OTT: మూడు నెలల సస్పెన్స్‌కు తెర.. ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న మలయాళ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
OTT: మూడు నెలల సస్పెన్స్ కు తెరదించుతూ మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ పల్లిచట్టంబి (Pallichattambi) మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది. జులై 25 నుంచి తెలుగు సహా ఐదు భాషల్లో సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
OTT: మలయాళ వర్సటైల్ యాక్టర్ టొవినో థామస్, అందాల నటి కయదు లోహర్ మోస్ట్ అవేటెడ్ పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్ 'పల్లిచట్టంబి' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. థియేట్రికల్ రిలీజ్ తర్వాత దాదాపు మూడు నెలలుగా డిజిటల్ ప్రీమియర్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్న ఆడియన్స్‌కు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ (Sony LIV) గుడ్ న్యూస్ చెప్పింది. జులై 24 నుంచి ఈ సినిమా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది.

పల్లిచట్టంబి ఓటీటీ రిలీజ్ డేట్
భారీ అంచనాల మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్ర నిరాశనే మిగిల్చింది. 'జనగణమన' లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ అందించిన డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే థియేట్రికల్ రన్‌లో ఈ సినిమా ఆడియన్స్‌ను పెద్దగా మెప్పించలేక డిజాస్టర్‌గా నిలిచింది.
పల్లిచట్టంబి సినిమా డిజిటల్ రైట్స్‌ను సోనీ లివ్ ఓటీటీ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. జులై 24 నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఆడియోలతో ఈ పీరియడ్ డ్రామా స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రాబోతోంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
1950ల నాటి కేరళ బ్యాక్‌డ్రాప్ మిస్టరీ
1950ల నాటి కేరళ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్, ఓ చర్చిని రక్షించుకునే ప్రయత్నంతో సినిమా కథను డిజో జోస్ ఆంటోనీ రాసుకున్నారు. కమ్యూనిస్టుల పోరాటాలు, ఆ కాలం నాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టేలా చూపించే ప్రయత్నం చేశారు. కథ బాగున్నా, సెకండ్ హాఫ్‌లో స్క్రీన్‌ప్లే కాస్త సాగదీయడం, కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ అవ్వడం సినిమాకు మైనస్ పాయింట్‌గా మారాయి.
బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే క్రిస్టోఫర్ క్యారెక్టర్‌లో టొవినో థామస్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని చెప్పాలి. '2018', 'ARM' లాంటి భారీ హిట్స్ అందుకున్న టొవినో తన మార్క్ యాక్టింగ్‌తో సినిమాను వన్‌మ్యాన్ షోలా నడిపించారు. హీరోగా అతని లుక్, ఇంటెన్స్ ఫైట్ సీన్స్ ఆడియన్స్‌కు మంచి కిక్ ఇస్తాయి.
పృథ్వీరాజ్ సుకుమారన్ క్రేజీ కామియో
ఈ సినిమాలో టొవినో సరసన కయదు లోహార్ ఫీమేల్ లీడ్‌గా నటించింది. తెలుగులో 'అల్లూరి' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కయదు ఈ పీరియడ్ రోల్‌లో చాలా బాగా సెట్ అయింది. విలన్ రోల్‌లో శత్రుతో పాటు విజయరాఘవన్, సిద్ధిక్, బాబురాజ్ లాంటి సీనియర్ క్యాస్టింగ్ తమ యాక్టింగ్‌తో సీన్లను ఎలివేట్ చేశారు.
సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ మాలీవుడ్ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇచ్చిన స్పెషల్ కామియో అప్పియరెన్స్. క్లైమాక్స్ లో వచ్చే పృథ్వీరాజ్ ఎంట్రీ ఫ్యాన్స్‌కు పెద్ద సర్‌ప్రైజ్‌గా నిలుస్తుంది. వరల్డ్ వైడ్ ఫిల్మ్స్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్‌ను మరింత పెంచింది.
డైరెక్టర్ డిజో జోస్ ఆంటోనీ తన సినిమాల్లో పవర్‌ఫుల్ పొలిటికల్, సోషల్ మెసేజ్‌లు ఇవ్వడంలో స్పెషలిస్ట్. ఈ సినిమాలో కూడా కులమతాలకు అతీతంగా ప్రజలు కలిసి ఉండాలనే పాయింట్‌ను గట్టిగానే చెప్పారు. జేక్స్ బిజోయ్ ఇచ్చిన సాంగ్స్, హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీక్వెన్స్‌లకు మంచి వెయిట్ తీసుకొచ్చాయి. థియేటర్లలో డిజాస్టర్ అయినా, ఓటీటీలో ఇలాంటి ఇంటెన్స్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి డిజిటల్ ప్రీమియర్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


