Netflix Malayalam Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో మైండ్ బ్లాంక్ చేసే టాప్ 5 మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే..గూస్ బంప్స్ పక్కా!

Netflix Malayalam Thrillers: మలయాళ సినీ ఇండస్ట్రీ అంటేనే థ్రిల్లర్ కంటెంట్ కు కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఉత్కంఠభరితమైన సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్లు తెలుగులో పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్నాయి. అద్భుతమైన స్క్రీన్ ప్లే, ట్విస్టులతో సాగే టాప్ 5 మలయాళ థ్రిల్లర్లు మీ కోసం. 

Published on: Nov 8, 2026, 21:49:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Netflix Malayalam Thrillers: మలయాళం సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తూనే ఉంటారు. అక్కడి కంటెంట్ కు మన జనాలు ఫిదా అవుతూనే ఉంటారు. ముఖ్యంగా మలయాళం థ్రిల్లర్లు అంటే ఎక్కడలేని క్రేజ్ ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఆడియన్స్ కోసం అలాంటి టాప్ 5 మూవీస్ లిస్ట్ ఇక్కడుంది. ఇవన్నీ తెలుగులో అందుబాటులో ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌లో మైండ్ బ్లాంక్ చేసే టాప్ 5 మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే..గూస్ బంప్స్ పక్కా!
నెట్‌ఫ్లిక్స్‌లో మైండ్ బ్లాంక్ చేసే టాప్ 5 మలయాళ క్రైమ్ థ్రిల్లర్స్ ఇవే..గూస్ బంప్స్ పక్కా!

ఇరట్ట (Iratta)

మలయాళం క్రైమ్ థ్రిల్లర్ ఇరట్ట నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జోజు జార్జ్ డ్యుయల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీలో సస్పెన్స్ వేరే లెవల్ లో ఉంటుంది. ఓ పోలీస్ స్టేషన్ లో ఎస్సై అనుమానస్పద స్థితిలో చనిపోతాడు. అతని కవల సోదరుడే ఆ కేసును ఎంక్వైరీ చేయడానికి వస్తాడు.

పోలీస్ స్టేషన్ లో కథను నడిపించిన తీరు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఇరట్ట మూవీని మస్ట్ వాచ్ గా మార్చింది. ఇక క్లైమాక్స్ లో రివీల్ అయ్యే లాస్ట్ 10 నిమిషాల ట్విస్ట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాంక్ అవాల్సిందే.

అన్వేషిప్పిన్ కండెతుమ్ (Anweshippin Kandethum)

ఒకే ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు హత్యల కేసులను ఓ యంగ్ ఎస్సై ఏలా సాల్వ్ చేశాడన్నదే ఈ మూవీ స్టోరీ. ఇందులో టొవినో థామస్ లీడ్ రోల్ ప్లే చేశాడు. 90ల నాటి వాతావరణం, పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఉండే రియలిస్టిక్ కష్టాలను కళ్లకు కట్టినట్లు చూపించడం వల్ల ఓటీటీలోని క్రైమ్ జానర్ లవర్స్ కు ఇది బాగా కనెక్ట్ అయింది.

కర్రీ అండ్ సైనైడ్ (Curry & Cyanide)

కేరళను కుదిపేసిన కూడత్తాయ్ వరుస హత్యల ఆధారంగా తెరకెక్కిన రియల్ లైఫ్ ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఇది. ఆస్తి కోసం ఒక కుటుంబంలోని ఆరు మందిని ఆ ఇంటి సాధారణ గృహిణి సైనైడ్ ఇచ్చి ఎలా చంపిందన్నది ఇందులో చూపించారు. పైకి ఎంతో పద్ధతిగా కనిపించే మహిళా పక్కా ప్లాన్ తో ఈ మర్డర్లు చేయడమే అసలు ట్విస్ట్.

నాయట్టు (Nayattu)

ఓ మర్డర్ కేసులో ఇరుక్కున్న ముగ్గురు పోలీసుల కథ ఇది. వీళ్లు సిస్టమ్ నుంచి ఎలా తప్పించుకున్నారన్నది నాయట్టు సినిమాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు. పాలిటిక్స్, పోలీసు వ్యవస్థ మధ్య ఉండే చీకటి కోణాలను ఇందులో ఉన్నది ఉన్నట్లు చూపించారు.

జనగణమన (Janaganamana)

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన పవర్ ఫుల్ లీగల్ థ్రిల్లర్ ఈ సినిమా. ఓ కాలేజీ ప్రొఫెసర్ మర్డర్ చుట్టూ కథ తిరుగుతుంది. కోర్టు రూమ్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పే డైలాగ్ లో వేరే లెవల్ లో ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ కోసమైనా ఈ సినిమాను ఓటీటీలో చూడాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More