Anna Konidala: ఇక నుంచి నన్ను ఇలాగే పిలవండి.. ఆ రోజే నా భర్త ఇంటి పేరు తీసుకున్నాను: పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల
Anna Konidala: పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల అభిమానులకు ఓ రిక్వెస్ట్ చేసింది. తనను ఎలా పిలవాలో చెబుతూ.. ఇక నుంచి అన్నా లెజ్నెవా అని పిలవద్దని, అన్నా కొణిదెల అనే అనాలని ఆమె సూచించడం విశేషం.
Anna Konidala: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భార్య అన్నా కొణిదెల చేసిన లేటెస్ట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. తన పేరు విషయంలో మీడియా, నెటిజన్లు పదే పదే చేస్తున్న ఒక పెద్ద పొరపాటుపై ఆమె స్పందిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

తనను అందరూ ఇప్పటికీ 'అన్నా లేజ్నెవా' అని పిలవడంపై ఆమె స్పష్టత ఇచ్చారు. తన పుట్టినరోజు త్వరలోనే రాబోతున్న సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా చెప్పడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
"నా పెళ్లి రోజే ఇంటి పేరు మారిపోయింది!"
సోషల్ మీడియాలో అన్నా కొణిదెల స్పందిస్తూ.. "ఒక వ్యక్తికి పేరు అనేది చాలా పర్సనల్ విషయం. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ప్రారంభించినప్పటి నుంచి ఈ విషయం చెప్పాలనుకుంటున్నా. చాలాసార్లు రాసి డిలీట్ చేశా. ఇప్పుడు నా బర్త్‌డే రాబోతున్న వేళ ఓపెన్‌గా చెప్తున్నా. మా పెళ్లి వార్తలు బయటకు వచ్చినప్పుడు నన్ను అందరూ అన్నా లేజ్నెవాగానే గుర్తించారు" అని రాసుకొచ్చారు.
అయితే తమ వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే ఆ పేరు చివరిసారిగా కనిపిస్తుందని ఆమె తెలిపారు. "మా పెళ్లి జరిగిన ఆరోజే నేను నా భర్త ఇంటి పేరును స్వీకరించి అన్నా కొణిదెలగా మారాను. ఇప్పటివరకు ఈ పోస్ట్ చదివిన వారందరికీ నాదొక చిన్న విన్నపం. దయచేసి నన్ను అన్నా కొణిదెల అని మాత్రమే పిలవండి. అది నా పేరు, ఆ పేరులోనే నేను కంప్లీట్‌గా ఫీలవుతున్నా" అని ఎమోషనల్ అయ్యారు.
రష్యా ట్రిప్ జ్ఞాపకాలు.. పవన్ కళ్యాణ్‌తో స్పెషల్ ఫోటో
ఈ ఎమోషనల్ పోస్ట్‌తో పాటు పవన్ కళ్యాణ్‌తో కలిసి దిగిన ఒక బ్యూటిఫుల్ ఫోటోను కూడా ఆమె షేర్ చేశారు. తామిద్దరం కలిసి రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరానికి వెళ్లిన మొదటి ట్రిప్‌లో ఈ పిక్ తీశామని ఆమె క్యాప్షన్ లో జోడించారు. పవన్ కళ్యాణ్ కోటు ధరించి, బ్లాక్ సన్‌గ్లాసెస్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుండగా, ఆయన పక్కన అన్నా కొణిదెల నవ్వుతూ కనిపించారు.
ఈ పిక్ చూసిన మెగా ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తున్నారు. పోస్ట్ పెట్టిన కొద్ది గంటల్లోనే 60 వేలకు పైగా లైకులు, వేలాది కామెంట్లు వచ్చాయి. "ఖచ్చితంగా వదినమ్మ.. ఇకపై మిమ్మల్ని అన్నా కొణిదెల అనే పిలుస్తాం" అంటూ జనసేన సైనికులు, పవన్ ఫ్యాన్స్ కామెంట్ల రూపంలో తమ మద్దతు తెలుపుతున్నారు.
పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎం వరకు.. అన్నా కొణిదెల సపోర్ట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక విజయం సాధించి, ఏపీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంలో, అలాగే జనసేన విజయవంతమైన సందర్భాల్లో అన్నా కొణిదెల ఆయన వెంటే ఉంటూ పూర్తి సపోర్ట్ అందించారు. అన్నా కొణిదెల చేసిన ఈ పర్సనల్ అప్‌డేట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగా ఫ్యాన్స్ అందరూ ఆమెకు ముందస్తు బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


