Peddi: 30 రోజుల్లో అతని కథ ప్రారంభం.. పెద్ది రిలీజ్ పై మేకర్స్ కొత్త పోస్టర్.. నమ్మకం లేదు దొరా అంటూ కామెంట్లు

Peddi: పెద్ది మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ షురూ అయింది. 30 రోజుల్లో అతని కథ ప్రారంభం కానుందని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే నమ్మకం లేదు దొరా అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్లు వైరల్ గా మారాయి.

Published on: May 5, 2026, 13:46:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Peddi: ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ‘పెద్ది’ ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ రిలీజ్ కోసం మెగా ఫ్యాన్స్, సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మొత్తానికి జూన్ 4న సినిమా థియేటర్లకు రానుందని రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు.

పెద్ది పోస్టర్ లో రామ్ చరణ్ (x/MythriOfficial)
పెద్ది పోస్టర్ లో రామ్ చరణ్ (x/MythriOfficial)

పెద్ది రిలీజ్ డేట్

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ మూవీకి బుచ్చిబాబు సాన డైరెక్టర్. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. శ్రుతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో ఆడిపాడిందని సమాచారం.

కొత్త పోస్టర్

పెద్ది మూవీ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ చిత్రం మరో 30 రోజుల్లో రిలీజ్ కాబోతుందని మైత్రీ మూవీ మేకర్స్ మంగళవారం (మే 5) ఓ కొత్త పోస్టర్ పంచుకుంది. ‘‘30 రోజుల్లో అతని కథ ప్రారంభం. జూన్ 4న పెద్ది ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పెద్ది కోసం రెడీగా ఉండండి’’ అని మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది.

నమ్మకం లేదు దొరా

పెద్ది రిలీజ్ కోసం ఓ వైపు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేకర్స్ కూడా అప్ డేట్స్ పంచుకుంటున్నారు. అయినా పెద్ది మూవీ చెప్పిన రోజు థియేటర్లకు వస్తుందనే నమ్మకం లేదు దొరా అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.

అదే కారణం

పెద్ది మూవీ విడుదలపై నమ్మకం లేకపోవడానికి ఓ కారణం ఉంది. ఫస్ట్ ఈ మూవీని మార్చి 27న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ చేశారు. కనీసం ఏప్రిల్ 30కి అయినా రిలీజ్ చేశారా? అంటే అదీ లేదు. మళ్లీ జూన్ కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశ చెందారు.

జూన్ 25న రిలీజ్ చేస్తామన్నారు. కానీ లాస్ట్ కు జూన్ 4న పెద్ది వస్తుందని చెప్పారు. ఇలా రిలీజ్ పై ఎప్పటికప్పుడు మేకర్స్ మాట మార్చడంతో అభిమానుల్లో నమ్మకం పోయింది. పెద్ది మూవీ థియేటర్లకు వచ్చేంతవరకూ కూడా రిలీజ్ డేట్ పై భరోసా పెట్టుకోలేని పరిస్థితి ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More