Podarillu October 15 Episode: పొదరిల్లు- కేశవ షాప్‌కి 5 లక్షలు- కొట్టేసేందుకు జమున ప్లాన్, మహా డౌట్-లాటరీలో కోటి రూపాయలు

Podarillu Serial October 15th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 15వ ఎపిసోడ్‌‌లో జమునకు మాధవ తన తల్లి బంగారు గాజులు ఇస్తే నారాయణ అడ్డుపడతాడు. నా దేవత గాజులు కోడళ్లకి ఇవ్వమంటాడు. నారాయణపై కన్నాకు ద్వేషం నింపుతుంది జమున. కేశవ షాప్ కోసం అన్నదమ్ములు తెచ్చిన 5 లక్షలపై జమున కన్నుపడుతుంది.

Published on: Oct 15, 2026, 08:20:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అందరికి జమున భోజనం వడ్డిస్తుంది. చక్రికి ఎక్కువ వేస్తుంది. కొత్తగా పెళ్లయిందిగా బాగా తినాలని జమున అంటుంది. చక్రిని కోపంగా చూస్తుంది మహాలక్ష్మి. అత్త చేస్తే తినే భాగ్యం నీకు దక్కిందని మహాను అంటుంది జమున.

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 15 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 15 ఎపిసోడ్

కోటి రూపాయలు కూడా లేవు

వదిన వాళ్లు కోటీశ్వరులు అందుకే వంట నేర్చుకోలేదని కన్నా అంటాడు. ఎంత కోటీశ్వరులు అయితే ఏం లాభం. గదిలో కోటీ రూపాయలు కూడా లేవు అని జమున మనసులో అనుకుంటుంది. ఇంతలో నారాయణ పార్సల్ తెచ్చుకుని తింటాడు. చపాతీలు కూడా ఉన్నాయని చక్రి, మాధవ అంటారు. ఏం కలిపిందో మీరు జాగ్రత్త. అది చేసిన వంట నేను తినను అని నారాయణ అంటాడు.

కన్నా కోపంగా అరవబోతుంటే చక్రి ఆపుతాడు. మూడు పూటల బయట తిను. మా అమ్మ వండింది తినే అర్హత లేదని కన్నా అంటాడు. నువ్వు తినరా పిల్లా బచ్చా. ఎన్ని రోజులు ఇలా గోరుముద్దలు తింటావో నేను చూస్తాను అని నారాయణ అంటాడు. అంతా తింటారు. తర్వాత జమునకు ఇవి మా అమ్మ గాజులు. మీ చేతులు బోసిగా ఉన్నాయి. ఇవి వేసుకోండని మాధవ ఇస్తాడు.

లోపల కావాలని ఉన్నా బయటకు మాత్రం వద్దంటుంది జమున. ఇంతలో నారాయణ వచ్చి ఇవి మీ అమ్మ గాజులురా. ఈ దారినపోయినా దానికి ఇస్తావేంటీ. ఆ దేవత గాజులు ఇస్తే మహాకు ఇవ్వు, మనీషాకు ఇవ్వు. లేదంటే వీడు ప్రేమించిన అమ్మాయికి పెళ్లయ్యాక ఇవ్వు. అంతేగానీ ఇలాంటి పనికిమాలినదానికి మీ అమ్మ గాజులు ఇస్తావేంటీ అని నారాయణ కోప్పడుతాడు.

నిజమేంటో కనుక్కోవాలి

కన్నా కోప్పడతాడు. దాన్ని తల్లిగా కూడా చూడలేను. మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ వేసుకునే అర్హత దీనికి లేదు. నన్ను కాదని దీనికి ఈ ఇంట్లో ఒక్క రూపాయి ఇచ్చిన ఊరుకోను. జాగ్రత్త అని నారాయణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఇందుకే నేను రానన్నంది అని జమున అంటే.. ఎందుకంత కోపమో మీరు కూడా చెప్పట్లేదని మహా అంటుంది.

ఇది నా రాత అని లోపలికి వెళ్లిపోతుంది జమున. తర్వాత నారాయణ చేస్తున్న దాని గురించి మహాను చక్రి అడుగుతాడు. ఇద్దరు చెప్పట్లేదు ఏం జరిగిందో అని అనుకుంటారు. భార్యాభర్తలు గొడవలు పడతారు. భర్త ఊరుకోవాలి. మీరు అంటే నేను ఊరుకోవట్లేదా అని చక్రి అంటాడు. హా అని మహా అంటే.. ఏం లేదంటాడు చక్రి.

సుపుత్రుడు మనం అనుకున్నంత చెడ్డవాడు కాదు. ఇందాక మీ అమ్మ గాజులు తెచ్చి ఇస్తుంటే మీ అమ్మ గారిని దేవత అన్నాడు. మీ నాన్నగారి దృష్టిలో మీ అమ్మ దేవత అంటే హత్య ఎందుకు చేస్తాడు. మీ నాన్నగారు చెడ్డవారు కాదు. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని మహా అంటుంది. బంగారం లాంటి అవకాసం చేజారిందని జమున అనుకుంటుంది.

నారాయణ పళ్లు రాలగొడతాను

ఎంతలేదన్నా రెండు లక్షలు వచ్చేవి. నా మొగుడి అప్పుల్లో ఎంతైన కొంత తీరేది అని పైకే అనుకుంటుంది జమున. ఇంతలో కన్నా వస్తాడు. కన్నాను చూసి జమున షాక్ అవుతుంది. నన్ను క్షమించమ్మా.. అని కన్నా అంటే.. వీడు నేను మాట్లాడుకుంది వినలేదన్నమాట అనుకుంటుంది జమున. నారాయణ బంగారు గాజులు ఇవ్వనివ్వకుండా నొప్పించాడు కదమ్మా అని కన్నా అంటాడు.

నీకోసం వచ్చాను. అవన్ని వద్దన్నట్లుగా జమున మాట్లాడుతుంది. ఆ నారాయణ పళ్లు రాలగొడతాను చూడు అని కన్నా అంటే.. తండ్రిని అలా అనకూడదని జమున డ్రామా ఆడుతుంది. నా జీవితం ఎప్పుడు ఇంతే. నిన్ను వదిలేసి వెళ్లడానికి కూడా కారణం మీ నాన్నే. ప్రాణం పోసిన కన్నా ఈ కన్నాను కూడా వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడెలా చూశాడో ఇప్పుడు అలాగే ద్వేషిస్తున్నాడు అని నారాయణపై కన్నాకు ద్వేషం పెంచుతుంది జమున.

నీకోసం నేనున్నా అమ్మా అని జమున ఒడిలో పడుకుంటాడు. నేను వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్లడానికి వీడు ఒక్కడు చాలు. వీడిని నమ్మిస్తే చాలు నా పని సులువు అవుతుందని జమున అనుకుంటుంది. జమున కాల్ చేయట్లేదేంటని కాల్ చేస్తాడు ముఖేష్. జమునకు కాల్ రావడం మహా వింటుంది. జమున బయటకెళ్లి మాట్లాడుతుంది.

లాటరీలో కోటి రూపాయలు

ఏంటయ్యా అని జమున అడిగితే.. బజారులో లాటరీ పెడితే కోటి రూపాయలు వచ్చాయని చెప్పడానికి కాల్ చేశానని ముఖేష్ వెటకారం ఆడతాడు. అది అర్థం చేసుకున్న జమున వచ్చిన పనిలోనే ఉన్నానని చెబుతుంది. జమున కాల్ మాట్లాడుతున్నది చూసిన మహాలక్ష్మి ఈ టైమ్‌లో ఎవరితో మాట్లాడుతుందని అనుకుంటుంది.

ఇక్కడ పని చేస్తుంటే పుణ్యకాలం గడిచిపోతుంది. ఇప్పటివరకు చిల్లరే దొరికింది. ప్రతిసారి ఫోన్ చేయకు. ఆ నారాయణకు దొరికితే చస్తామని కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది జమున. మహా ఉంటుంది. మహాను చూసి షాక్ అవుతుంది. ఏం చేస్తున్నారని అడిగితే.. నిద్రపట్టకపోతే ఇలా వచ్చానని జమున అబద్ధం చెబుతుంది. అబద్ధం. మీరు ఫోన్‌లో మాట్లాడటం విన్నాను. ఏం జరిగింది. డబ్బు దొరకగానే కాల్ చేస్తానని ఎందుకు అన్నారు. అసలు ఎవరితో మాట్లాడారు నిలదీస్తుంది మహా.

దానికి మరింత షాక్ అవుతుంది జమున. ఏమైనా సమస్య అని మహా అంటే.. సమస్య అంటది ఏంటీ.. ఆ ఒక్కమాటే విందా. బ్రతికిపోయాను అని జమున అనుకుంటుంది. నేను పని చేసిన ఒకావిడ దగ్గర డబ్బు తీసుకున్నాను. ఇప్పుడు కావాలని ఇబ్బందిపెడుతుంది. ఐదు వేలు అని జమున అంటుంది. నేను ఇస్తాను రేపు వెళ్లి ఇచ్చేయండని మహా అంటుంది.

జమునకు మహా 5 వేలు

సరేనంటుంది జమున. మహాకు జమున 5 వేలకు టోకర వేసినట్లు తెలుస్తోంది. చక్రి గురించి అడిగితే.. తెలియదని మహా అంటుంది. మీ ఆయన గురించి నీకు తెలియకపోవడం ఏంటీ. పెళ్లాయ్యాక తమ్ముళ్లలతో పడుకోవడం ఏంటీ. పెద్దబాబు ఉండగా మీరు చేసుకున్నారేంటీ అని జమున అడుగుతుంది. మాది లవ్ మ్యారేజ్. ప్రేమించి పెళ్లిచేసుకున్నాం అని మహా చెబుతుంది.

ఆ మాటలు చక్రి విని నా మీద ప్రేమ ఉంది అనుకుంటాడు. చక్రి సిగ్గుపడిపోతాడు. మీకు పెళ్లిచూపులు జరుగుతున్నాయా ఎందుకు సిగ్గుపడిపోతున్నారు. మూతి మీద వాతపెడతాను మహా అంటుంది. నా సిగ్గుకు కారణం మీరే. ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పారుగా అని చక్రి అంటాడు.

మరుసటి రోజు ఉదయం కేశవకు షాప్ కోసం రెండు లక్షలు ఇస్తాడు మాధవ. నా వైపు నుంచి లక్షా 50 వేలు అని చక్రి ఇస్తాడు. మహాలక్ష్మి నుంచి లక్షా 50 వేలు. నారాయణ కూడా డబ్బు ఇస్తాడు. అదంతా చూసిన జమున నా పంటపండబోతుంది. మంచి టైమ్‌లోనే అడుగుపెట్టాను అని డబ్బువైపు ఆశగా చూస్తుంది.

కేశవ షాప్ డబ్బు దొంగతనం

అది మహా గమనిస్తుంది. మొత్తానికి కేశవ షాప్ కోసం అన్నదమ్ములు, మహా, నారాయణ కూడబెట్టిన 5 లక్షల డబ్బును కొట్టేయాలనుకుంటుంది జమున. అక్కడితో పొదరిల్లు సీరియల్ నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More