Pawan Kalyan Wife: ఫిజికల్ నొప్పి కంటే అదే ఎక్కువ-ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా పని: పవన్ కళ్యాణ్ భార్య అన్నా ఎమోషనల్

Pawan Kalyan Wife: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడమే తన పని అని చెప్పుకొచ్చారు. ఇప్పుడీ పోస్ట్ తెగ వైరల్ గా మారింది. 

Published on: Jul 14, 2026, 13:50:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pawan Kalyan Wife: ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌తో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా తిరుగులేని ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ హెల్త్ అప్‌డేట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ముంబైలోని ప్రసిద్ధ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌కు కుడి భుజానికి సుదీర్ఘ శస్త్రచికిత్స పూర్తయింది. ఈ క్లిష్ట సమయంలో భర్త పక్కనే ఉండి సేవలు అందిస్తున్న ఆయన భార్య అన్నా కొణిదెల పెట్టిన ఎమోషనల్ నోట్ అభిమానుల కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది.

ఫిజికల్ నొప్పి కంటే అదే ఎక్కువ-ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా పని: పవన్ కళ్యాణ్ భార్య అన్నా ఎమోషనల్ (@APDeputyCMO)
ఫిజికల్ నొప్పి కంటే అదే ఎక్కువ-ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవడమే నా పని: పవన్ కళ్యాణ్ భార్య అన్నా ఎమోషనల్ (@APDeputyCMO)

అన్నా కొణిదెల ఎమోషనల్

సర్జరీ ముగిసిన తర్వాత పవన్‌ కళ్యాణ్ ను పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ముంబై వెళ్లారు. చంద్రబాబు, పవన్ బెడ్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేస్తూ అన్నా కొణిదెల ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

"ఆయన జీవితంలో మోస్తున్న బాధ్యతల భారం, ఆయన అనుభవిస్తున్న శారీరక నొప్పి కంటే చాలా పెద్దది. భరింపరాని విధంగా నొప్పి మారేంత వరకు ఆయన మౌనంగానే బాధను భరిస్తారు కానీ ఎప్పుడూ ఫిర్యాదు చేయరు, ఎవరి జాలినీ కోరుకోరు. ప్రస్తుతానికి నా ఏకైక బాధ్యత ఆయనను బాగా చూసుకోవడమే. ఆయన సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నారని అనుకోవాలి" అంటూ అన్నా కొణిదెల పోస్టు పెట్టారు.

సర్జరీ ఎందుకు లేట్ అయింది?

జనసేన పార్టీ వర్గాల నుంచి అందిన లీగల్ అండ్ మెడికల్ సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ కు 2016 నుంచే రోటేటర్ కఫ్ (Rotator Cuff) గాయాలు ఉన్నాయి. నిరంతర రాజకీయ ప్రచారాలు, ప్రజా పోరాటాల వల్ల ఈ నొప్పి తీవ్రమైంది. అయితే, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దిన్షా పార్దివాలా నేతృత్వంలోని టీమ్ సర్జరీ చేస్తున్న సమయంలో ఒక షాకింగ్ ఎలిమెంట్ వెలుగులోకి వచ్చింది.

మరో ఫ్రాక్చర్

గతంలో వైద్య పరీక్షలు, మెడికల్ స్కాన్లలో స్పష్టంగా కనిపించని ఒక ‘అదనపు అవల్షన్ ఫ్రాక్చర్’ ఆపరేషన్ థియేటర్‌లో వైద్యులు లైవ్‌గా గుర్తించారు. కుడి భుజంలో ఉన్న ఈ కొత్త ఫ్రాక్చర్ కారణంగా సర్జరీ ప్రక్రియ ఊహించిన దానికంటే అత్యంత సంక్లిష్టంగా మారింది.

అందుకే అనుకున్న సమయం కంటే ఎక్కువ టైమ్ పట్టి, దాదాపు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ కొనసాగించాల్సి వచ్చింది. ప్రస్తుతం కుడి భుజం సర్జరీ సక్సెస్ కాగా.. ఎడమ భుజానికి మరో రెండు నెలల తర్వాత ఆపరేషన్ చేయనున్నారు.

ఓజీ 2 ఎప్పుడు?

వైద్యుల సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో రికవరీ అవ్వడానికి కనీసం కొన్ని వారాల పాటు కఠినమైన బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ అవసరం. దీనివల్ల ఆయన కమిట్ అయిన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ మారక తప్పడం లేదు.

సుజీత్ దర్శకత్వంలో రాబోయే హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఓజీ 2 పై టాలీవుడ్‌లో వందల కోట్ల బిజినెస్ డిపెండ్ అయి ఉంది. అయితే, పవన్ భుజం గాయం కారణంగా ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్రస్తుతానికి హోల్డ్‌లో పెట్టనున్నారు. ఆయన కోలుకున్నాక కేవలం టాకీ పార్ట్ షూట్ చేసేలా మేకర్స్ ప్లాన్ మారుస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More