Podarillu October 22 Episode: పొదరిల్లు- ఐస్ క్రీమ్ దొంగతనం- చిరిగిన ప్యాంట్, పోలీస్‌కు దొరికిన చక్రి-ఓనర్‌గా మారిన కేశవ
Podarillu Serial October 22nd Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 22వ ఎపిసోడ్లో కేశవతో ఆటాడుకుంటుంది మహా. అంతా కలిసి ఐస్ క్రీమ్ తీసుకుని పరిగెడతారు. డబ్బులు ఎలా సేవ్ చేశానో చూశారా అని చక్రి అంటాడు. అమ్మాయిలతో చక్రి పులిహార కలిపితే తన ట్రిక్‌తో మహా పరువు తీస్తుంది. ఓనర్‌గా కేశవ మారతాడు.
Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో నేను 3 లెక్కపేటేదాకా అలాగే ఉండాలని మహాలక్ష్మి అంటే.. 30 లెక్కపెట్టేదాకా కూడా ఉంటానని కేశవ అంటాడు. అవసరం లేదు 3 చాలు అని లెక్కపెడుతుంది మహా. 1, 2 చెప్పి 3 మాత్రం చెప్పదు. పల్లీలు తీసుకొచ్చి తింటుంది. చక్రి, మాధవను కూడా కూర్చోమని తింటారు.

ఐస్ క్రీమ్ దొంగతనం
ఏవండి 3 అనరా అని కేశవ అడిగితే.. నాకు మూడు ఉన్నప్పుడు అంటాను. వారం తర్వాత అంటానని మహా అంటుంది. దాంతో దెబ్బకు కేశవ టీ పాయ్ మీద నుంచి దిగుతాడు. అలా కేశవతో మహా ఆడుకుంటుంది. మీరు ఓడిపోయారోచ్.. కాబట్టి ఇద్దరు ఐస్ క్రీమ్ షేర్ చేసుకుని తినిపించాలి అందరికి అని మహాలక్ష్మి అంటుంది. బయటకు వెళ్లి ఐస్‌క్రీమ్ కొంటారు.
చక్రికి మహా ఏదో చెబుతుంది. అదే విషయం కేశవ, పెద్దిలకు చెబుతాడు చక్రి. అంతా ఐస్‌క్రీమ్ తీసుకుని దొంగతనంగా పరిగెత్తుతారు. అంటే అంతా కలిసి ఐస్ క్రీమ్ దొంగతనం చేస్తారు. ఎందుకు పరిగెత్తారు. నేను ముందే ఐదు వందలు ఇచ్చానని మహా అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. మీరు పరిగెత్తడం వల్ల రావాల్సిన చిల్లర కూడా పోయింది. మీరు మధ్యలో దూరితో ఇంతే. నష్టమే అని మహా అంటుంది.
అక్కడ ఇద్దరు అమ్మాయిలి పానీపూరి తింటుంటారు. ఇప్పుడు మహాను ఏడిపిద్దామని వాళ్లను పిలిచి మీరు హీరోయిన్ కదా అని పులిహార కలుపుతాడు. ఇంటికెళ్లేదాకా మూసుకునేలా చేస్తానని కన్నాతో అంటుంది మహా. పెద్దిని కాయిన్ అడిగి.. కిందపడేసి తీయమంటుంది మహా. చక్రి తీసేందుకు కిందకు వంగుతాడు అప్పుడే కర్చీఫ్‌ని చింపేస్తుంది.
పోలీస్‌కు దొరికిన చక్రి
దాంతో చక్రి ప్యాంట్ చిరిగినట్లుగా వెనక్కి రెండు చేతులు పెట్టుకుంటాడు చక్రి. మూసుకునేలా చేయడమంటే ఇదేనని మహా అంటుంది. రెండు చేతులు వెనక్కి పెట్టుకుంటాడు. వెనకేముందిరా చూపించు అని అడుగుతాడు పెద్ది. చక్రి సిగ్గుతో వెనక్కి వెళ్తాడు. అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను చూసుకోకుండా గుద్దుతాడు. దాంతో పోలీస్ కోప్పడుతాడు.
ఎవరయ్యా నువ్వు. దొంగవా.. నీ చేతుల్లో ఏముందు చూపించూ అని గొడవ చేస్తాడు పోలీస్. వెళ్లి నిజం చెప్పమని మహా అంటుంది. కేశవ వెళ్లి వాడి ప్యాంట్ చిరిగింది అందుకే చేతులు అలా పెట్టుకున్నాడని చెబుతాడు. దాంతో పోలీస్ వదిలేస్తాడు. చక్రిని తీసుకొస్తాడు. నీకో విషయం చెప్పనా చిరిగింది నీ ప్యాంట్ కాదు కర్చీఫ్ అని మహా ట్రిక్ గురించి చెబుతాడు కేశవ.
మూసుకునేలా చేస్తానని చెప్పి చేసిందని కన్నా అంటాడు. అంతా నవ్వుతారు. హమ్మయ్య కన్నా నవ్వాడని అంటారు. ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. నవ్వుతూ ఉండాలని పెద్ది అంటాడు. షాప్ ఓపెనింగ్‌కి అంతా రావాలని కేశవ అంటాడు. మరుసటి రోజు ఉదయం కేశవ షాప్‌కి వెళ్తుంటారు. దారిలో మహా ఆగమంటుంది.
