Podarillu October 26 Episode: పొదరిల్లు- మాధవకూ తెలిసిన కన్నా పుట్టుక నిజం- కేశవ బైక్ వేలంపాట- కన్నా చెంప పగలగొట్టిన మహా

Podarillu Serial October 26th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 26వ ఎపిసోడ్‌‌లో నారాయణ మహాలక్ష్మి మాట్లాడుకుంది మాధవ వింటాడు. దాంతో కన్నా పుట్టుక నిజం మాధవకు కూడా తెలుస్తుంది. ఇంటికెళ్లిన తర్వాత చక్రి ఆరాలు తీస్తే మాధవ పొంతనలేని సమాధానం చెబుతాడు. కేశవ బైక్‌కు శైలు వేలం పాట వేస్తుంది.

Published on: Oct 26, 2026, 08:42:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కన్నా పుట్టుక గురించి నారాయణ అసలు నిజం చెప్పడంతో మహాలక్ష్మి కన్నీళ్లుపెట్టుకుంటుంది. నారాయణను దేవుడిలా కొలుస్తుంది. చేతులు పట్టుకుని దేవుడిలా పూజిస్తుంది. అమ్మా నన్ను అంటున్నావ్. నీ పెళ్లి పెళ్లి కాదే అన్న నువ్వు నా పిల్లలను అన్నీ అనుకుని ఇక్కడే ఉంటున్నావుగా అని నారాయణ అంటాడు.

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 26 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 26 ఎపిసోడ్

మౌనమే సమాధానం

ఈ నారాయణ కూడా నీకు మనిషిలా ఎలా కనిపిస్తున్నాడు. మనిషి మనిషికే సాయం కదా అని నారాయణ అంటాడు. అయ్యో నాతో మీకు పోలికా. నేను మనిషిలా రియాక్ట్ అవుతాను, కోప్పడతాను. కానీ మీరు ఇవన్నీ ఎప్పుడు జయించేశారు. కన్నా ఎంత అన్నా మౌనమే సమాధానం. వాడు నిన్నే వెళ్లిపోమన్నా చిరునవ్వే సమాధానం. ఇలా మహా రుషులే ఉంటారు అని మహా అంటుంది.

మీ ఇంట్లో ఉండాలంటే భయపడ్డాను. మీకు ఆ గుడిలో దేవుడికి తేడా లేదు. పాపాలు, కర్మలకు అతీతంగా కనిపిస్తున్నారు. మీ మంచితనం ముందు నేనెంత సుపుత్ర. లవ్ యూ మై సన్ అని మహా అంటుంది. నాకు న్యాయం అనిపించింది చేశాను అంతే అని నారాయణ అంటాడు. గుడిలో ఇక్కడే కాసేపు ఉంటానని మహా అనడంతో సరేనని. ఈ నిజం కొడుకులకు చెప్పొద్దని చెప్పి వెళ్లిపోతాడు నారాయణ.

మహా వెనక్కి తిరిగేసరికి మాధవ ఉంటాడు. మహా షాక్ అవుతుంది. మహాలక్ష్మికి చేతులతో దండం పెడతాడు పెద్ది. అంతా విన్నారా అని మహా అంటే.. అవును అని పెద్ది చెబుతాడు. కన్నా పుట్టుక నిజం మాధవకు కూడా తెలుస్తుంది. ఏదో పెద్ద విషయమే అని వచ్చాను. కానీ, ఇది అస్సలు ఊహించలేదని మాధవ అంటాడు. గుడిలో ఇద్దరు కూర్చుంటారు.

నిజం తెలియకుంటే బాగుండేది

మీ కన్నా మీ సొంత తమ్ముడు కాదని ముందే తెలుసా అని మహా అడిగితే.. తెలియదు. నాకు ఈ నిజం తెలియకుంటే ఎంత బాగుండేది. చక్రి, కేశవ ఎంతో కన్నా కూడా అంతే. అందరికంటే ఎక్కువగా కన్నాపైనే ప్రేమ చూపించాను. వాడు నా రక్తం కాదని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాను. వాడు తల్లికోసం ఏడుస్తుంటే గుండెల్లో పెట్టుకున్నాను. తల్లిని మరిపించాను. ఇద్దరిది ఒక్క రక్తం కాదు అంతేగా. ఈ చేతులతో పెంచానుగా అని మాధవ ఎమోషనల్ అవుతాడు.

