హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.
Podarillu November 21 Episode: పొదరిల్లు.. చక్రి జీవితంలోకి కనకతార.. మహాకు మంట.. మాధవ సీక్రెట్ డేట్ ఇక్కడికే..
Podarillu Serial November 21st Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 21 ఎపిసోడ్ లో మాధవ, మనీషా సైకిల్ డేట్‌కు వెళ్తారు. వాళ్లను చక్రి, కన్నా ఫాలో అవుతారు. మరోవైపు తన నెక్ట్స్ పెళ్లి కోసం మ్యాట్రిమోని ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు చక్రి.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ మొత్తం మాధవ, మనీషా సీక్రెట్ డేట్ చుట్టూ తిరుగుతుంది. అన్నపై ముందే డౌట్ రావడంతో చక్రి, కన్నా అతన్ని ఫాలో అయి ఆ డేట్ ను బయటపెడతారు. మరోవైపు మహాకు యాక్సిడెంట్ కావడం, ఆమెకు నారాయణ సేవలు చేయడం కూడా చూడొచ్చు.

మాధవపై చక్రికి అనుమానం.. ఫాలో అయి..
మనీషాతో సీక్రెట్ డేట్ కోసం మాధవ రెడీ అయ్యే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 21) ఎపిసోడ్ మొదలైంది. మాధవ స్టైల్ గా రెడీ అవుతూ, ముఖానికి పౌడర్ కూడా వేసుకుంటాడు. అతనిపై డౌట్ రావడంతో ఎక్కడికెళ్తున్నావ్ అని చక్రి అడుగుతాడు. ఫంక్షన్ కి అని మాధవ చెబుతాడు.
ఎవరిది, ఏంటి అని వివరాలు అడిగితే.. మాధవ నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెబుతాడు. తాను కూడా వస్తానని చక్రి అంటే.. తనను మాత్రమే పిలిచారని మాధవ అంటాడు. దీంతో చక్రి, కన్నాలకు అనుమానం వస్తుంది. మాధవ కచ్చితంగా ఏదో దాస్తున్నాడని అర్థం చేసుకొని అతన్ని ఫాలో కావాలని నిర్ణయించుకుంటారు.
మహాకు యాక్సిడెంట్
మరోవైపు మహాలక్ష్మి బండిపై వెళ్తూ విడాకుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కౌన్సిలింగ్ లో చక్రి తనపై తాను వేసుకున్న నిందలు.. ఇంట్లో పెద్ది చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటుంది. ఆ పరధ్యానంలోనే వెళ్తూ రోడ్డుపై ఉన్న గుంత సరిగా చూసుకోకపోవడం కింద పడుతుంది. ఆమె చేతికి గాయాలవుతాయి. వెంటనే చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆమెకు సాయం చేస్తారు. చిన్న గాయమే కావడంతో ఆమె తిరిగి బండి తీసుకొని వెళ్లిపోతుంది.
మాధవను ఫాలో అవుతూ మనీషా ఇంటికి.. చాటుగా వింటూ..
మరోవైపు మాధవను చక్రి, కన్నా ఫాలో అవుతూనే ఉంటారు. అతడు కచ్చితంగా మనీషా ఇంటికే వెళ్లాడని చక్రి అంటాడు. అందుకే మాధవను దాటేసి నేరుగా ఆమె ఇంటికే వెళ్లి కాస్త దూరంగా ఆగుతాడు. అన్నయ్య కచ్చితంగా ఇక్కడికే వస్తాడని గ్యారెంటీ ఏంటి అని కన్నా అడిగితే.. కాస్త వేచి చూడు, అన్నయ్య సైకిల్ పై వస్తున్నాడు కదా.. కాస్త ఆలస్యం అవుతుంది అంతే అని చక్రి అంటాడు. అతడు చెప్పినట్లుగానే మాధవపై నేరుగా మనీషా ఇంటికి వస్తాడు.
