...
...
Next Story

Paradox Harikatha: ‘మసూద’లో మాస్క్‌తో భయపెట్టింది.. ఇప్పుడు అసలు రూపంతో.. డిసెంబర్ 11న ‘పారడాక్స్ హరికథ’.. సాంగ్ రిలీజ్

Paradox Harikatha: సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రం ‘పారడాక్స్ హరికథ’. అనుదీప్ రెడ్డి కొత్తూరు దర్శకత్వంలో కిరణ్, రంజిత్, 'మసూద' ఫేమ్ అఖిల రామ్, లావణ్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.

Published on: Nov 12, 2026, 21:56:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Paradox Harikatha: ఐరావత సినీ కలర్స్, అగ్మైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై కడ్లూరి అశోక్, రాంపురం వెంకటేశ్వర్ రెడ్డి సమర్పణలో రూపొందుతున్న సినిమా ‘పారడాక్స్ హరికథ’. రంజిత్ కుమార్ గౌడ్, వివేకానంద, రఘు బల్లా, కవిత గోర సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Paradox Harikatha: ‘మసూద’లో మాస్క్‌తో భయపెట్టింది.. ఇప్పుడు అసలు రూపంతో.. డిసెంబర్ 11న ‘పారడాక్స్ హరికథ’.. సాంగ్ రిలీజ్
Paradox Harikatha: ‘మసూద’లో మాస్క్‌తో భయపెట్టింది.. ఇప్పుడు అసలు రూపంతో.. డిసెంబర్ 11న ‘పారడాక్స్ హరికథ’.. సాంగ్ రిలీజ్

చిత్ర విడుదల తేదీని డిసెంబర్ 11గా అధికారికంగా ప్రకటిస్తూ, చిత్రబృందం 'గుప్పెడంత ప్రేమ' అనే ఓ మంచి రొమాంటిక్ పాటను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు మహావీర్ మాట్లాడుతూ.. తనకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు అనుదీప్ పడిన కష్టం, అంకితభావం ఈ సినిమాను తప్పకుండా మంచి విజయం వైపు నడిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

‘మసూద’లో మాస్క్‌తో కనిపించాను.. ఈసారి వితౌట్ మాస్క్!: అఖిల రామ్

ఈ సాంగ్ రిలీజ్ వేడుకలో మూవీ టీమ్ మాట్లాడింది. నటి అఖిల రామ్ మాట్లాడుతూ.. "'పారడాక్స్ హరికథ' సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. గతంలో 'మసూద' సినిమాలో ప్రేక్షకులు నన్ను మాస్క్ లో చూశారు. కానీ ఈసారి మాస్క్ లేకుండా పూర్తిస్థాయి పాత్రలో మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమా అందరినీ తప్పకుండా అలరిస్తుంది" అని తెలిపింది.

నటుడు కిరణ్ స్పందిస్తూ.. "ఈ సినిమా ప్రయాణంలో దర్శకుడు అనుదీప్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. కథ వినగానే నాకు విపరీతంగా నచ్చింది. ఇలాంటి వైవిధ్యమైన కథలో భాగం కావాలని ప్రతి నటుడూ కోరుకుంటాడు" అని పేర్కొన్నాడు.

నటుడు మన్యం భాస్కర్ స్పందిస్తూ.. ఇందులో గతాన్ని, ప్రస్తుత కాలాన్ని దర్శకుడు ముడిపెట్టిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ప్రతి పాత్రను ఎంతో అందంగా తీర్చిదిద్దారని కొనియాడారు.

చరిత్రకు, నేటి తరానికి మధ్య ఆసక్తికర లింక్: డైరెక్టర్

తెలుగు తెరపై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని ఒక వినూత్న కాన్సెప్ట్‌తో 'పారడాక్స్ హరికథ' రూపొందిందని దర్శకుడు అనుదీప్ రెడ్డి కొత్తూరు స్పష్టం చేశారు. ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన నిర్మాతలకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, విజయవంతమైన చిన్న బడ్జెట్ చిత్రాల జాబితాలో తమ సినిమా తప్పకుండా నిలుస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

నిర్మాత కడ్లూరి అశోక్ మాట్లాడుతూ.. కుటుంబమంతా కలిసి చూడదగ్గ అన్ని కమర్షియల్, టెక్నికల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మించామని తెలిపారు.

ఆసక్తికరమైన టైటిల్, వినసొంపైన పాటలు, చరిత్ర-వర్తమానం కలగలిసిన సరికొత్త కథనంతో వస్తున్న 'పారడాక్స్ హరికథ' డిసెంబర్ 11న ప్రేక్షకులకు ఒక విభిన్నమైన సినిమాటిక్ అనుభూతిని అందించడానికి సిద్ధమైంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks