Podarillu October 30 Episode: పొదరిల్లు- 20 ఏళ్ల తర్వాత అమెరికాలో మహా- కన్నా మనసు మార్చేలా మాధవతో ప్లాన్- కేశవ గిఫ్ట్
Podarillu Serial October 30th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 30వ ఎపిసోడ్లో కన్నా వచ్చి తనకోసం వెతకనందుకు అందరిపై అలుగుతాడు. నారాయణ సైకిల్ మీద వచ్చాడని, తనకు ఫోన్ చేశాడని చెబుతుంది మహా. తండ్రిపై కన్నా మనసు మార్చాలని మాధవతో చెబుతుంది మహా. కిందపడిపోతున్న కన్నాను నారాయణ పట్టుకుటాడు.
Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కన్నా ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. నాకోసం ఎందుకు రాలేదని అలుగుతాడు. చక్రిని అన్నయ్య అని పిలవను అని కన్నా అంటాడు. దాంతో చక్రి బాగా ఫీల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఊరికే అన్నాను అని కన్నా అంటాడు. అన్నది మర్చిపోయావా. అన్నయ్యలను మర్చిపోయి వెళ్లావ్ అందుకే వాడిని అంతలా ఏడిపిస్తున్నావని కేశవ అంటాడు.

ఎంతైనా మనది రక్తసంబంధం కదా
ఇదేంటీ రివర్స్‌లో నన్ను అంటున్నారు. నేను అంటే మీరు అన్నయ్యలు కాకుండా పోతామా. ఎంతైనా మనది రక్తసంబంధం అని కన్నా అంటాడు. ఇంతలో మహాలక్ష్మి వస్తే తన చున్నీతో కన్నీళ్లు తుడుచుకుంటాడు చక్రి. నువ్వు నన్ను వదిన అని పిలుస్తున్నావ్. ఆ అధికారంతో కొట్టాను తప్పా. ఎంత కోపం ఉన్నా కన్నతండ్రికి గౌరవం ఇవ్వాలి. ఆయన వయసుకు మర్యాద ఇవ్వాలి అని మహా అంటుంది.
నువ్వు నన్ను కొట్టావ్. నీకిష్టమైన మనిషి కోసం కొట్టావ్. వెళ్తే వీళ్లను వెతకడానికి రానివ్వలేదని కన్నా అంటాడు. వెతకాలని అనుకునేవాడివి ఎందుకు వెళ్లావురా అని మహా అంటుంది. ఉంటే ఉండు పోతే పో అన్నావుగా అని కన్నా అంటే.. మరి నీ కన్నతండ్రినే చచ్చిపోమ్మని అనలేదా. ఎంతపెద్ద తప్పు మాటరా అని మహా కోప్పడుతుంది.
చిన్నప్పటినుంచి నువ్వు ఏం అన్నా నిన్ను ఏమైనా అన్నాడా. మనమంతా ఒకే కుటుంబంరా ఏదైనా తప్పు చేస్తే ఇల్లు వదిలి వెళ్లిపోతామా అని మహా అంటుంది. దాంతో చక్రి ఆశగా చూస్తాడు. నిన్ను కొట్టినందుకు మీ చక్రి అన్నయ్య నన్ను అనరాని మాటలు అన్నాడు. నేను వెళ్లానా అని మహా చక్రిని ఇరికిస్తుంది. మాట జారావుగా అని కేశవ అంటాడు.
ఆదిలక్ష్మీలా గుర్తుపెట్టుకుంటా
నా కోసం వదినను ఎందుకు అన్నావని చక్రిపైకి రివర్స్ అవుతాడు కన్నా. మీరిద్దరు కలిసిపోయారా. ఇప్పటిదాకా నేను ఫీల్ అయింది వేస్టా అని చక్రి అంటాడు. మీ సంగతి తర్వాత చెబుతాను. ఆదిలక్ష్మీలా గుర్తుపెట్టుకుంటాను. మా సీనియర్ తను. అన్ని గుర్తుపెట్టుకుంటుందని మహా అంటుంది. ఆపండి. టాపిక్ డైవర్ట్ చేయకండి. మనమంతా ఒకే కుటుంబం అన్నావుగా. మరి నాకోసం ఎవరు రాలేదేంటీ అని కన్నా అడుగుతాడు.
ఎందుకు రాలేదు. నువ్వు ఎవరినైతే అన్నావో ఆ నాన్న నీ వెనుక సైకిల్ తీసుకుని వచ్చాడని మహా అంటుంది. కావాలంటే అటు చూడు ఇప్పుడే ఇంటికి వస్తున్నాడని నారాయణను చూపిస్తుంది మహా. నువ్వు ఎక్కడ కూర్చున్నావో నాకు కాల్ చేసి చెబితేనే నేను నమ్మకంగా ఉన్నా అంటుంది మహా. నీకు ఆయన దేవుడు కావచ్చు. నాకు మాత్రం రాక్షసుడే అని కన్నా లోపలికి వెళ్తాడు.
వాన్ని నిదానంగా కూల్ చేస్తానని మహా అంటుంది. ఇంతలో బీడీ తాగుతూ పొలమారి దగ్గుతాడు నారాయణ. దాంతో కేశవ నీళ్లు ఇస్తాడు. నీళ్లు తాగి ఏంట్రా హాఫు కొత్తగా అని వెళ్లిపోతాడు నారాయణ. మరోవైపు చక్రికి తనపై వచ్చిన కోపం గురించి పెద్దితో మాట్లాడుతుంది మహా. అది కన్నాపై ప్రేమ అని నాకంటే బాగా మా తండ్రిని అర్థం చేసుకున్నావని పెద్ది అంటాడు.
మీరు ఆడుకోడానికే పుట్టానని
సుపుత్ర అంటే చాలు పసివాడు అయిపోతాడు. తల్లిగా ఆయన్ను మందలించడమంటే నాకు ఎంతో ఇష్టమని మహాలక్ష్మి అంటుంది. అది చూడటం నాకిష్టమని మాధవ అంటాడు. ఇంతలో చక్రి వస్తాడు. మాధవను వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాడు. నోరు జారానంటూ మహాకు చక్రి సారీ చెబుతాడు. మహా పట్టించుకోదు. ఏం చెప్పిన రివర్స్ అవుతుంది.
అర్థమైంది. నేను మీరు ఆడుకోడానికే పుట్టానని చక్రి అలిగి వెళ్తాడు. ఇంతలో మాధవ వస్తాడు. చక్రి కూడా కన్నాలాగే, ఇద్దరు పసివాళ్లే అని మహా అంటుంది. కానీ, నారాయణ మీద కన్నాకు కోపం ఎంతకాలం ఉంటుంది. అదిపోయేలా చేయాలని మహా అంటుంది. నేను మాట్లాడి చూస్తానని మాధవ అంటాడు. మరుసటి రోజు ఉదయం కన్నాకు తల దువ్వుతాడు చక్రి.
చక్రి అన్నమాటలకు సీరియస్ అవుతుంది మహా. మీరు వెయ్యి మాటలన్నా మేము పట్టించుకోం. అదే మేము రెండు మాటలంటే 20 ఏళ్లు కూడా మర్చిపోరని చక్రి అంటాడు. 20 ఏళ్ల తర్వాత నేను ఇక్కడ ఎందుకుంటాను. అమెరికాలో ఉంటానని మహా అంటుంది. మీకు వీసా దొరకకుండా ఉండుగాక అని చక్రి శపిస్తాడు. మీరంటే అయిపోతుందా. స్వామిజీనా అని మహా కోప్పడుతుంది.
కన్నాను కాపాడిన నారాయణ
అవును చక్రానంద స్వామి అని చక్రి అంటాడు. ఇంతలో కేశవ వచ్చి కన్నాకు డ్రెస్ తెస్తే తనకోసం అనుకుని, తన ఫిట్నెస్ గురించి మాట్లాడుతాడు చక్రి. వీడు ఇప్పటికి 20 సార్లు జిమ్ ఫీ కట్టి వెళ్లలేదని కేశవ అంటాడు. ఈ షర్ట్ కన్నాకు అని చెప్పి కాలేజ్‌కి వెళ్లేవాళ్లు బాగా వేసుకోవాలని కేశవ అంటాడు. షాప్ ఓపెనింగ్ గురించి మాట్లాడుకుంటారు.
వచ్చే గురువారం ఏకాదశి మంచిరోజని పెద్ది అంటే.. ఈలోపు ఓనర్ డాక్యుమెంట్స్ ఇస్తాడని కేశవ అంటాడు. అదే రోజు పూజ పెట్టుకుందామని మహా అంటుంది. కన్నా షర్ట్ తీసి బాగుందని దిష్టి పెడుతాడు చక్రి. మీ చూపు పడితే జీవితాలే తగలబడిపోతాయని మహా అంటుంది. ఇంతలో పెద్దికి మనీషా కాల్ చేస్తుంది. అది బన్సీ అని చెప్పి మాధవ కాల్ మాట్లాడతాడు.
కానీ, మనీషా అని అందరికి తెలుసు. మాధవ బన్సీ అని మాట్లాడిన ప్రతిసారి బిస్కెట్ అంటూ ఆటపట్టిస్తారు ఇంట్లోవాళ్లు. మనీషా తనను బయటకు తీసుకెళ్లమని అడుగుతుంది. అది విన్న అన్నదమ్ములు ఏడిపిస్తారు. దాంతో కాల్ కట్ చేసిన పెద్ది వాళ్లను కొట్టేందుకు కర్ర పట్టుకుంటాడు. కన్నాను కొడతాడు మాధవ. కన్నా పడిపోతుంటే నారాయణ పట్టుకుని కాపాడుతాడు.
మీ వదినకు పొగరు కదరా
ఛీ అనుకుంటూ కన్నా వెళ్లిపోతాడు. తర్వాత కన్నాను డ్రాప్ చేసి మీ వదినకు బాగా పొగరుగా. అసలు నీ మీద ప్రేమ ఉందా. అలాంటివాళ్లను ఇంట్లో ఉంచుకోకూడదని మహా అంటుంది. వదినా నువ్వు చేసింది తప్పుగా ఫీల్ అవ్వట్లేదు. నాకు కోపం మీరు తాగుబోతును గొప్పగా చూసినందుకు అని కన్నా అంటాడు. సుపుత్రుడు నువ్వు అనుకుంటున్నట్లు చెడ్డవాడు కాదురా అని మహా అంటుంది.
తను తండ్రి అనుకోడానికి కంపరంగా ఉంది. మా పెద్దమ్మను చంపినవాన్ని పట్టుకుని మంచివాడు పుణ్యాత్ముడు అంటున్నారా అని మహానే నిలదీస్తాడు కన్నా. మహా ఎంత చెప్పిన కన్నా వినడు. తర్వాత చక్రిని అర్జంట్‌గా రావాలని, లేదంటే మీ జీవితానికే ప్రమాదమే అని మహాలక్ష్మి అంటుంది. చక్రి కలిస్తే తన మనసులోని మాట చెప్పడానికి అని మహా అంటుంది. దాంతో చక్రి సిగ్గుపడిపోతాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


