Podarillu November 2 Episode: పొదరిల్లు- షాప్ వదిలేస్తానన్న కేశవ- మాధవపై మనీషాకు కన్నా తప్పుడు పదాలు-చక్రికి భర్త స్థానం

Podarillu Serial November 2nd Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 2వ ఎపిసోడ్‌‌లో నారాయణ గొప్పదనం గురించి మహా చెబితే కన్నా వినడు. కేశవ షాప్ కొత్త డిజైన్‌ను మహా పంపుతుంది. అదే విషయం శైలుకు చెబితే అలుగుతుంది. మాధవను పట్టుకుని ఏడుస్తాడు కన్నా. తను వెళ్లిపోయినందుకు క్షమించమంటాడు. అక్కడికి మనీషా వస్తుంది.

Published on: Nov 2, 2026, 08:44:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నారాయణ మంచివాడని, గొప్పవాడని కన్నాకు చెబుతుంది మహాలక్ష్మి. కన్నా మాత్రం వినడు. ఆయన గురించి తెలిస్తే మాకంటే ఎక్కువ ఇష్టపడతావ్ అని మహా అంటుంది. మమ్మల్ని కన్నాడు కానీ మా గురించి పట్టించుకున్నాడా. తాగడం తప్పా ఏమైనా చేశాడా, మా అమ్మ వెళ్లిపోడానికి కారణం అతనే అని కన్నా అంటాడు.

పొదరిల్లు సీరియల్ నవంబర్ 2 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 2 ఎపిసోడ్

నమ్మింది అబద్ధమని తెలిసినప్పుడు

దానికి గ్యారెంటీ ఏంటీ. మనకు తెలియనప్పుడు ఎవరిని నిందించొద్దు. మనం నమ్మింది అబద్ధమని తెలిసినప్పుడు మనమే ఇబ్బిందిపడాల్సివస్తుంది. పెద్ది నిన్ను సొంత కొడుకులా పెంచుకున్నడా. తనతోపాటు అందరూ నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ బృందావనంలో కృష్ణుడు ఉంటే సంతోషంగా ఉంటుంది. ఈ బృందావనంలో కన్నా ఉంటే సంతోషంగా ఉంటుందని, నువ్వు లేకపోతే వాళ్లు సంతోషంగా ఉండరు మహా చెబుతుంది.

నన్ను క్షమించు వదినా. ఆయన మీద కోపంగా వెళ్లాను కాబట్టి అన్నయ్యలకు దూరంగా ఉండాలని కాదు. నాతోపాటు నువ్వు కూడా ఉండాలి. నువ్వు మా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్ వదినా అని కన్నా అంటాడు. మా సుపుత్రుడిని తిట్టవుగా అని మహా అంటే.. అది ఆయన ప్రవర్తనపై ఉంటుందని కన్నా కాలేజ్‌కి వెళ్తాడు. బస్టాప్‌లో సత్యను కన్నా పలకరిస్తే పట్టించుకోకుండా ఆటోలో వెళ్లిపోతుంది.

మరోవైపు శైలు గురించి కేశవతో మాట్లాడతాడు అసిస్టెంట్. ప్రేమలో గొడవలే అందమట అని బుస్సు చెప్పిందని కేశవ అంటాడు. ఇంతలో కేశవ ఫోన్‌కో తన షాప్ కొత్త లుక్ డిజైన్ ఫొటో వస్తుంది. అది మహాలక్ష్మి పంపించిందని చెబుతాడు. చాలా బాగుందనుకుంటారు ఇద్దరు. ఇంతలో శైలు వస్తుంది. శైలు కూడా చూసి డిజైన్ చాలా బాగుందంటుంది.

షాప్ పక్కనపెడతానన్న కేశవ

మహాలక్ష్మి చేసిందని కేశవ చెప్పేసరికి బుస్సు ఫీల్ అవుతుంది. మహా గురించి గొప్పగా చెబుతాడు కేశవ. దాంతో కోపంతో అలిగి వెళ్లిపోతానంటుంది. నాకు ఏ విషయం చెప్పట్లేదని, ముందుగా చెప్పాలని బాధ్యత లేదని, మీకు మీ వదిన ఉండగా నేనెందుకు గుర్తుకొస్తాను. ప్రేమ విషయంలో నువ్వు అంత తుస్సు అని అర్థమైందని శైలు అంటుంది.

ముద్దు లేదు ముచ్చటలేదు. గుర్తొచ్చి కాల్ చేస్తే గొడవ అని శైలు అంటుంది. ఇకనుంచి మన పెళ్లి అయ్యేవరకు నీ కొంగు చుట్టూ తిరుగుతాను. 24 గంటలు ఏ పని లేకుండా నీతోనే తిరుగుతాను. షాపెందుకు పక్కనపెడతా. నీకన్నా నాకు షాప్ ఎక్కువ కాదని కేశవ అంటాడు. నిజంగా అంటున్నావా, వెటకారంగా అంటున్నావా అని శైలు అడిగితే.. నిజమే అని కేశవ అంటాడు.

