Podarillu September 14 Episode: జుట్లుపట్టి కొట్టుకున్న తాయారు, జయంతి తల్లి- పంతులుతో కేశవ, కన్నా డీల్- జాతకాల ట్విస్ట్!

Podarillu Serial September 14th Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 14వ ఎపిసోడ్‌‌లో చక్రి ప్లాన్ ఫెయిల్ కావడంతో తాయారును రెచ్చగొడతాడు నారాయణ. దాంతో జయంతి తల్లితో తాయారు గొడవపెట్టుకుంటుంది. ఇద్దరు జుట్టుపట్టి కొట్టుకుంటారు. పంతులు పైసల మనిషిలా ఉన్నాడని మూడింతల డబ్బుతో కొనేస్తారు కేశవ, కన్నా.

Published on: Sep 14, 2026, 08:24:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చక్రి తను వేసిన ప్లాన్‌తో నిశ్చితార్థం క్యాన్సిల్ అయిపోతుందని, అంతా సర్దండని గొప్పలు చెబుతాడు. ఇంతలో చాలా అలసటగా జయంతి తల్లి వస్తుంది. ఆమెను చూసి మీ అమ్మాయికి ఈ నిశ్చితార్థం అంటే ఇష్టం లేదని చెప్పేందుకేగా మీరు వచ్చారని చక్రి అంటాడు.

పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 14 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 14 ఎపిసోడ్

చక్రి ప్లాన్ ఫెయిల్

తనకు బాగా నచ్చే చేసుకుంటుందిగా అలా ఎందుకు చెబుతుంది. ఎవరు చెప్పిన మీ అన్నయ్యే కావాలంటుందని జయంతి తెల్లి చెబుతుంది. దాంతో అంతా చక్రిని తిడతారు. అలా చక్రి ప్లాన్ ఫెయిల్ అవుతుంది. బాగా ఆలోచించిన నారాయణ తాయారును చూసి నాకో అద్భుతమైన ఐడియా వచ్చిందంటాడు. తాయారును ఆయుధంగా వాడదమంటాడు.

ఆ గయ్యాలికి మా వియ్యపురాలికి గొడవ పెడతాను. దాంతో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ అవుతుందని నారాయణ చెబుతాడు. తాయారు దగ్గరికి వెళ్లిన నారాయణ తెగ నవ్వుతాడు. ఎందుకురా నవ్వుతున్నావ్ అని తాయారు అడుగుతుంది. నువ్వు ఒక గయ్యాలి గంపవని, ముళ్లకంపవని, డ్రైనేజీ కంపువని మా వియ్యపురాలు అంది. వాళ్ల భర్తతో చెప్పగా విన్నాను. నువ్వు ఇక్కడ కూడా ఫేమస్ అయిపోయావని చాలా ఎక్కిస్తాడు నారాయణ.

జుట్టు పట్టుకుని కడిగేస్తాను

దాంతో కోపంగా ఊగిపోయిన తాయారు దాన్ని జుట్టు పట్టుకుని కడిగేస్తాను అని అంటుంది. జయంతి తల్లిని ఒసేయ్ అంటూ గొడవ పెట్టుకుంటుంది. జయంతి తల్లి కూడా రెచ్చిపోతుంది. ఇద్దరు జుట్లుపట్టుకుని కొట్టుకుంటారు. అదంతా నారాయణ వాళ్లు చూసి తెగ సంతోషిస్తారు. అప్పుడే మాధవ రావడం చూసి చక్రి ఆపేందుకు ట్రై చేస్తాడు.

మాధవ వచ్చి ఏమైందని అడుగుతాడు. ఇది మీ మేనత్త అని తెలిసుంటే ఈ పెళ్లికి ఒప్పుకునేదాన్ని కాదు. పెళ్లి లేదు ఏం లేదు నిశ్చితార్థం క్యాన్సిల్ అని జయంతి తల్లి అంటుంది. దాంతో క్యాన్సిల్ అని నారాయణ సంతోషిస్తాడు. ఏం క్యాన్సిల్ అయిందని మాహాలక్ష్మీ అడుగుతుంది. అదంతా నారాయణ కలకంటాడు. ఇప్పుడు ఆ కలను నిజం చేస్తానని నారాయణ అంటాడు.

