OTT Telugu: ఓటీటీలో ప్రతి వారం తెలుగు సినిమాలు సందడి ఉంటుంది. ఈ వారం డిఫరెంట్ జోనర్ తెలుగు మూవీస్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. అలా ఇవాళ తెలుగు కామెడీ మూవీ ‘పాపం ప్రతాప్’ ఓటీటీలో రిలీజైంది. గురువారం (మే 7) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
పాపం ప్రతాప్ ఓటీటీ

లేటెస్ట్ తెలుగు కామెడీ ఫిల్మ్ ‘పాపం ప్రతాప్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు నుంచి పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది.
20 రోజులకే
విలేజ్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ‘పాపం ప్రతాప్’ సినిమా థియేటర్లో రిలీజైన 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ఏప్రిల్ 17, 2026న థియేటర్లో విడుదలైంది. ఈ కామెడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర మెప్పించలేకపోయింది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక బోల్తా కొట్టింది.
కామెడీ డ్రామా
పాపం ప్రతాప్ మూవీ కామెడీ డ్రామాగా థియేటర్లలో రిలీజైంది. ఇందులో తిరువీర్, పాయల్ రాధాకృష్ణ, అజయ్ ఘోష్, రాశి, దేవి ప్రసాద్, ప్రసాద్ బెహరా, గోపరాజు రమణ, రవి ఆంటోని, రఘుబాబు, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటించారు. ‘మసూద’, ‘పరేషాన్’ తదితర సినిమాలతో అలరించిన తిరువీర్ ఈ పాపం ప్రతాప్ మూవీలో తన స్టైల్లో కామెడీ పండించాడు. ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేష్ డైరెక్టర్.
పాపం ప్రతాప్ స్టోరీ
లంక గ్రామంలో పురుగుల మందు వ్యాపారం చేసే వీరయ్య (అజయ్ ఘోష్) కొడుకు ప్రతాప్ (తిరువీర్). అతను చిన్నప్పటి నుంచీ తన క్లాస్మేట్ బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఎంతో ప్రేమిస్తాడు. బుజ్జమ్మను ప్రేమలో పడేస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.
పంచాయితీ
{{/usCountry}}లంక గ్రామంలో పురుగుల మందు వ్యాపారం చేసే వీరయ్య (అజయ్ ఘోష్) కొడుకు ప్రతాప్ (తిరువీర్). అతను చిన్నప్పటి నుంచీ తన క్లాస్మేట్ బుజ్జమ్మ (పాయల్ రాధాకృష్ణ)ను ఎంతో ప్రేమిస్తాడు. బుజ్జమ్మను ప్రేమలో పడేస్తాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.
పంచాయితీ
{{/usCountry}}పెళ్లి తర్వాత ప్రతాప్, బుజ్జమ్మకు శోభనం జరుగుతుంది. మూడు రాత్రులు ముగుస్తాయి. అయితే ఆ వెంటనే ఊరి పెద్దలతో బుజ్జమ్మ పంచాయితీ పెట్టిస్తుంది. తన భర్త రాత్రి ఇబ్బంది పెడుతున్నాడని చెప్తుంది. కానీ అసలు సమస్య ఏంటో పూర్తిగా చెప్పదు. సమస్య ఏంటో తనే తెలుసుకుని, సరిదిద్దుకున్న తర్వాత మాత్రమే తనను కాపురానికి తీసుకురావాలని భర్తకు చెప్పి బుజ్జమ్మ వెళ్లిపోతుంది. దాంతో ప్రతాప్‌పై ఊరందరిలో అనుమానం మొదలవుతుంది.
ఆ తర్వాత ఏమైంది? ప్రతాప్‌లో ఉన్న సమస్య ఏంటీ? ప్రతాప్ గురించి ఊరంతా ఏమనుకున్నారు? బుజ్జమ్మను ప్రతాప్ ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు? బుజ్జమ్మ ప్రతాప్ ఒక్కటయ్యారా? లేదా? అనేది తెలియాలంటే? ఈ సినిమా చూడాల్సిందే.