Deva Death: సినీ లోకంలో విషాదం- ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత- రజనీకాంత్ టైటిల్ కార్డ్ బీజీఎమ్ కొట్టింది ఈయనే!

Music Director Deva Passed Away At 75: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 'గానా మేస్ట్రో'గా గుర్తింపు పొందిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (75) చెన్నైలోని ఆసుపత్రిలో శనివారం తుదిశ్వాస విడిచారు. 40 ఏళ్ల సినీ ప్రయాణంలో 400కి పైగా చిత్రాలకు స్వరాలు అందించిన ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

Published on: Oct 17, 2026, 12:52:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Music Director Deva Passed Away At 75: దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన జానపద 'గానా' పాటలతో శ్రోతలను ఊపేసిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవా (దేవనేసన్ చొక్కలింగం) కన్నుమూశారు. 75 సంవత్సరాల వయస్సున్న ఆయన చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం (అక్టోబర్ 17) తుదిశ్వాస విడిచారు.

సినీ లోకంలో విషాదం- ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత- రజనీకాంత్ టైటిల్ కార్డ్ బీజీఎమ్ కొట్టింది ఈయనే!
సినీ లోకంలో విషాదం- ప్రసిద్ధ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత- రజనీకాంత్ టైటిల్ కార్డ్ బీజీఎమ్ కొట్టింది ఈయనే!

తెలుగు, తమిళ, కన్నడ పరిశ్రమలో విషాదం

దేవనేసన్ చొక్కలింగ మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులు ఇంకా వెల్లడించలేదు. అభిమానులు, సినీ ప్రముఖుల ఆఖరి చూపు కోసం ఆయన భౌతిక కాయాన్ని చెన్నై టీ నగర్‌లోని ఆయన నివాసంలో ఉంచారు. దేవా అకస్మాత్తుగా దూరమవ్వడంతో తమిళంతో పాటు తెలుగు, కన్నడ సినీ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.

తమిళ జానపదానికి పట్టం కట్టిన సంగీత వేత్త

సాధారణంగా వీధులకే పరిమితమైన తమిళ జానపద ‘గానా’ శైలిని వెండితెరపైకి తీసుకొచ్చి, దానికి విశేష ప్రజాదరణ కల్పించిన ఘనత దేవాకే దక్కుతుంది. తన విలక్షణమైన స్వరాలు, వినసొంపైన మెలోడీలతో కొన్ని దశాబ్దాల పాటు కోలీవుడ్‌ను ఊపేసారు.

తమిళ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్నారు దేవా. నాలుగు పదుల సినీ సుదీర్ఘ ప్రయాణంలో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏకంగా 400 కంటే ఎక్కువ చిత్రాలకు అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు.

రజనీకాంత్ టైటిల్ కార్డ్ వెనుక

సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రాలు ప్రారంభమయ్యేటప్పుడు వచ్చే ఐకానిక్ 'రజనీ టైటిల్ కార్డ్' థీమ్ మ్యూజిక్ వెనుక ఉన్నది ఈయన స్వరకల్పనే కావడం విశేషం. ఇప్పటికీ రజనీ సినిమా మొదలవుతుంటే థియేటర్లలో వినిపించే ఆ విజిల్, రోమాంచిత సంగీతం దేవా మార్క్ ముద్రకు నిదర్శనం.

రజనీకాంత్ నటించిన 'బాషా', 'అరుణాచలం' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు దేవా ఇచ్చిన మాస్, మెలోడీ పాటలను తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ మరచిపోలేరు. సినిమాల్లోకి రాకముందు దేవా ప్రయాణం ఎన్నో సవాళ్లతో సాగింది. చిత్ర పరిశ్రమలో ప్రారంభంలో చిన్నచిన్న అవకాశాలు వచ్చినా, ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.

కృషితో సాగిన తొలి అడుగులు

ఆ సమయంలో దూరదర్శన్ పోదిగై ఛానెల్‌లో 'వయలుమ్ వాళ్వుమ్' అనే కార్యక్రమానికి పాటలు స్వరపరిచారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా గురువైన ధన్‌రాజ్ మాస్టర్ వద్దే దేవా పియానో నేర్చుకున్నారు. జేబీ కృష్ణ వద్ద హార్మోనియంపై భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించారు. 1980ల కాలంలో వందలాది భక్తి గీతాలను స్వరపరిచి శ్రోతలను అలరించారు.

దేవా సోదరులు సబేష్, మురళి ఇళయరాజాతో పాటు ఇతర ప్రముఖ సంగీత దర్శకుల వద్ద వాద్యకారులుగా పనిచేసేవారు. దేవా సినీ ప్రవేశంలో, ఆయన సక్సెస్ జర్నీలో సోదరుల మద్దతు ఎంతో కీలక పాత్ర పోషించింది.

స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టిన సినిమా

1986లో వచ్చిన 'మాట్టుక్కార మన్నారు' చిత్రంతో దేవా స్వతంత్ర సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో విడుదలైన 'మనసుక్కేత మహరాస', ఆ తర్వాత వచ్చిన 'వైగాసి పొరంథాచ్చు' వంటి చిత్రాలు ఆయనను స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా నిలబెట్టాయి. దేవా మృతితో దక్షిణాది సంగీత ప్రపంచం ఒక దిగ్గజాన్ని కోల్పోయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More