Podarillu November 13 Episode: పొదరిల్లు.. కన్నా కోసం తన ప్రాణాలు అడ్డుపెట్టిన నారాయణ.. మాధవ కంటతడి.. బృందావనంలో దీపావళి

Podarillu Serial November 13th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 13 ఎపిసోడ్ లో బృందావనంలో దీపావళి వేడుకలు జరుగుతాయి. అప్పుడు కన్నా ప్రాణాలను కాపాడటానికి నారాయణ తన ప్రాణాలను పణంగా పెడతాడు. అటు కుటుంబాన్ని చూసి మాధవ ఎమోషనల్ అవుతాడు.

Published on: Nov 13, 2026, 07:59:57 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో బృందావనం నిజంగా బృందావనంలా ఓ ఇల్లులా మారడం చూసి మాధవ ఎమోషనల్ కావడం, చివరికి అందరూ కలిసి ఉత్సాహంగా దీపావళి జరుపుకోవడం చూడొచ్చు. అయితే అప్పుడే అనుకోకుండా కన్నా ప్రమాదంలో పడటం, నారాయణ అతన్ని కాపాడటం చూడొచ్చు.

పొదరిల్లు సీరియల్ నవంబర్ 13 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 13 ఎపిసోడ్

నారాయణ అండ్ సన్స్ మెకానిక్ షాప్.. శైలు షాక్.. వెళ్లిపోయిన కన్నా

కేశవ షాపు పేరు రివీల్ చేసే సీన్ తో సీరియల్ శుక్రవారం (నవంబర్ 13) ఎపిసోడ్ మొదలైంది. ఆ పని శైలుకి అప్పగిస్తారు. ఆమె పేరు బోర్డుపై ఉన్న ముసుగు తొలగిస్తుంది. నారాయణ అండ్ సన్స్ మెకానిక్ షాప్ అనే పేరు చూసి శైలు షాక్ తింటుంది. తన పేరు పెట్టకపోయినా సరే.. మహాలక్ష్మి పేరు కాదు కదా అది చాలు అనుకుంటుంది. పేరు చూసి అందరూ చాలా సంతోసిస్తారు. కానీ కన్నా మాత్రం నారాయణ పేరు చూడగానే అప్‌సెట్ అవుతాడు. అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

ఈ క్రెడిట్ అంతా మహాకే దక్కుతుందని కేశవ అంటాడు. అందరూ ఆమెను మెచ్చుకుంటారు. తన పేరు ఎందుకు పెట్టారని నారాయణ అంటాడు. కన్నా కనిపించకపోవడంతో తన పేరు చూసి వెళ్లిపోయి ఉంటాడని నారాయణ అనడంతో తాను చూసుకుంటానని మహా హామీ ఇస్తుంది.

పేరుపై ముంగిసతో బుస్సు ఫైట్

అందరూ వెళ్లిపోయిన తర్వాత ముంగిసతో బుస్సు గొడవకు దిగుతుంది. ఆ పేరు పెట్టినట్లు తనకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. ఇది మహాలక్ష్మి ఐడియా అని, ఆమె ఆ పేరు పెట్టినట్లు తనకు కూడా తెలియదని అంటాడు. దీంతో శైలు శాంతిస్తుంది. సరేలే అని చెప్పి కేశవకు ముద్దు పెట్టి స్వీటు తీసుకొని వెళ్లిపోతుంది.

తమ్ముళ్లను చూసి మాధవ ఎమోషనల్.. చిన్నతనం గురించి తలచుకుంటూ..

ఆ తర్వాత అందరూ ఇంట్లో రకరకాల పిండి వంటలతో భోజనానికి కూర్చొంటారు. తమ్ముళ్లు, మహా, మనీషా ఎంతో ఆనందంగా ఉండటం చూసి మాధవ ఎమోషనల్ అవుతాడు. ఈ ఇంట్లో ఆడది ఎవరూ అడుగుపెట్టరు అన్న తన అత్త తాయారు మాటలు గుర్తుకు తెచ్చుకుంటాడు. తమ్ముళ్లు, తండ్రి జైలుకి వెళ్లిన సీన్ గుర్తుకొస్తుంది. అదంతా తలచుకొని మాధవ కంటతడి పెట్టడం చూసి ఏమైందని అందరూ అడుగుతారు.

