Adivi Sesh: నేను ఇండస్ట్రీ పెద్ద కొడుకుని.. లైట్లు మోశాను.. చేయని పని లేదు.. ప్రాణం పెట్టా.. వేరే దారి లేదు: అడివి శేష్
Adivi Sesh: అడివి శేష్ ఎమోషనల్ అయ్యాడు. డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్ లో అతడు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. తాను ఇండస్ట్రీ పెద్ద కొడుకుని అని, ఆడియెన్స్ తన ఫ్యామిలీ అని అన్నాడు. సెట్స్ లో తాను చేయని పని లేదని చెప్పాడు.
Adivi Sesh: డెకాయిట్ మూవీతో కెరీర్లో మరో సక్సెస్ అందుకున్న హీరో అడివి శేష్. తాజాగా వచ్చిన ఈ లవ్ స్టోరీ కమ్ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. రెండు రోజుల్లోనే రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో అడివి శేష్ ఎమోషనల్ గా మాట్లాడాడు.

ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలని..
డెకాయిట్ మూవీ సక్సెస్ మీట్ లో అడివి శేష్ మాట్లాడుతూ.. “డెకాయిట్ నా కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ. నేనెప్పుడూ ఒకటి అనుకుంటూ ఉండే వాడిని. ఇంట్లో నేనే పెద్ద కొడుకుని. ఆ బాధ్యతలేంటో నాకు తెలుసు. ఇండస్ట్రీలోనూ నేను పెద్ద కొడుకునే అనుకుంటాను. నేను సెట్స్ లో లైట్లు మోశాను.. కెమెరా మోశాను.. ట్రైపాడ్ మోశాను.. జనరేటర్లు మోశాను.. నేను చేయని పని లేదు. ఆడియెన్సే నా ఫ్యామిలీ.. ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలనుకున్నాను. నాకు వేరే దారి లేదు. మరో పని రాదు. ప్రాణం పెట్టాను..” అని శేష్ ఎమోషనల్ అయ్యాడు.
నిర్మాత సుప్రియ గురించి..
డెకాయిట్ మూవీ నిర్మాత సుప్రియ గురించి కూడా శేష్ గొప్పగా మాట్లాడాడు. తాను పని చేసిన నిర్మాతల్లో బెస్ట్ ఆమెనే అని, ఇది ఎంతో మంది ప్రముఖ నిర్మాతల ముందుకు తాను చెబుతున్నానని అంటూ శేష్ భావోద్వేగానికి గురయ్యాడు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను..
ఇక తనకు ఎదురైన చేదు అనుభవం గురించి కూడా ఈ సందర్భంగా అతడు వెల్లడించాడు. “నేను గతంలో కిస్ అనే ఓ మూవీ చేశాను. అనివార్య కారణాల వల్ల ఆ సినిమాపై ఓ కేసు వేశారు. ఢిల్లీ పోలీస్ స్టేషన్ కు వెళ్లాను. చుట్టూ పోలీసులు.. నన్ను ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో ఒకటే అనుకున్నాను.. ఇక నుంచి ఏ సినిమా చేసినా ఎవరో చెప్పింది విని చేయకూడదు.. మనసుకు నచ్చితేనే చేయాలి అని డిసైడయ్యాను” అని అడివి శేష్ చెప్పాడు.
డెకాయిట్ మూవీ బాక్సాఫీస్
డెకాయిట్ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 10) థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ సినిమాకు తొలి రోజు నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. దీంతో బాక్సాఫీస్ దగ్గర కూడా దూసుకెళ్తోంది. తొలి రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.28 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇండియాలోనే నెట్ వసూళ్లు రూ.13 కోట్లు దాటాయి. ఆదివారం ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. వరుసగా థ్రిల్లర్ జానర్ లో మూవీస్ చేస్తూ వస్తున్న అడివి శేష్.. ఈ డెకాయిట్ తో దానికి బ్రేక్ ఇచ్చాడు. లవ్ కమ్ యాక్షన్ తో వచ్చి సక్సెస్ సాధించాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


