Podarillu November 19 Episode: పొదరిల్లు.. చక్రి రివర్స్ ప్లాన్.. వద్దంటూ నారాయణ వార్నింగ్.. మహాకు పెద్ది వేడుకోలు
Podarillu Serial November 19th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 19 ఎపిసోడ్ లో మహాకు విడాకుల విషయంలో చక్రి వేసిన రివర్స్ ప్లాన్ ను నారాయణ కనిపెట్టి వార్నింగ్ ఇస్తాడు. అటు విడాకులే పరిష్కారమా అంటూ మహాను పెద్ది నిలదీస్తాడు.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో మహాకు చక్రి విడాకులు ఇవ్వడానికి అంగీకరించడం, అదే విషయంలో ఇంట్లో చెప్పడం, చక్రి ప్లాన్ అర్థం చేసుకున్న నారాయణ అతనికి వార్నింగ్ ఇవ్వడంలాంటి సీన్లతో సాగిపోయింది. అయితే మహా మనసులో ఏముందన్నది మాత్రం బయట పడలేదు.

విడాకులు ఇస్తానన్న చక్రి.. నేనొక వెధవని అంటూ..
కోర్టు కౌన్సిలింగ్ లో మహా, చక్రి విడాకుల సీన్ తో సీరియల్ గురువారం (నవంబర్ 19) ఎపిసోడ్ మొదలైంది. విడాకులు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారని మహాను అడిగితే.. తనకు జీవితంలో కొన్ని గోల్స్ ఉన్నాయని, వాటిని పూర్తి చేసే వరకు పెళ్లి వద్దనుకుంటున్నానని, తమది అనుకోకుండా జరిగిన పెళ్లి కావడంతో విడాకులు కావాలని మహా అడుగుతుంది. మరి నీ సంగతేంటి.. విడాకులు ఇచ్చే ఉద్దేశం నీకు లేనట్లుంది అని చక్రి అడిగితే తాను కూడా విడాకులు ఇస్తానని చక్రి అంటాడు.
దానికి కారణమేంటని అడిగితే.. తానో పెద్ద వెధవని అని అంటాడు. ఆమె బాగా చదువుకుంది.. నాకు చదువులేదు.. ఆమె అంత అందగాడిని కాదు.. కేవలం క్యాబ్ డ్రైవర్ ను.. ఆ సంపాదనతో ఆమెను పోషించలేను.. నాకు అమ్మాయిల పిచ్చి ఉంది.. కారులో ఎక్కిన ప్రతి అమ్మాయికి లైన్ వేస్తాను.. 50 పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాను.. ఇంట్లోనూ తండ్రితో రోజూ గొడవ పడతాను.. నేను అసలు మంచోడిని కాదు.. నాలాంటి వాడితో ఆమె కలిసి ఉండలేదు.. అందుకే విడాకులు ఇస్తాను అని చక్రి అనడంతో మహా షాకవుతుంది. కోర్టుకు వెళ్లేలోపు ఆలోచించుకోవడానికి టైమ్ ఇస్తున్నాం.. అప్పటిలోపు మనసు మారకపోతే విడాకులు ఇస్తామని కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్లు చెప్పి పంపిస్తారు.
విడాకులు ఈజీగా వచ్చేలా చేశానన్న చక్రి.. ఫీలైన మహా
బయటకు వచ్చిన తర్వాత కూడా మహా అదే షాక్ లో ఉండి చక్రిని పట్టించుకోకుండా వెళ్లిపోబోతే అతడు పిలుస్తాడు. విడాకులు రాకముందే అలా వెళ్లిపోతే ఎలా.. చూశారా విడాకులు రావడం ఎంత ఈజీగా చేశానో.. నాపైనే నిందలు వేసుకొని మీ పని సులువు చేశాను అని చక్రి అంటాడు. మీరు ఎందుకలా మాట్లాడారు.. మీరు మరీ అంత దుర్మార్గులేమీ కాదు కదా అని మహా అంటుంది.
అలా చెబితే వాళ్లు విడాకులు ఇవ్వరు కదా అని చక్రి అంటాడు. దీంతో మహా ఫీలవుతుంది. కారు ఎక్కిన తర్వాత కూడా చక్రి మాట్లాడుతూ.. విడాకుల తర్వాత మిమ్మల్ని ఎవరు డ్రాప్ చేస్తారో.. విక్కీ చేస్తాడేమో అని అంటాడు. మహా సీరియస్ గా చూడటంతో భయపడతాడు.
విడాకుల విషయంలో ఇంట్లో చెప్పిన చక్రి..