ప్లాన్ చెడగొట్టిన గాయత్రి

అనుకున్నట్లుగానే తాయారు దగ్గరికి వెళ్లి నారాయణ ఎక్కిస్తాడు. దాని అంతు చూస్తాను అని తాయారు వెళ్తుంది. తాయారు వెళ్తుంటే గాయత్రి ఆపుతుంది. నీకు ఎక్కడికి వచ్చిన గొడవలేనా అని గాయత్రి అంటుంది. నారాయణ చెప్పాడని తాయారు అంటుంది. నీ గురించి ఎవరైనా తిడితే మావయ్య సంతోషిస్తాడు కానీ నీకెందుకు చెబుతాడు అని గాయత్రి అంటుంది.

ఇంతలో జయంతి తల్లి వచ్చి మర్యాదలు చేస్తుంది. అదంతా చూసి ఇదంతా నారిగాడి పనే. చెబుతా వాడి సంగతి అని తాయారు అంటుంది. అలా నారాయణ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుంది. అబ్బా గాయత్రి ఈ ప్లాన్ చెడగొట్టేసిందని నారాయణ అనుకుంటాడు. తర్వాత నారాయణ కుటుంబం దగ్గరికి వెళ్లి గాయత్రి మాట్లాడుతుంది.

పంతులు పైసల మనిషి

అమ్మను ఎందుకు రెచ్చగొట్టావ్ అని అడుగుతుంది గాయత్రి. నిశ్చితార్థం ఆగిపోవాలని ఇలా చేశామని, కేశవ, శైలుల పెళ్లికోసం పెద్ది ఇలా పెళ్లి చేసుకుంటున్నాడని మహాలక్ష్మి జరిగింది మొత్తం చెబుతుంది. మొదటిసారి దాని నోరు వాడి మంచిపని చేద్దామనుకున్నాం. నువ్వు చెడగొట్టావ్ అని నారాయణ అంటాడు. ఇంతలో కన్నా ఐడియా అంటూ కేశవను బయటకు తీసుకెళ్తాడు.

నిశ్చితార్థానకి వచ్చిన పంతులు సంభావణ విషయంలో ఏమాత్రం తగ్గిన మధ్యలోనే ఆపేసి వెళ్లిపోతా అని ఫోన్‌లో మాట్లాడుతాడు. అతన్ని కేశవకు చూపిస్తాడు కన్నా. ఇతనే నిశ్చితార్థానికి వచ్చిన మహానుభావుడు, ఆపద్భాందవుడు. అతను పంతులు కాదు పక్కా పైసల మనిషి. ఆ పైసలతో అతన్ని కొనేస్తే ఏదో ఒక వంకతో నిశ్చితార్థం ఆపేస్తాడని కన్నా అంటాడు.

జాతకాల ట్విస్ట్

నిశ్చితార్థం చెడగొట్టాలి. మీరు తీసుకునే సంభావణ కంటే ఎక్కువ ఇస్తాం. జాతకాలు బాగాలేవని ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేయాలని కన్నా చెబుతాడు. అంటే అబద్ధం చెప్పాలా. నేను చెప్పను. మీరు ఇచ్చే డబుల్ సరిపోదు. ట్రిపుల్ కావాలి అని పంతులు అంటాడు. దానికి కేశవ, కన్నా ఒప్పుకుని డబ్బు ఇస్తారు. పంతులు సరేనంటాడు.

తర్వాత జయంతి, మాధవ జాతకాలు చూస్తాడు పంతులు. బాగున్నాయా జాతకాలు అని జయంతి తండ్రి అడుగుతాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More