ఇప్పుడు ఇల్లు ఇల్లులా ఉంది.. బృందావనంలో ఇదే తొలి పండగ.. చిన్నతనంలో అసలు పండగ అంటే తెలియదు.. ఒక్కపూట తినడానికి కూడా తిండి దొరికేది కాదు.. నాన్న జైలుకి వెళ్లాడు.. తమ్ముళ్లను చూసుకోవాలి.. ఎంత కష్టం చేసినా తమ్ముళ్లకు పండగకు కొత్త బట్టలు కొనివ్వలేకపోయాను.. పొరుగువాళ్లు అందరూ పిండి వంటలు చేసుకుంటే నేనేమీ చేయలేకపోయేవాడిని.. అసలు ఈ ఇల్లు ఇల్లులా ఎవరూ చూసేవాళ్లు కాదు.. తమ్ముళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పస్తులు ఉంచకూడదు అనుకొని ఇంకా కష్టపడటం మొదలు పెట్టాను.. తమ్ముళ్లు కూడా పనులు నేర్చుకునే పనిలో పడి ఎప్పుడో వచ్చి తిని వెళ్లే వాళ్లు.. అసలు పండగలంటేనే తెలియదు.. కానీ ఇప్పుడు అసలైన పండగ వచ్చింది.. ఇలా అందరూ సంతోషంగా ఉండటం చూసి చాలా ఆనందంగా ఉంది.. కన్నా వెళ్లిపోతే వెతికి తీసుకొచ్చాం.. నేను వెళ్తానంటే అందరూ వారించారు.. కేశవ షాపు కోసం అందరం సాయం చేశాం.. ఇది కదా కుటుంబం అంటే.. ఇది కదా పండగ అంటే అని మాధవ అంటాడు. మాధవ కంటతడి పెట్టడం చూసి మహా కూడా ఎమోషనల్ అవుతుంది. అతన్ని ఓదారుస్తుంది.

వదినతో బూరెలు వేయించిన కన్నా

ఆ తర్వాత అందరూ కలిసి ఆనందంగా భోజనం చేస్తారు. ఈ సందర్భంగా బూరెలు చూసిన మనీషా ఆలోచనలో పడుతుంది. అసలు ఇందులోకి పూర్ణం ఎలా వెళ్లిందని అమాయకంగా అడుగుతుంది. మాధవ హిందీలో చెప్పడానికి ప్రయత్నించి తన వల్ల కాదని అంటాడు. దీంతో కన్నా కూడా చెప్పడానికి ట్రై చేసి.. చెప్పడం కాదు చేసి చూపిస్తానని వదనను తీసుకెళ్తాడు. బూరెలు ఎలా వేస్తారో చేసి చూపిస్తాడు. మనీషా కూడా నేర్చుకుంటుంది.

మహాతో తన ఫొటో చూసి మురిసిపోయిన చక్రి

ఇక భోజనాలు అయిపోయిన తర్వాత ఫోనులో మహా పక్కనే తాను నిలబడిన ఫొటో చూసి చక్రి తెగ మురిసిపోతుంటాడు. అతన్ని చూసి కేశవ, కన్నా ఆశ్చర్యపోతారు. చక్రి వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఆ ఫొటోను తన స్టేటస్ లో పెట్టాలనుకుంటాడు. ఫస్ట్ దీపావళి విత్ మై వైఫ్ అనే క్యాప్షన్ పెట్టి స్టేటస్ లో పెడతాడు. ఇది చూస్తే మహా రియాక్షన్ ఎలా ఉంటుందో అని అనుకుంటాడు. చక్రి పిచ్చోడిలా ప్రవర్తించడం చూసి కేశవ, కన్నా, నారాయణ ఆశ్చర్యపోతారు.

కన్నాను కాపాడిన నారాయణ

చివర్లో బృందావనంలో అందరూ కొత్త బట్టలు వేసుకొని దీపావళి జరుపుకోడానికి సిద్ధమవుతారు. కొడుకులు, కోడళ్లను చూసి నారాయణ మురిసిపోతాడు. ఇప్పుడు అసలైన బృందావనంలా ఉందని మాధవతో అంటాడు. మహా వచ్చిన తర్వాతే ఇది ఇల్లులా మారిందని మాధవ చెబుతాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఆనందంగా టపాసులు పేలుస్తారు. అయితే ఈ క్రమంలో అనుకోకుండా కన్నా ప్రమాదంలో పడతాడు. అక్కడే ఉన్న నారాయణ కన్నాను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణం పణంగా పెడతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More