ఇంటికి వెళ్లగానే మాధవ, నారాయణలకు విడాకుల విషయం చెబుతాడు చక్రి. ఆమె బలంగా కోరుకున్నదే జరిగిందని, ఆమె మొదటి నుంచీ విడాకులు కావాలనే కోరుకున్నదని, అదే జరగబోతోందని, తాను కూడా విడాకులు ఇవ్వడానికి అంగీకరించినట్లు చక్రి చెబుతాడు. ఇంట్లోనూ చక్రి కౌన్సిలింగ్ లో మాట్లాడినట్లే మాట్లాడుతాడు. తాను కేవలం ఊరు దాటించడానికి వచ్చిన కారు డ్రైవర్ నే అని, తనతో ఆమె జీవితాంతం ఉంటుందని ఎలా అనుకున్నారని చక్రి అంటాడు.
తాను అసలు చదువుకోలేదని, ఆమె చాలా చదివిందని, తాను కారు డ్రైవర్ ను అని, ఆమె ఆర్కిటెక్ట్ అని.. అలాంటి వ్యక్తి తనలాంటి వాడితో ఎలా కలిసి ఉంటుందని చక్రి అడుగుతాడు. ఇన్నాళ్లు కూడా మీరు చూపించిన ప్రేమాభిమానాల వల్లే అతిథిగా అయినా ఇంట్లో ఉందని, లేదంటే తనలాంటి వాడితో ఆమె ఎలా ఉండేదని అంటాడు. పెద్ది, సుపుత్ర, కన్నా, కేశవ పెళ్లి పెద్దలుగా మీరు మరో పెళ్లి చేస్తారు.. విడాకులు తర్వాత మీకు ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోండి అని చక్రి సెంటిమెంట్ డైలాగులు కొట్టి వెళ్లిపోతాడు. దీంతో మాధవ, నారాయణ షాకవుతారు.
చక్రిని నిలదీసిన నారాయణ.. నీ రివర్స్ ప్లాన్ అర్థమైపోయిందని..
కారులో వెళ్తున్న చక్రిని నారాయణ అడ్డుకుంటాడు. అతన్ని చూసి చక్రి షాకవుతాడు. తనకంటే ముందే ఎలా వచ్చావని అంటాడు. నీకు లాజిక్ లు కావాలా లేక నేను ఎందుకు వచ్చానో తెలియాలా అని అడుగుతాడు. అసలు మహాకు విడాకులు ఇస్తానని ఎందుకు చెప్పావని నిలదీస్తాడు. చక్రి మళ్లీ అవే సెంటిమెంట్ డైలాగులు కొడతాడు. దీంతో అతన్ని కోపంగా చూస్తాడు నారాయణ.
ఎందుకలా చూస్తున్నావని చక్రి అడిగితే.. నీ రివర్స్ ప్లాన్ నాకు అర్థమైందని అంటాడు. దీంతో చక్రి షాకవుతాడు. నీకు అంత ఈజీగా ఎలా అర్థమైందని చక్రి అడుగుతాడు. నా అనుభవం అంత లేదు నీ వయసు.. నీ రివర్స్ ప్లాన్ తో మహా మనసు మారి విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకుంటుందని నీ వెధవ ఆలోచన కదా అని నారాయణ అంటాడు.
మహా వెళ్లిపోతే చీకటి అవుతుందని చెప్పిన నారాయణ
మహా చాలా మంచి అమ్మాయి.. ఎంతో గొప్పగా ఆలోచిస్తుంది.. నీ ఈ రివర్స్ ప్లాన్ తెలిసిందంటే నిన్ను ఛీ కొట్టి విడాకులు ఇచ్చి వెళ్లిపోతుంది.. అలా జరగకుండా చూడు.. మహాలాంటి అమ్మాయి విషయంలో రివర్స్ ప్లాన్ పనిచేయదు.. ప్రేమతోనే ఆమెను గెలుచుకోవాలి.. ఆమె మన ఇంటికి వచ్చిన తర్వాతే అది బృందావనంలా మారింది.. ఆమె వెళ్లిపోతే మళ్లీ చీకటవుతుంది.. అలా జరగకుండా చూడు.. ఈ రివర్స్ ప్లాన్స్ మానెయ్ అంటూ చక్రికి నారాయణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దీంతో చక్రి ఆలోచనలో పడతాడు. నారాయణ చెప్పినట్లు మహా నిజంగానే వెళ్లిపోతే ఎలా అని అనుకుంటాడు.
మహాకు పెద్ది రిక్వెస్ట్
మరోవైపు చక్రికి మాధవ కూడా ఫోన్ చేసి విడాకుల విషయం తనకు నచ్చలేదని చెబుతాడు. అటు మహాతోనూ మాట్లాడతాడు. ఈ సమస్యకు విడాకులు మాత్రమే పరిష్కారమా అని అడుగుతాడు. మహా మాత్రం ఏమీ సమాధానం చెప్పదు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