ఇంట్లోకి వెళ్లే ముందు మరోసారి తల దువ్వుకుంటాడు. చక్రి, కన్నా చూసి అబ్బో అని అంటారు. తర్వాత మనీషా డోరు తీస్తుంది మాధవ లోనికి వెళ్తాడు. వీళ్లు లోపల ఏం చేస్తున్నారో చూసొస్తా అని చక్రి వెళ్తాడు. కిటికీలు తెరుచుకోకపోవడంతో చాటు వాళ్ల మాటలు వింటాడు. కానీ లోపల మాధవ.. మనీషా ఇచ్చిన గరం మసాలా టీ ఎలా చేయాలో తెలుసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మనీషా కొత్త డ్రెస్ లో చాలా బాగుందని దిష్టి తీస్తానంటాడు. ఇదంతా బయటి నుంచి విన్న చక్రి ఛీ అనుకుంటాడు.
మాధవ కోసం మనీషా డ్రెస్.. సైకిల్‌పై డేట్‌కు..
ఆ తర్వాత మాధవ, మనీషా ఇద్దరూ సీక్రెట్ డేట్ కోసం రెడీ అవుతారు. మాధవ కోసం మనీషా కొత్త డ్రెస్ తీసుకొస్తుంది. ఇది వేసుకొని తనను బయటకు తీసుకెళ్లాలని అంటుంది. దీంతో మాధవ ఆ డ్రెస్ వేసుకుంటాడు. అతనికి మనీషా గాగుల్స్ కూడా ఇస్తుంది. స్టైలిష్ గా తయారై బయటకు వచ్చిన అన్నను చూసి చక్రి, కన్నా షాకవుతారు. వాళ్లను అలాగే ఫాలో అవుతూ వెళ్తారు. వాళ్లిద్దరినీ చూసి చక్రి కుళ్లుకుంటుంటే.. అది గమనించిన కన్నా.. నువ్వు కూడా ఫోన్ చేసి వదినను రమ్మను డేట్ కోసం అని అంటాడు.
అలా చేస్తే తనను ఇంట్లోకి కూడా రానివ్వదు అని చక్రి అంటాడు. ఇద్దరూ అలా ఫాలో అవుతూ ఉంటే.. మాధవ, మనీషా ఓ రెస్టారెంట్ లోకి వెళ్తారు. లోపలికి వెళ్తున్న క్రమంలో మనీషా కింద పడబోతుంటే మాధవ పట్టుకుంటాడు. ఆ రొమాంటిక్ సీన్ ను కన్నా కన్నార్పకుండా చూస్తుంటే చక్రి అతన్ని మందలిస్తాడు. తర్వాత కన్నాను కారులోనే కూర్చోబెట్టి చక్రి మాత్రం వాళ్ల వెంట వెళ్తాడు.
మహా కోసం నారాయణ టీ.. గాయానికి పసుపు రాసి..
అటు మహా ఇంటికి వస్తుంది. అప్పటి వరకూ బీడీ కాలుస్తూ ఉన్న నారాయణ దానిని పడేసి ఏమీ తెలియని అమాయకునిలా.. తాను సుప్పిని, శుద్ధపూసని అని పాట పాడుతుంటాడు. తెలుస్తూనే ఉంది అంటూ మహా లోనికి వెళ్తుంది. ఆమె కోసం నారాయణ పరుగెత్తుకుంటూ వెళ్లి టీ చేస్తాడు. ఆ టీ ఆమె తాగుతుంటే చేతికి అయిన గాయం గమనిస్తాడు. ఏమైందని అడిగితే కిందపడ్డానని, చిన్న గాయమే అని మహా చెబుతుంది. దీంతో నారాయణ ఆమె చేతికి పసుపు రాసి సపర్యలు చేస్తాడు.
చక్రి జీవితంలోకి కనకతార
మరోవైపు మహాను మళ్లీ ఉడికించే ప్రయత్నాలు మొదలు పెడతాడు చక్రి. ఆమె ముందుకు కూర్చొని నవ్వుతూ ఉంటే.. ఎందుకంతలా నవ్వుతున్నారని మహా అడుగుతుంది. తాను ఓ మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేశానని, కనకతార అనే అమ్మాయి తగిలిందని చెబుతాడు. నా మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారని అడుగుతోందని, దానికి కారణం మీరే అని చెప్పమంటారా అని మహాతో అంటాడు. దీంతో ఆమె కోపంగా వెళ్లిపోతుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

E-Paper
