Prakash Raj Mother: ప్రకాష్ రాజ్ తల్లి కన్నుమూత.. ప్రగాఢ సానుభూతి తెలుపుతూ పవన్ కళ్యాణ్ ట్వీట్
Prakash Raj Mother: ప్రకాష్ రాజ్ తన తల్లి సువర్ణ లతను కోల్పోయాడు. ఆదివారం (మార్చి 29) ఆమె అంత్యక్రియలు జరిగాయి. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా ఆమె మరణానికి సానుభూతి తెలుపుతూ ట్వీట్ చేశాడు.
ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతని తల్లి సువర్ణలత కన్నుమూశారు. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్‌లో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 86 ఏళ్ల వయసున్న సువర్ణలత గత కొంతకాలంగా వయసు పైబడటం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

పవన్ కళ్యాణ్, విష్ణు వర్ధన్ రెడ్డి సంతాపం..
ఈ వార్త విన్న వెంటనే పవన్ కళ్యాణ్ తన ఎక్స్ అకౌంట్‌లో స్పందిస్తూ.. "ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి మాతృమూర్తి శ్రీమతి సువర్ణలత గారు శివైక్యం చెందారనే విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మాతృ వియోగంతో బాధపడుతున్న ప్రకాష్ రాజ్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను" అని రాసుకొచ్చారు.
అలాగే మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి కూడా రియాక్ట్ అవుతూ.. "ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి తల్లి సువర్ణలత గారు కన్నుమూశారనే వార్త విని నేను చాలా బాధపడ్డాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఈ కష్ట సమయంలో ప్రకాష్ రాజ్ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాను" అని పోస్ట్ చేశారు.
తల్లి ఆరోగ్యంపై ప్రకాష్ రాజ్
తన తల్లి ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యల గురించి ప్రకాష్ రాజ్ గతంలోనే చాలా ఓపెన్‌గా మాట్లాడాడు. ఆమెకు బ్రెయిన్‌లో ఒక సిస్ట్ (కణితి) ఉండటంతో సర్జరీ చేయాల్సి వచ్చిందని అతడు చెప్పాడు. ఆ సర్జరీ తర్వాత ఆమెకు సివియర్ మెమరీ లాస్ వచ్చిందని, కనీసం అత్యంత సన్నిహితులైన ఫ్యామిలీ మెంబర్స్‌ను కూడా గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్లిపోయారని అతడు ఎంతో ఎమోషనల్ అయ్యాడు.
2018లో జరిగిన ఇంటర్నేషనల్ సింపోజియం ఆన్ డిమెన్షియా ప్రోగ్రామ్‌లో అతడు మాట్లాడుతూ.. "కొన్ని నెలల క్రితం నేను ఒక సినిమాలో అల్జీమర్స్ పేషెంట్ రోల్ చేయాల్సి వచ్చింది. దానికోసం నేను నైటింగేల్స్ సెంటర్‌కు వెళ్లి కొన్ని గంటలు గడిపాను. సరిగ్గా అలాంటి పరిస్థితే మా అమ్మకు కూడా ఎదురైంది. ఆమె అల్జీమర్స్ పేషెంట్ కాదు కానీ, ఆమె బ్రెయిన్‌లో ఒక సిస్ట్ ఉండింది. సర్జరీ జరిగిన మూడు రోజులకే ఆమె తన సొంత చెల్లెలిని, కొడుకును కూడా మర్చిపోయింది. మా అమ్మ అన్నీ మర్చిపోయిందనే ఆలోచనే నన్ను వణికేలా చేసింది. ఆమెకు గతం గుర్తుకు రావాలని వాళ్ల పాత స్కూల్ ఫ్రెండ్స్‌ను పిలిపించి మాట్లాడించేవాడిని" అని తన మనసులోని బాధను అందరితో పంచుకున్నాడు.
ప్రకాష్ రాజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..
ఇక ప్రకాష్ రాజ్ సినిమాల విషయానికొస్తే.. రీసెంట్‌గా హిందీలో వచ్చిన 'తేరే ఇష్క్ మే' సినిమాలో ధనుష్ ఫాదర్ క్యారెక్టర్‌లో అతడు కనిపించాడు. తర్వాత దళపతి విజయ్ హీరోగా వస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా 'జన నాయగన్' సినిమాలో కూడా అతడు ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.
యాక్టర్‌గా విజయ్‌కి ఇదే లాస్ట్ రిలీజ్ కావడం విశేషం. నిజానికి ఈ సినిమా ఈ నెల మొదట్లోనే రిలీజ్ అవ్వాల్సింది. కానీ సెన్సార్‌షిప్ ఇష్యూస్ వల్ల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