కేశవను ఆటాడుకున్న మహా అండ్ కో
ముహుర్తం బాగాలేదా అని తలో మాట అంటారు. నేనేమైనా పంచాంగాలు చూసే పంతులమ్మనా అని మహా అంటుంది. ఆ బుర్రుపిట్టను కాసేపు ఆటపట్టిద్దామని. ఓనర్‌గా అవడం జీవితాంతం గుర్తుంటుందని మహాలక్ష్మి అంటుంది. ఏడిపించే ప్లాన్ చెబుతుంది. కేశవను ఓనర్ గారు అంటూ ఏడిపిస్తారు. ఇలా అయితే నేను వెళ్తానని కేశవ అలుగుతాడు.
దాంతో అంతా నవ్వుతారు. నీ కల నెరవేరబోతుంది నా ఆశ తీరుతుందని పెద్ది చెబుతాడు. ఇదంతా మీ వల్లే అని కేశవ అంటాడు. కుటుంబం గురించి గొప్పగా చెబుతాడు పెద్ది. దాంతో చక్రి విజిల్ కొడతాడు. పాత ఓనర్ గురించి అడగ్గానే.. వస్తాడు. మాధవతో డబ్బు ఇప్పిస్తాడు కేశవ. పాత ఓనర్ డబ్బు తీసుకుని ఇకనుంచి ఈ స్థలానికి యజమాని కేశవనే అని అతను చెబుతాడు.
అప్పుడే వచ్చిన శైలు అదంతా పక్కన ఉండి చూస్తుంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడిదాకా వచ్చావని పాత ఓనర్ చెబుతాడు. స్లాట్ బుక్ చేశాను. రేపే రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని చెప్పి పాత ఓనర్ వెళ్లిపోతాడు. వాళ్లంతా సంతోషంగా ఉంటారు. అందరిని పిలిచి నన్ను ఒక్కదాన్నే వదిలేస్తాడా అని కేశవకు కాల్ చేస్తుంది శైలు. అన్నదమ్ములు చక్కిలిగింతలు పెట్టడంతో కేశవకు వినపడదు.
కన్నాపై మహా కోపం
శైలు కోపంగా అలిగి వెళ్లిపోతుంది. అందరికి రెస్టారెంట్లో కేశవ ట్రీట్ ఇస్తాడు. కన్నా ఫోన్ చూసుకుంటూ డల్‌గా ఉంటే మహా కోప్పడుతుంది. 20 ఏళ్లుగా నీతో ఉండని తల్లి ఇప్పుడు ఉంటుందని ఎలా భ్రమపడ్డావని మహా చెబుతుంది. దాంతో కన్నా హుషారై అందరికి ఏమేం కావాలో ఆర్డర్ ఇస్తాడు. మీ నాన్నకు చికెన్ బిర్యానీ ఒకటి, చికెన్ డ్రమ్‌స్టిక్స్ ఆర్డర్ ఇద్దామని మహా అంటుంది.
ఎందుకు బాగా తిని అందరిని తిట్టి కొట్టడానికా. ఆయన గురించి ఎందుకు పట్టించుకుంటున్నారని కన్నా అంటాడు. నువ్వు నిన్ను 20 ఏళ్లు వదిలేసిన నీ తల్లిని నిలదీసి ఉంటే బాగుండేది. 20 ఏళ్ల తర్వాత వచ్చి మళ్లీ వెళ్లినందుకు నీ మీద ప్రేమ లేదని బాధపడి ఉంటే బాగుండేది. సంబంధం లేని మీ నాన్నను ప్రతిసారి నిందించడం నాకు నచ్చలేదు. నోరు మూసుకుని తిను అని కోపంగా చెబుతుంది మహాలక్ష్మి.
దాంతో అందరూ తింటారు. అందరూ కలిసి సెల్ఫీ తీసుకుంటారు. తర్వాత రాత్రి నారాయణ మందు తాగుతుంటాడు. నారాయణకు చికెన్ బిర్యానీ ఇస్తుంది. కేశవ బిల్ కట్టి తెచ్చాడని చెబుతుంది మహా. ఇద్దరు నవ్వుకుంటారు. ఇంతలో వచ్చిన కన్నా జమునను పీక పట్టుకుంది గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతాడు.
మహాపై కన్నా పంచాయతీ
ఇతనికి బిర్యానీ పెడతావా అని ప్లేట్ లాక్కుని పడేయబోతాడు కన్నా. రేయ్ అందులోనుంచి ఒక్క మెతుకు కిందపడిన నీకు నా చేతుల్లో ఉంటదని కన్నాకు వార్నింగ్ ఇస్తుంది మహా. తర్వాత ఇంట్లో మహాపై పంచాయతీ పెడతాడు కన్నా. నా మీద వదినకు ప్రేమ లేదు. నేను ఎంత చెప్పిన నారాయణనే వెనుకేసుకొస్తుందని అంటాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