బండరాయిలాంటి మా అన్న బ్రో మనసు నీ ప్రేమతో మార్చేశావ్ పార్టనర్ అని అసిస్టెంట్ అంటాడు. మరోవైపు చక్రికి కాల్ చేసిన మహాలక్ష్మి అర్జంట్‌గా రమ్మని చెబుతుంది. నీ పంటపండిందిరోయ్ అని చక్రి ఉత్సాహంగా వెళ్తాడు. మరోవైపు పెద్ది దగ్గరికి వెళ్లి కన్నా హగ్ చేసుకుంటాడు. బాధపెట్టినందుకు క్షమించమంటాడు కన్నా. నీ గురించి ఆలోచించకుండా వెళ్లిపోయానని పశ్చాత్తాపపడతాడు కన్నా.

అదే చివరి రోజు అవుతుంది

ఏది ఆలోచించకుండా చేయకు. నీ గురించి ఆలోచించే అన్నయ్య ఉన్నాడని మర్చిపోకు. నీకు ఏదైనా జరగరానిది జరిగితే ఈ అన్యయ్యకు కూడా అదే ఆఖరి రోజు అవుతుంది అని పెద్ది అంటాడు. దాంతో ఏడుస్తూ మాధవను హత్తుకుంటాడు కన్నా. పెద్ది, కన్నా ఏడిపిస్తారు. కన్నాను ఓదారుస్తాడు మాధవ. ఇవాళ ఉదయం వదిన మాట్లాడాకా ప్రశాంతంగా ఉంది. నేను చేసిన తప్పు తెలిసేలా చేసిందని కన్నా అంటాడు.

ఇంతలో మనీషా రావడం చూసి కన్నా సెటైర్లు వేస్తాడు. మాధవ కోసం బోండాలు తెచ్చానని మనీషా చెబుతుంది. మనీషాకు కన్నా చాక్లెట్ ఇస్తాడు. ధన్యవాద్ అని మనీషా చెబితే కృతజ్ఞతలు అనాలని, హిందీలో మాట్లాడితే ఎలా తెలుగు నేర్చుకొమ్మని, నేను నేర్పిస్తానని కన్నా అంటాడు. అన్నయ్య రాగానే నువ్వు ఒక పోకిరి అని చెప్పు చాలా సంతోషిస్తాడని కన్నా చెబుతాడు. అలా మనీషాకు తప్పుడు పదాలు నేర్పుతాడు కన్నా.

మాధవ రాగానే మనీషా అలాగే చెబుతుంది. మాధవ, బన్సీ షాక్ అవుతారు. అలా ఇద్దరితో కన్నా ఆడుకుంటాడు. కన్నా ఇలా చెప్పాడని మనీషా అంటుంది. అలా అంటే పెద్ద బద్మాష్ అని అసలైన అర్థం చెబుతాడు బన్సీ. దాంతో కన్నా నవ్వుతాడు. నాకు గలత్ తెలుగు నేర్పిస్తావా అని కోప్పడుతుంది మనీషా. మాధవ వదిలేయమంటాడు.

నీ పోకిరికి పెట్టు

ఇలాగే సంతోషంగా ఉండమని మాధవ అంటాడు. ఆయన వల్ల తప్పా నాకు ఏ బాధ లేదని కన్నా వెళ్లిపోతే.. మనీషా బోండాలు తినమంటుంది. నీ పోకిరికి పెట్టు అని కన్నా వెళ్లిపోతాడు. మరోవైపు మహాను కలుస్తాడు చక్రి. పర్సనల్‌గా మాట్లాడాలని మహా అంటుంది. దాంతో తన మనసులో నాకు భర్త స్థానం దొరికేసినట్లే ఉందని చక్రి మనసులో తెగ సంబరపడిపోతాడు.

ఫోజు కొడుతూ కారు దిగుతాడు. మహా సెటైర్లు వేస్తుంది. పక్కకు వెళ్లి మాట్లాడుకుంటారు ఇద్దరు. కొంచెం ఇబ్బందిగా ఉందని, ఇలాంటి విషయం మీతో మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదని మహా అంటుంది. దాంతో ఫ్రెండ్‌కి కాల్ చేసి బస్తా కొబ్బరికాయలు కొనమని చెబుతాడు. నా ఆలోచన మారింది, నా మనసు మారింది. నా మనసులోని మాట చెప్పాలని పిలిపించానని మహా అంటుంది.

దాంతో ఒక బస్తా కాదురా పది బస్తాలు కొనమని ఫ్రెండ్‌కి కాల్ చేసి చెబుతాడు చక్రి. ఇకనుంచి మీరెవరో నెనేవరో కాదండి. ఇద్దరం ఏదో అవుతామనిపిస్తుందండి. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం, మీతో బంధాలు పెంచుకోవడం, కన్నా వదిన అని పిలవడం, మీరు ఎవరినో చూస్తుంటే జెలసీగా ఫీల్ అవడం అంతా యాదృఛ్చికం అనుకున్నా అని మహా అంటుంది.

పెళ్లికాని వాళ్లకు 50 శాతం డిస్కౌంట్

తర్వాత కారులో చక్రి మహా వెళ్తుంటారు. దారిలో ఇద్దరు అమ్మాయిలు లిఫ్ట్ అడుగుతారు. వాళ్లిద్దరు ఎక్కుతారు. చక్రి కలిపిన పులిహార ముచ్చట్లు చెబుతారు. కారు వెనుక బోర్డ్ ఉండేదిగా పెళ్లికానీ అమ్మాయిలకు 50 శాతం డిస్కౌంట్ ఉండేదని చెబుతారు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More