Podarillu October 12 Episode: పొదరిల్లు- మహా కాళ్లు పట్టుకున్న నారాయణ- మహాకు చక్రి హగ్- బయటపడిన కన్నా తల్లి దొంగతనం

Podarillu Serial October 12th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 12వ ఎపిసోడ్‌‌లో తనపై కోప్పడినందుకు క్షమించమని మహాలక్షి కాళ్లు పట్టుకుని, చెంపలు వాయించుకుంటాడు నారాయణ. తను ఇంటికి వచ్చి నలుగురు కొడుకులకు తల్లినయ్యానని జమున అంటుంది. నలుగురు సంపాదించిన డబ్బు దొంగతనం చేస్తుంది కన్నా తల్లి జమున.

Published on: Oct 12, 2026, 08:20:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో మహాలక్ష్మికి తన ఇంటి గురించి సంబంధం లేదని అన్నందుకు క్షమించమని బతిమిలాడుకుంటాడు నారాయణ. రేపు మా ఇంట్లో ఉండటానికి నువ్వెరు అంటావని మహా అంటుంది. నువ్వు ఉంటేనే ఇది వైకుంఠం లేకుంటే స్మశానమే తల్లి. అంత మాట అనకమ్మా కావాలంటే కాళ్లు పట్టుకుంటాను కాళ్లపై దండం పెడతాడు నారాయణ.

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 12 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 12 ఎపిసోడ్

వాడి మనసు ముక్కలు చేస్తుంది

మహాలక్ష్మి ఆపుతుంది. మంచం వేసి కూర్చోబెడుతుంది. నారాయణ తన చెంపలపై తానే కొట్టుకుంటాడు. మహా ఆపి పర్వాలేది వదిలేయండని అంటుంది. నువ్వు వచ్చావ్. నువ్వు అమ్మవి. కానీ, నువ్వు తెచ్చావ్ చూడు అది అమ్మ కాదు బొమ్మ. అసలు అది మనిషే కాదు. తల్లిని అనిపించుకునే అర్హత దానికిలేదు. కన్నాగాడు ఏదో మురిసిపోతున్నాడు కానీ ఈసారి వాడి మనసు ముక్కలు చేసి పోతే వాడు తట్టుకోలగడా అని నారాయణ బాధతో అంటాడు.

ఇప్పుడు సంతోషంగానే ఉంటారు. తర్వాత దాన్ని తీసుకొచ్చినందుకు బాధపడతారు. ఇది కచ్చితంగా జరుగుతుంది. నీపై కోప్పడినందుకు క్షమించమన్నా కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావ్. ఆ విషయం నీకు తొందర్లేనే అర్థమవుతుంది అని నారాయణ లోపలికి వెళ్తాడు. జమున కనిపిస్తే ఇంకోసారి కనిపిస్తే కాల్చి బూడిద చేస్తానని తిడతాడు.

తల్లి జమున ఒడిలో పడుకుని కన్నా కాలేజ్ ముచ్చట్లు చెబుతాడు. అది మిగతా అన్నదమ్ములు చూసి మురిసిపోతారు. మాధవ ఒకింత నొచ్చుకుంటాడు. వెళ్లి పడుకుంటాడు. మాధవ బాధను చక్రి, కేశవ, మహా అర్థం చేసుకుంటారు. ఈసారి అన్నదమ్ముల మధ్య కన్నా పడుకోలేదని అనుకుంటుంది. రాత్రి లేచి చూస్తాడు మాధవ.

నలుగురు కొడుకుల తల్లిని అయ్యాను

అప్పటికి కూడా కన్నా రాడు. తల్లితోనే ఉంటాడు. ఇంతకుముందు కన్నా భయపడినప్పుడు మాధవ చూసుకుంది గుర్తు చేసుకుంటాడు. ఇంతలో మాధవ భుజంపై చేయి పడుతుంది. మాధవ లేచి చూస్తే కన్నా ఉంటాడు. ఏంట్రా కన్నా ఇక్కడున్నావని అడుగుతాడు మాధవ. అమ్మ దగ్గర పడుకుందామనుకున్నా. కానీ నిద్ర రాలేదు. చిన్నప్పటి నుంచి ఇక్కడే అలవాటు అయిందని కన్నా అంటాడు.

మాధవ పడుకోబెట్టుకుంటాడు. మరుసటి రోజు ఉదయం జమున టీ పెడుతుంది. అయ్యో మీరు ఇంటి మనిషి అయ్యారు. టీ ఎందుకు పెడుతున్నారని మాధవ అడిగితే.. నలుగురు కొడుకులకు తల్లిని కూడా అయ్యాను అని జమున అంటుంది. అది అంతా విని మురిసిపోతారు. ఇన్నేళ్లు నువ్వే చూసుకున్నావ్. ఏడాదిన్నర పిల్లోడు.. ఇప్పుడు 20 ఏళ్లు అయ్యాయి. ఎలా చూసుకున్నావో తెలుసు. మీకు తల్లి వచ్చింది. అది గమనించండి. నువ్వు కూర్చో పెద్దబాబు అని పంపిస్తుంది జమున.

