Podarillu Chakri Maha: పుష్పక విమానంలో గతంలోకి పొదరిల్లు చక్రి, మహా.. జుట్టుపోలిగాడి తలపై ఒక్కటి ఇచ్చేదాన్నంటూ..

Podarillu Chakri Maha: స్టార్ మా పాపులర్ సీరియల్ 'పొదరిల్లు' జంట చక్రి, మహాలక్ష్మి తాజాగా ఓ సరదా ప్రోమోతో నెట్టింట సందడి చేస్తున్నారు. జియోహాట్‌స్టార్ (JioHotstar) ఒరిజినల్ వెబ్ సిరీస్ 'పుష్పక విమానం' ప్రమోషన్‌లో భాగంగా వీరు టైమ్ ట్రావెల్ ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

Published on: Nov 25, 2026, 21:12:55 IST
As Prefered on
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Chakri Maha: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తమ అద్భుతమైన కెమిస్ట్రీతో కట్టిపడేస్తున్న 'పొదరిల్లు' సీరియల్ జంట చక్రి, మహాలక్ష్మి తాజాగా ఓ సరికొత్త వీడియోతో అభిమానులను అలరిస్తున్నారు. స్టార్ మా అధికారిక సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఈ ప్రత్యేక ప్రోమోలో, వీరిద్దరూ ఆసక్తికరమైన టైమ్ ట్రావెల్ ప్రశ్నలను ఎదుర్కొంటూ కనిపించారు.

Podarillu Chakri Maha: పుష్పక విమానంలో గతంలోకి పొదరిల్లు చక్రి, మహా.. జుట్టుపోలిగాడి తలపై ఒక్కటి ఇచ్చేదాన్నంటూ..
Podarillu Chakri Maha: పుష్పక విమానంలో గతంలోకి పొదరిల్లు చక్రి, మహా.. జుట్టుపోలిగాడి తలపై ఒక్కటి ఇచ్చేదాన్నంటూ..

జియోహాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న క్రేజీ తెలుగు వెబ్ సిరీస్ 'పుష్పక విమానం' (Pushpaka Vimanam) ప్రచారంలో భాగంగా ఈ సరదా సెగ్మెంట్‌ను రూపొందించారు. సాయి రోనక్ ప్రధాన పాత్రలో నటించిన ఒక ఆసక్తికరమైన తెలుగు టైమ్-ట్రావెల్ కామెడీ డ్రామా సిరీస్ ఇది. గతాన్ని మార్చుకునే అవకాశం వస్తే మీరు ఏం చేస్తారంటూ స్టార్ మా నెటిజన్లను ప్రశ్నించడంతో, సోషల్ మీడియాలో సీరియల్, ఓటీటీ అభిమానుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

"మీకు గతంలోకి వెళ్లే అవకాశం వస్తే ఏం చేస్తారు?"

స్టార్ మా పంచుకున్న ఈ పోస్ట్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. “చక్రి, మహాలక్ష్మి కొన్ని ఆసక్తికరమైన టైమ్ ట్రావెల్ ప్రశ్నలను ఎదుర్కొన్నారు. మరి మీకు గతంలోకి వెళ్లే అవకాశం వస్తే ఏం చేస్తారు? కింద కామెంట్ చేయండి” అంటూ ఛానల్ నిర్వాహకులు ప్రేక్షకులను ఉత్సాహపరిచారు.

సీరియల్‌లో ఎప్పుడూ ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాతో ఆకట్టుకునే చక్రి (దీపక్), మహాలక్ష్మి (కృతిక) ఈ వీడియోలో ఎంతో సరదాగా, నవ్వులు పూయిస్తూ కనిపించడం అభిమానులకు ఫుల్ ట్రీట్‌లా మారింది.

జుట్టుపోలిగాడికి ఒక్కటి ఇచ్చేదాన్నంటూ..

గతంలోకి వెళ్లి ఏం మార్చాలనుకుంటున్నారు అని వీళ్లను అడగ్గా.. తాను పోలీస్ స్టేషన్ పెళ్లిని రద్దు చేసుకొని, మళ్లీ ఘనంగా మహాను పెళ్లి చేసుకునేవాడినని చక్రి చెప్పాడు. అటు మహా స్పందిస్తూ.. తన నాన్నతో గొడవ పడకుండా ఆయనతో కూర్చొని మాట్లాడి సమస్యను పరిష్కరించుకునే దాన్నని, జుట్టుపోలిగాడి తలపై ఒక్కటి ఇచ్చేదాన్నని ఆమె సరదాగా సమాధానం ఇవ్వడం విశేషం.

ఏంటీ 'పుష్పక విమానం' వెబ్ సిరీస్?

చాలా మంది ప్రేక్షకులు దీనిని 2021లో వచ్చిన ఆనంద్ దేవరకొండ సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ ఇది పూర్తిగా భిన్నమైన సరికొత్త హాట్‌స్టార్ స్పెషల్స్ ఒరిజినల్ వెబ్ సిరీస్. నవంబర్ 12, 2026న జియోహాట్‌స్టార్లో అడుగుపెట్టిన ఈ సిరీస్ విశేషాలు ఇక్కడ చూడండి.

ఈ సిరీస్‌లో సాయి రోనక్ 'పుష్పక్ రావు' అనే ప్రధాన పాత్రలో నటించగా, మధు దామరాజు (సావిత్రి), వడ్లమాని శ్రీనివాస్, రఘు కరుమంచి కీలక పాత్రలు పోషించారు. సతీష్ రెడ్డి మల్లిడి ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

జీవితంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకోవాలని తపించే పుష్పక్ అనే వ్యక్తికి అనుకోకుండా టైమ్ ట్రావెల్ చేసే అవకాశం లభిస్తుంది. 2026 నుంచి పదేళ్లు వెనక్కి అంటే 2016లోకి వెళ్లిన పుష్పక్, తన గతంలో ఒక చిన్న మార్పు చేస్తాడు. అయితే ఆ ఒక్క మార్పు అతని ప్రస్తుత జీవితాన్ని, చుట్టూ ఉన్నవారిని ఎలాంటి ప్రమాదంలో పడేసిందనేదే ఈ సిరీస్ ప్రధాన కథాంశం. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.

బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన 'పొదరిల్లు' జంటతో ఈ వెబ్ సిరీస్‌ను ప్రమోట్ చేయడం ద్వారా, టీవీ ప్రేక్షకులను సైతం ఓటీటీ వైపు ఆకర్షించడంలో జియోహాట్‌స్టార్, స్టార్ మా వ్యూహం బాగానే పనిచేస్తోందని చెప్పవచ్చు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్, కామెడీ, సస్పెన్స్ ఇష్టపడే వారికి 'పుష్పక విమానం' మంచి వీకెండ్ వాచ్‌గా నిలుస్తోంది.

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.