ఎవరు మీవాళ్లు కాదు అనుకునే అనే భావన మీ రక్తంలోనే లేదు. పాఠశాల తెరిస్తే మీ కుటుంబమే పాఠాలు చెప్పాలి. శిథిలావాస్థలో ఉన్న ఆ బృందావనంలో ఎంత గొప్ప నిధి దాగుందో ఇవాళే తెలిసిందని మహాలక్ష్మి అంటుంది. కన్నా ఎన్ని అన్నా మా నాన్న వాడి జన్మరహస్యం బయటపెట్టలేదు. అంత గొప్ప మనిషి మా నాన్నను చంపాడంటే ఎలా నమ్ముతాను అని మాధవ అంటాడు.

చిన్నప్పటి నుంచి తమ్ముళ్లకోసం పేపర్స్, పాలు వేయడం, మేస్త్రీగా చేయడం కష్టపడటం గురించి మాధవ చెబుతాడు. ఇక మీరు కన్నాను వేరుగా అనుకోరని మహా అంటుంది. ఈ నిజం నాకు తెలిసింది చాలు. చక్రి, కేశవ, కన్నాకు చెప్పను నువ్వు.. అని మాధవ అంటే.. మీ ఇంట్లో తింటున్నాను. ఎవరికి చెప్పను. మీ నాన్ననే తల్లిగా చూస్తున్నాను. నేనెలా చెబుతాను. మీరంతా బతుక్కి కొత్త భాష చెప్పారు అని మహా అంటుంది.

చెప్పులో రాయిలా చూస్తుంది

నువ్వు కన్నా తల్లిని తీసుకొచ్చింది మా ఇంటి మీద పడిన మచ్చ పోయేందుకే. మేమంతా నీకే రుణపడి ఉన్నామని మాధవ అంటాడు. మరోవైపు వదిన ఇలా మారిపోతుందనుకోలేదు అన్నయ్య. నారాయణను బండిమీద తీసుకెళ్లిందని చక్రితో అంటాడు కన్నా. రాను రాను వదిన మారిపోతుంది. అలాంటి మనిషి ఎవరికైనా నచ్చుతాడా. తన తండ్రి కంటే ఎక్కువగా చూస్తుందని కన్నా అంటాడు.

నిన్నైనా మనిషిలా చూస్తుంది. నన్ను అయితే చెప్పులో రాయిలా చూస్తుందని చక్రి అంటాడు. ఇంతలో మాధవతో మహాలక్ష్మి వస్తుంది. కన్నాతో ఏంట్రా అలా చూస్తున్నావ్. గుడికి వెళ్లాలని చెప్పి ఇస్తుంది మహాలక్ష్మి. నీ కోపం పోయిందని కన్నా అంటే.. నీ మీద ఎప్పుడు కోపం రాదని మహా అంటుంది. దాంతో కన్నా ఎమోషనల్ అవుతాడు.

నారాయణతో వెళ్లి అన్నయ్యతో వచ్చారేంటని చక్రి అంటే.. నారాయణను వైన్ షాప్ దాకా లిఫ్ట్ ఇచ్చి దారిలో నేను వస్తుంటే పెద్ది కనిపించారు. పెద్దిని ఎక్కించుకుని వచ్చానని మహా చెబుతుంది. నేను నమ్మను అని మాధవను అడిగితే.. మాధవ పొంతన లేని సమాధానం చెబుతాడు. పోలీస్‌లాగా క్వశ్చన్స్ ఏంటీ. నేను ఎవరినైనా తీసుకెళ్తానని, నువ్వెవరు అని కన్నాను తీసుకెళ్లిపోతుంది మహా.

కేశవ బైక్ వేలం

మరోవైపు కేశవ టైమ్ 5 అవుతుందని కంగారుపడతాడు. టైమ్ అవుతుందని, శైలును తీసుకురావాలని అసిస్టెంట్‌తో కేశవ అంటాడు. బైక్ కోసం చూస్తే అది ఉండదు. ముందుకు చూస్తే కేశవ బండిని శైలు వేలం వేస్తుంది. వెయ్యి రూపాయలతో మొదలుపెడుతుంది శైలు. ఇది నా బండే అని కేశవ అంటే.. నేను అమ్మేస్తున్నాను అని శైలు అంటుంది.

తర్వాత తల్లి జమునకు ఇచ్చిన గిఫ్టును అతికించి మళ్లీ టేబుల్‌పై పెడతాడు కన్నా. నారాయణ షర్ట్ తీసుకుని దులపడంతో తగిలి ఆ బొమ్మ కిందపడి మళ్లీ పగిలి ముక్కలవుతుంది. దాంతో నారాయణపై గొడవకు దిగుతాడు కన్నా. ఈ నారాయణ తాగి తాగి చచ్చిపోయినా బాగుండు అని కన్నా అంటాడు. దాంతో ఏం వాగావురా కన్నా చెంప పగలకొడుతుంది మహా. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More