్ని పూర్తిగా నాశనం చేశారని జతిన్ వ్యాఖ్యానించారు.

23 మిలియన్లకు పైగా వ్యూస్

తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియో విడుదల చేస్తూ జతిన్ పండిత్ రీమిక్స్ సంస్కృతిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ రీమిక్స్ పాటకు యూట్యూబ్‌లో 23 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం చూసి ఆశ్చర్యపోయానని ఆయన చెప్పారు.

ఆత్మ లేని డ్యాన్స్ ట్రాక్.. ఏఐ తయారు చేసినట్లుంది!

"ఈ రీమిక్స్ పాటలోని ఆత్మను పూర్తిగా చంపేశారు. ఒరిజినల్ పాటలో ఉన్న కుమార్ సాను, ఆల్కా యాగ్నిక్ గొంతులను అలాగే ఉంచినప్పటికీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రొటీన్‌గా తయారుచేసినట్లు అనిపిస్తోంది" అని జతిన్ పండిత్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది ఒక మధురమైన రోమాంటిక్ పాట అని, దానికి వేగవంతమైన బీట్లు జోడించి డ్యాన్స్ నంబర్‌గా మార్చడం సరికాదని ఆయన అన్నారు. టెంపో పెంచడం వల్ల పాట మూల నైజమే దెబ్బతిందని పేర్కొన్నారు.

రీమిక్స్ విన్నవారు ఒరిజినల్ కూడా వినండి!

1998లో అమీర్ ఖాన్, రాణి ముఖర్జీ జంటగా విక్రమ్ భట్ దర్శకత్వంలో వచ్చిన 'గులామ్' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. జతిన్-లలిత్ ద్వయం అందించిన స్వరాలు ఆల్బమ్‌లోని ప్రతీ పాటను సూపర్ హిట్ చేశాయి.

"రీమిక్స్ పాట విన్నవారంతా దయచేసి ఒక్కసారి ఒరిజినల్ పాటను కూడా వినండి. ఒరిజినల్ పాటలో ఒక ప్రశాంతత, పవిత్రత ఉన్నాయి. ఆ పవిత్రతకు భంగం కలిగినప్పుడు మనసుకు బాధగా అనిపిస్తుంది" అని జతిన్ శ్రోతలను కోరారు. పాటలోని ప్రాణాన్ని తీసేస్తున్న ఈ రీమిక్స్ సంస్కృతిని చూస్తుంటే సంగీత పరిశ్రమ భవిష్యత్తు ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదని జతిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

రీమిక్స్ పేరిట నాశనం

ప్రస్తుతం బాలీవుడ్‌లో పాత క్లాసిక్ పాటలను రీమిక్స్ పేరిట నాశనం చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. సృజనాత్మకత లోపించి, పాత పాటల పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని మ్యూజిక్ లవర్స్ కూడా పెదవి విరుస్తున్నారు.

నిహారిక ఎన్ఎమ్ సినిమాలు

ఇదిలా ఉంటే, నిహారిక ఎన్ఎమ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా, కంటెంట్ క్రియేటర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. మహేశ్ బాబు, యశ్, అడివి శేష్ వంటి స్టార్ హీరోలతో మూవీ ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ వైరల్ అయింది. అలాంటి నిహారిక ఎన్ఎమ్ తమిళ సినిమా పెరుసుతో నటిగా తెలుగు మూవీ మిత్ర మండలి ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More