Podarillu November 11 Episode: పొదరిల్లు- మహా, చక్రికి చాట్ జీపీటీ సలహాలు- నారాయణ కాళ్లపై పడి గుక్కపెట్టి ఏడ్చిన కేశవ
Podarillu Serial November 11th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 11వ ఎపిసోడ్లో నారాయణ వస్తే షాప్ ఓపెనింగ్‌కి రానని కన్నా అంటే.. రాకని రివర్స్ అవుతుంది మహా. చక్రి, మహాలక్ష్మి చాట్ జీపీటీ సలహాలు తీసుకుంటారు. చీరలో మహా, మనీషా అందంగా కనిపిస్తారు. నారాయణ దగ్గర అంతా ఆశీర్వాదం తీసుకుంటారు.
Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నారాయణకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, బట్టలు పెట్టడం, షాప్‌కి రమ్మనడంపై కన్నా కోప్పడతాడు. అసలు అతను ఏమైనా పట్టించుకన్నాడా. అలాంటి శుభకార్యానికి ఏం చేయాలన్న పూర్తి అర్హత పెద్దన్నయ్యకే ఉంది. అతన్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. అలాంటివాడికి కొడుకుగా ఎందుకు పుట్టానా అనిపిస్తుందని కన్నా అంటాడు.

ఆయనతో రిబ్బన్ కట్ చేయిస్తే రాను
మహాలక్ష్మి కన్నా అని వారిస్తుంది. ఆయన వస్తే నేను రానని కన్నా అంటాడు. ఇది శుభకార్యం. అందరం ఉంటేనే బాగుంటుంది. ఇంటికి పెద్దవాడు కాబట్టి నాన్నతో రిబ్బన్ కట్ చేయిద్దామనుకుంటున్నాం అని మాధవ అంటాడు. ఆయనతో రిబ్బన్ కట్ చేయిస్తే నేను రానని కన్నా అంటాడు. అయితే రాకని మహాలక్ష్మి అంటుంది. ఏంటమ్మా ఆ మాటలని మాధవ అంటాడు.
లేకపోతే ఏంటీ పెద్ది. బతిమిలాడుతుంటే ఓ ఓవరాక్షన్ చేస్తున్నాడు. ఇది మీ కేశవ అన్నయ్యది మొదటి విజయం. ఆయన విజయానికి అందరూ ఆనందంగా ఉన్నారు. దాన్ని నువ్వు నాశనం చేయకు. నీకు మీ అన్నయ్య మీద ప్రేమ ఉంటే రా.. లేదు ఆ ప్రేమకంటే నాన్నపై ద్వేషం ఎక్కువగా ఉంటే రాకు నీ ఇష్టం. ఆలోచించుకో అని మహాలక్ష్మి వెళ్లిపోతుంది.
దాంతో కన్నా ఆలోచనలో పడతాడు. తర్వాత మహా డిజైన్ గీస్తుంది. చాట్ జీపీటీని తన డిజైన్ అమ్మడంలా కాకుండా సర్వీస్ గురించి చెబుతున్నట్లుగా ఉండాలని అడుగుతుంది మహాలక్ష్మి. దానికోసం కావాల్సిన ప్రొఫెషనల్ మెయిల్ ఎలా రాయాలో అడిగి తీసుకుంటుంది మహా. మరుసటి రోజు ఉదయం అంతా రెడీ అవుతారు. మహాను చీరలో చక్రి ఫ్లాట్ అవుతాడు.
చీరలో మహా, మనీషా అందాలు
నోరెళ్లబెడతాడు. చీర బాగుంది. చీరలో మీరు కూడా చాలా బాగున్నారని చక్రి అంటాడు. మహాలక్ష్మి మహాలక్ష్మిలానే ఉందని మాధవ, మా అమ్మ.. గుమ్మడికాయతో దిష్టి తీయాలని నారాయణ అంటారు. ఇదేం చూశారని మనీషాను పిలుస్తుంది మహా. మనీషాను చీరకట్టులో చూసి పెద్ది ఫిదా అవుతాడు. మనీషా ఫొటో తీసి బన్సీకి పంపాలని మాధవ చూడకుండా అడ్డుగా వస్తాడు చక్రి.
చంద్రుడికి రాహువు అడ్డొచ్చినట్లు వచ్చాడని మహా అంటుంది. మనీషా, మహా చీర సర్దుకుంటారు. చూశావా అన్నయ్య తోడికోడళ్లు ఎలా హెల్ప్ చేసుకుంటున్నారో అని పెద్దితో చక్రి అంటాడు. శైలు కూడా వస్తుందని కేశవ అంటే.. అయితే కలర్ఫుల్గా ఉంటుందన్నమాట అని కన్నా అంటాడు. దేవుడికి మహా పూజ చేసి హారతి ఇస్తుంది.
మహాను చూసి మురిసిపోతాడు నారాయణ. తర్వాత చక్రి ఏదో రాస్తూ కొట్టేస్తుంటాడు. చాట్ జీపీటీని అడుగుతాడు. నా భార్య మహా కోసం స్పెషల్‌గా ఏదైనా ప్లాన్ చేయాలని ఉంది. కానీ, మా వివాహబంధంలో కంఫర్ట్‌గా ఉండేందుకు టైమ్ తీసుకుంటుంది. ఆమెకు ఒత్తిడిగా లేకుండా ఎలా చేయాలని చక్రి అడుగుతాడు. మహాతో డేటింగ్ సింపుల్‌గా ఉండేందుకు కొన్ని ఐడియాలు ఇస్తుంది చాట్ జీపీటీ.
