...
...
Next Story

పాకిస్థాన్ వ్యక్తి ఇచ్చిన ధురంధర్ మూవీ రివ్యూ వైరల్.. సినిమా బాగుంది కానీ అదొక్కటే నచ్చలేదంటూ..

బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతున్న ధురంధర్ సినిమాకు ఓ పాకిస్థానీ రివ్యూ ఇవ్వడం ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. అతడు ఈ సినిమా బాగుందంటూ పాజిటివ్ రివ్యూ ఇచ్చినా.. ఒక్క విషయంలో మాత్రం తన అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Published on: Dec 23, 2025, 15:19:10 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

రణ్‌వీర్ సింగ్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar) పాకిస్థాన్‌లోని కరాచీ నేపథ్యంలో సాగుతుంది. అయితే ఈ సినిమా చూసిన ఒక అసలైన కరాచీ వాసి సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సినిమా మేకింగ్ అద్భుతంగా ఉన్నప్పటికీ.. కరుడుగట్టిన నేరస్తుడు రెహమాన్ డకాయిత్ పాత్రను గొప్పగా చూపించడం తనకు నచ్చలేదని అసహనం వ్యక్తం చేశాడు.

ధురంధర్ మూవీకి పాకిస్థానీ రివ్యూ..

పాకిస్థాన్ వ్యక్తి ఇచ్చిన ధురంధర్ మూవీ రివ్యూ వైరల్.. సినిమా బాగుంది కానీ అదొక్కటే నచ్చలేదంటూ..
పాకిస్థాన్ వ్యక్తి ఇచ్చిన ధురంధర్ మూవీ రివ్యూ వైరల్.. సినిమా బాగుంది కానీ అదొక్కటే నచ్చలేదంటూ..

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద రూ. 872 కోట్లు కొల్లగొట్టిన సినిమా 'ధురంధర్'. కరాచీలోని లియారీ టౌన్ గ్యాంగ్ వార్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను చూసిన ఒక పాకిస్థానీ నెటిజన్ 'రెడిట్' (Reddit) వేదికగా రాసిన రివ్యూ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

"కరాచీకి చెందిన వ్యక్తిగా ధురంధర్ సినిమాపై నా అభిప్రాయం" అనే టైటిల్‌తో ఆ నెటిజన్ రివ్యూ రాశాడు. ఈ మూవీలోని ప్లస్, మైనస్ పాయింట్లను చెబుతూ రివ్యూ కొనసాగించాడు. "ముందుగా చెప్పాలంటే సినిమా నాకు నచ్చింది. సినిమాటోగ్రఫీ, డైరెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. కచ్చితంగా చూడాల్సిన సినిమా" అని మెచ్చుకున్నాడు.

"దావూద్ ఇబ్రహీంను హీరోగా చూపిస్తే ఒప్పుకుంటారా?"

సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన గ్యాంగ్‌స్టర్ రెహమాన్ డకాయిత్ పాత్ర చిత్రణపై అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.

"అదొక కల్పిత కథ అని నాకు తెలుసు. కానీ, చిన్నప్పటి నుంచి ఆ క్రూరమైన నేరస్తుడి గురించి భయానక కథలు వింటూ పెరిగిన నాలాంటి వాళ్లకు.. తెరపై అతన్ని ఒక హీరోలా, గొప్పగా చూపించడం ఇబ్బందిగా అనిపించింది. పేరు మార్చి ఉంటే బాగుండేది. ఉదాహరణకు.. ఇండియాలో దావూద్ ఇబ్రహీం పాత్రను ఎవరైనా గొప్పగా చూపిస్తే మీకెలా అనిపిస్తుంది? నాకూ అలాగే అనిపించింది" అని రాసుకొచ్చాడు.

ఒక తప్పు దొర్లింది

రియల్ లైఫ్‌లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ చౌదరి అస్లాం.. భయానకమైన కాల్పులు జరుగుతున్నా సరే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకునేవాడు కాదట. అతని ధైర్యానికి అది నిదర్శనం. మేకర్స్ ఈ చిన్న డీటెయిల్‌ను మిస్ అయ్యారని తెలిపాడు.

ధురంధర్ సినిమా గురించి..

ధురంధర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లోని రెహమాన్ డకాయిత్ గ్యాంగ్‌లో చేరే ఇండియన్ ఏజెంట్‌గా రణ్‌వీర్ సింగ్ నటించాడు. ఇందులో అక్షయ్ ఖన్నా (రెహమాన్ డకాయిత్), సంజయ్ దత్ (ఎస్పీ అస్లాం), డానిష్ (ఉజైర్ బలోచ్) కూడా నటించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 872 కోట్లు వసూలు చేసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks