Podarillu September 29 Episode: పొదరిల్లు- చక్రి పెంపకంపై మాధవ నిలదీత- మనది నిజమైన పెళ్లేనా మహాలక్ష్మిగారు- చక్రి ప్రశ్న
Podarillu Serial September 29th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 29వ ఎపిసోడ్‌లో చక్రి ఇంటికి గోపిక ఫ్రెండ్స్ సత్య వచ్చి నలదీస్తారు. చక్రి వచ్చి మాట్లాడుతాడని కేశవ సర్దిచెప్పి పంపిస్తాడు. మరుసటి రోజు గోపికను ఇంటికి తీసుకొస్తాడు కన్నా. ఎందుకు దూరం పెడుతున్నారని, చచ్చిపోతానని గోపిక ఏడుస్తుంది.
Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి డల్‌గా ఉంటే మహాలక్ష్మి ఏమైందని వెటకారంగా అడుగుతుంది. ఇంతలో మాధవ వచ్చి అందరికి మనీషా చేసిన రసగుల్లా స్వీట్ ఇస్తాడు. ఇది ఎవరో ప్రేమతో చేసినట్లు ఉందే అని అంటారు. మనీషా చేసిందని మాధవ అంటాడు.

చక్రిని నిలదీసిన సత్య
తమ్ముళ్లు ఆటపట్టించడంతో మనీషాను సైట్‌కు వచ్చి ఇచ్చిందని, రాత్రిపూట ఒక్కదాన్నే ఎలా పంపాలని సైకిల్ మీద ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చానని మాధవ చెబుతాడు. కాంట్రాక్టర్‌తో ఇంటి గురించి మాట్లాడి చివరిలో టీకే టీకే అంటాడు మాధవ. దాంతో అంతా ఆటపట్టిస్తారు. చక్రి దగ్గరికి సత్య వచ్చి గోపికను ఎందుకు అవైడ్ చేస్తున్నారు. చాలా మాటలు చెప్పారు. ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని కోప్పడుతుంది సత్య.
గోపికను మోసం చేద్దామనుకుంటున్నారా అని సత్యం నిలదీస్తుంది. మోసం ఏంటీ. రెండు రోజులుగా బాగా మాట్లాడితే తనే దానికి ప్రేమ అని పేరు పెట్టుకుంది. నువ్వు వచ్చి మోసం అంటావేంటీ అని చక్రి అంటాడు. అది చాలా హర్ట్ అయింది. అది ఏమైనా చేసుకుంటే ఎవరిది బాధ్యత. తనతో మాట్లాడితే కానీ వెళ్లం అని సత్య అంటుంది.
ఆ అమ్మాయి సెన్సిటివిటీ అంటున్నావ్ అలా వదిలేసి వస్తే ఎలా. చక్రినే ఇంటికి పంపిస్తాను. వాళ్లిద్దరే మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీరు వెళ్లండని కేశవ చెబుతాడు. సరే అని సత్య వాళ్లు వెళ్తారు. ఏంట్రా ఇంతదాక తెచ్చుకున్నావ్. వెళ్లి జరిగింది చెప్పు లేకుంటే సమస్య అవుతుందని చక్రికి సలహా ఇస్తాడు కేశవ. మరుసటి రోజు ఉదయం ఫోన్ పక్కన పెట్టి టెన్షన్ పడుతుంటాడు చక్రి.
17 మిస్‌డ్ కాల్స్ ఉన్నాయేంటీ
నారాయణకు మళ్లీ ఫీవర్ చెక్ చేస్తుంది మహా. జ్వరం తగ్గింది కదా అని వైన్స్ షాప్‌కి వెళ్తే ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది మహా. అనవసరంగా నీలో ఆశలు పెంచాను అని గోపిక గురించి ఆలోచిస్తాడు చక్రి. మనీషా గురించి మాధవను అడుగుతుంది మహా. నచ్చినవాళ్లతో కబుర్లు చెప్పుకోవాలంటే భాషా రావాల్సిందే అంటుంది మహా. నీ ఫోన్ ఏమైంది. ఓనర్ ఓంకార్ కాల్ చేశాడు. డ్యూటీకి రాకుండా ఇంట్లో కూర్చున్నాడు. కాల్ చేస్తే రావట్లేదని నాకు కాల్ చేసి తిడుతున్నాడని మాధవ అంటాడు.
సరే అని చక్రి వెళ్లిపోతాడు. కానీ, ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్తాడు. చక్రి ఫోన్ మహా చూస్తుంది. అందులో గోపిక 17 సార్లు మిస్‌డ్ కాల్స్ చూస్తుంది మహా. చక్రిని అడిగితే కవర్ చేసి వెళ్లిపోతాడు. ఏదో జరుగుతుందని డౌట్ పడుతుంది మహా. మరోవైపు బస్ స్టాప్ దగ్గర గోపిక, సత్య ఎదురుచూస్తారు. చక్రికి నువ్వంటే ఇష్టం లేదే అని సత్య చెబుతుంది.
కానీ, గోపిక వినదు. మహా, కన్నా వస్తారు. సత్యను పంపిస్తుంది గోపిక. మహా, కన్నా దగ్గరికి గోపిక వెళ్లి చక్రి వస్తున్నారో లేదో కనుక్కుందామని వచ్చానని చెబుతుంది. మహా వెళ్లిపోతుంది. చక్రికి ఎన్నిసార్లు కాల్ చేసిన లిఫ్ట్ చేయట్లేదు. నా ఫ్రెండ్స్‌కి నా బాయ్‌ఫ్రెండ్ అని పరిచయం చేశాను. అప్పుడు వెళ్లాడంటే మళ్లీ కనిపించలేదని కన్నాకు జరిగింది చెబుతుంది గోపిక.
గోపికను ఇంటికి తీసుకెళ్లిన కన్నా
మా అన్నయ్య ఎక్కడున్నాడో నాకు ఎలా తెలుస్తుందని కన్నా అంటాడు. గోపిక చాలా బతిమిలాడుకుంటుంది. ఇది ఎక్కువ సమస్య అయ్యేలా ఉంది. ఇక్కడితోనే చెక్ పెట్టాలి అని గోపికను ఇంటికి తీసుకెళ్తాడు కన్నా. గోపికను చూసి ఎవర్రా ఈ పిల్లా రెండు మూడా నాలుగా అంటాడు నారాయణ. ష్.. అని గోపికను లోపలికి తీసుకెళ్తాడు కన్నా.
నా ఇంటికే అమ్మాయిని తీసుకొచ్చి నన్నే మూసుకోమంటాడేంటీ ఈ లిటిల్ ఫింగర్ గాడు అని నారాయణ అనుకుంటాడు. గోపికను చూసి చక్రి వాళ్లు అంతా షాక్ అవుతారు. నీకోసం ఏడుస్తుంది. ఇవాళ అంతా క్లియర్ అయిపోవాలని తీసుకొచ్చానని కన్నా చెబుతాడు. నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదని, ఎందుకు దూరం పెడుతున్నారని చక్రిని నిలదీస్తుంది గోపిక.
నిన్ను ప్రేమించినందుకు నా ఫ్రెండ్స్ అంతా నన్ను హేళనగా మాట్లాడారు అని గోపిక అంటుంది. వీడికి నా పోలికలే వచ్చినట్లున్నాయి. డాంకీ సన్ అని నారాయణ తిట్టుకుంటాడు. పక్కకు రా మాట్లాడుతా అని తీసుకెళ్తాడు చక్రి. మహాను ఏడిపించాలని, ఉడికించాలని చేశాడు. ఆ అమ్మాయి డీప్ లవ్‌లో ఉన్నట్లుంది. పెద్ద సమస్యగా మారేలా ఉందని కేశవ అంటాడు.
వాడికి రెండో పెళ్లి
ఏం జరుగుతుందిరా లోపల అని నారాయణ అడిగితే.. వాడికి రెండో పెళ్లి జరుగుతుంది. వెళ్లి అక్షింతలు వేయు అని కేశవ అంటాడు. గోపిక ఏడుస్తుంది. ఎంతోమంది లవ్ చేస్తే కొట్టించాను, చెప్పు చూపించాను, తిట్టాను. నిన్ను మాత్రం ప్రేమించాను అని గోపిక అంటుంది. నేను నీకు ప్రేమిస్తున్నా అని చెప్పానా అని చక్రి అంటే.. నేను చచ్చిపోతాను అని గోపిక అంటుంది.
అమ్మో అలా అనకు. నిన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేశాను అని చక్రి అంటాడు. నేను చిన్న పిల్లనేంటీ.. సారీ ఫంక్షన్ అయి ఏడేళ్లు అవుతుందని, గోపి అని పిలిచేవాడివి గోడమీద పిల్లిలా దూకుతావనుకోలేదని గోపిక అంటుంది. నాకు డప్పులు మోగుతున్నాయి. ఇంటికెళ్లు తర్వాత మాట్లాడదాం అని చక్రి అంటాడు. ముందే నేనంటే ఇష్టం లేదని చెప్పుంటే అలవాటు లేకపోయినా రెండు బీర్లు తాగి మర్చిపోయేదాన్ని అని గోపిక అంటుంది.
ఏమంటారు శ్రీమతి మహాలక్ష్మి గారు
అదంతా మాధవ చూస్తాడు. గోపిక వెళ్లాక చక్రిని తిడతాడు. నిన్ను ఇలాగే పెంచానా. నీకు పెళ్లయింది అని మాధవ అంటే.. ఆగు అన్నయ్య. నాకు పెళ్లయిందని ఎవరన్నారు. కోర్టా.. పోలీసులా.. మాకు జరిగింది నిజమైన పెళ్లి అని మహాలక్ష్మి అనుకుంటే నేను గోపిక మాట్లాడటం తప్పే. ఏమంటారు శ్రీమతి మహాలక్ష్మీగారు అని పెళ్లిని ఒప్పుకుంటున్నారా అని నిలదీస్తాడు చక్రి. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