చక్రి ప్లాన్ రివర్స్
సింపుల్‌గా చాలా బాగున్నాయని చక్రి అనుకుంటాడు. మరోవైపు నారాయణను మామిడి తోరణాలు కట్టమని పని చెబుతుంది మహాలక్ష్మి. అక్కడికి వచ్చిన చక్రితో కన్నా మనసు మార్చేస్తే అన్నారు ఏమైందని అడుగుతుంది. దాంతో ఇంట్లో అందరిని పిలుస్తాడు చక్రి. పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలంటాడు. నారాయణను ఆశీర్వదించమంటాడు చక్రి.
ఏంటీ మీ ప్లాన్ అని మహా అడిగితే.. కన్నా చేత మా నాన్న కాళ్లకు దండం పెట్టిస్తాను. చూస్తూ ఉండండి చక్రం తిప్పుతానని చక్రి అంటాడు. మాధవ, మనీషా నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. చక్రి మహాతో తీసుకుందామని చూస్తాడు. ఇదా మీ ప్లాన్ అనుకున్న మహా.. ముందు ఆయనకు ఆశీర్వాదం ఇవ్వండి సుపుత్ర అంటుంది.
దాంతో చక్రి జంటగా కాకుండా ఒక్కడే తండ్రి ఆశీర్వాదం తీసుకుంటాడు. మహాలక్ష్మి ఆశీర్వాదం తీసుకుంటానంటే కొడుకు దగ్గర తల్లి ఆశీర్వాదం తీసుకోకూడదంటాడు. నారాయణ వద్దని పరుగెడతాడు. నువ్వు బాగుంటే చాలు. నీకు ఆశీర్వాదం ఇచ్చేటంతటివాన్ని కాదు. నువ్వు చల్లగా ఉండాలి. ఇలాగే నీ కరుణ నా ఇంటి మీద కురవాలి అని నారాయణ అంటాడు.
గుక్కపెట్టి ఏడ్చిన కేశవ
వ్యక్తిత్వంలో ఔన్యత్వంలో మిమ్మల్ని మించినవారు ఎవరు సుపుత్ర అని మహా అంటే.. మా అమ్మవు కదా నా మాట వినవా అని అంటాడు నారాయణ. సరేనని మహా అంటుంది. కేశవ ఆశీర్వాదం తీసుకుంటాడు. కన్నా విషయంలో నారాయణ చేసింది గుర్తుకొచ్చి, తండ్రిని అన్నమాటలు తలుచుకుని కేశవ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నారాయణ కాళ్లు పట్టుకుని ఏడ్చేస్తాడు.
అంతా షాక్ అవుతారు. అలాగే ఏడుస్తూ ఉండిపోతాడు కేశవ. ఎంత చెప్పిన లేవడు. ఏమైందిరా వీడికి అని నారాయణ అంటాడు. రేయ్ కేశవ లేవరా. కన్నాకు అర్థం భయపడుతున్నాడురా, అలాగే చూస్తున్నాడు లేవరా.. అని అంటాడు మాధవ. పైకి గంభీరంగా ఉన్నా లోపల పదేళ్ల పసి పిల్లాడని మహా అంటుంది. ఏమైంది వీడికి అని నారాయణ అడిగితే.. ఇన్నాళ్లు నీ పెద్దరికాన్ని గుర్తించనందుకు తప్పు చేసినట్లు ఫీల్ అయ్యాడని మాధవ అంటాడు.
ఇప్పుడు కన్నాను కూడా ఆశీర్వదించు అని చక్రి అంటాడు. కన్నా ముందుకు వస్తాడు. కానీ, నాకు అమ్మ, నాన్న, దేవుడు అన్ని నువ్వే. నువ్వు ఆశీర్వదిస్తే చాలన్నయ్యా అని మాధవ కాళ్లపై పడతాడు కన్నా. అలా చక్రి ప్లాన్‌కి ట్విస్ట్ ఇస్తాడు కన్నా. నారాయణ ఆశీర్వదించమని సైగ చేస్తే మాధవ ఆశీర్వదిస్తాడు. నాన్న ఆశీర్వాదం కూడా తీసుకోరా అని చక్రి అంటాడు.
శైలు షాక్
నాన్న అని పిలవడం ఎప్పటినుంచి అలవాటు చేసుకున్నావ్. ఇక్కడ అందరి కాళ్లకు నమస్కరిస్తా అతనికి తప్పా అని కన్నా షాక్ ఇస్తాడు. తర్వాత షాప్ ఓపెనింగ్ చేస్తారు. కేశవకు షాప్ స్థలం డాక్యుమెంట్స్ ఇస్తాడు ఓనర్. షాప్ పేరును శైలుతో ఓపెన్ చేయిస్తారు. కానీ, షాప్ పేరు చూసి శైలు షాక్ అవుతుంది. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