అన్నయ్యకు రెస్ట్ దొరికిందని కేశవ అంటాడు. కన్నాను పాలు తాగుతావా అని జమున అడుగుతుంది. తాగనని కన్నా చెబుతాడు. పాలు తాగే వయుసులో పోయి బీరు తాగే వయసులో వచ్చి పాలు తాగుతావా అని అడుగుతుంది ఛీ. ఇది ఒక తల్లి అని నారాయణ చీదరించుకుంటాడు నారాయణ. అందరికి టీ ఇస్తుంది జమున. నారాయణకు టీ ఇస్తానని వెళ్తుంది.

తొందర్లోనే నీ అసలు రూపం తెలుస్తుంది

ఆ టీ గ్లాస్‌ను కింద విసిరేస్తాడు నారాయణ. కొట్టేందుకు మంచెం ఎత్తుతాడు. కొడుకులు ఆపుతారు. నీ గురించి తెలియక ఇంట్లోకి తీసుకొచ్చి నిన్ను తెచ్చి పెట్టారే. నాకు సేవలు చేసినంత మాత్రాన ఇంటి ఇల్లాలు అయిపోతావా. తొందర్లోనే నీ అసలు రూపం తెలుసుకుని అంతా కలిసి నిన్ను గెంటేయకపోతే నేను బృందావనంలో పుట్టిన ఆది నారాయణనే కాదే అని నారాయణ ఛాలెంజ్ చేస్తాడు.

ఆనాడు నేను గడప దాటింది నా ప్రాణాలు కాపాడుకోడానికి అయితే ఈనాడు కాలు పెట్టింది నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డకోసం. తల్లిని కొడుకును వేరు చేయగలరా అని జమున అంటుంది. ఏనాడైనా వాడికి పాలుపట్టావా. వాడికి అన్ననైనా తల్లి అయిన ఈ మాధవ గాడే అని నారాయణ కోపంగా అంటాడు. కన్నాగాడు తల్లి రాగానే మీ ప్రేమను గాలికి వదిలేశాడు. మీ ప్రేమ అంత మర్చిపోయాడు అని నారాయణ అంటాడు.

ఏయ్ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మా అమ్మను తిడుతూనే ఉన్నావ్. నీలాంటి వాడికి భార్యగా ఉండటం కంటే పని మనిషిగా ఉండేందుకే వెళ్లిందని కన్నా అంటాడు. మరి నిన్ను ఎందుకు వదిలేసి వెళ్లిపోయిందో అడుగురా. కడుపు తీపి చచ్చిపోయిందా అని నారాయణ అంటాడు. దాంతో అంతా జమునవైపు చూస్తారు. కవర్ చేసుకునేందుకు కన్నీళ్లు పెట్టుకుని లోపలికి వెళ్లిపోతుంది జమున.

తండ్రిపై కన్నా రివర్స్

అది చూసి కరిగిపోయిన కన్నా తండ్రి నారాయణపై రివర్స్ అవుతాడు. అప్పుడెందుకు వెళ్లిన ఇప్పుడు నాకోసం తిరిగి వచ్చింది. ఇంకోసారి వెళ్లిపోమ్మంటే నేను నిన్ను వెళ్లగొడతాను అని కన్నా అంటాడు. దానికి అంతా షాక్ అవుతారు. నారాయణ వెళ్లిపోతాడు. కన్నాను వారిస్తుంది మహా. ఆయన అంతగా ద్వేషించేంతగా మీరేం చేశారు. ఆయన వెళ్లగొడితే ఇంత కోపం ఎందుకు తెచ్చుకుంటారు అని మహా అడుగుతుంది.

ఈ కోపానికి భయపడే వెళ్లిపోయాను. ఆవిడ (మొదటి భార్య)ను చంపినట్లే నన్ను కూడా చంపుతాడని వీధిలో వాళ్లంతా భయపెట్టారు. తాగొస్తే తను మనిషే కాదు. నిజంగానే చంపేస్తాడనుకున్నా. కన్నకొడుకును వదిలేసి వెళ్లిపోయేంత దుర్మార్గురాలిని కాదు అని ఏడుస్తూ కిచెన్‌లోకి వెళ్లిపోతుంది జమున. ఈ పూటకు నేను వంట చేస్తానని మాధవ అంటే.. పర్వాలేదంటుంది జమున.

మహాలక్షి కూడా ఈ ఇంటి ఇల్లాలుగా అన్ని పనులు చేస్తే ఎంత బాగుంటుంది అని చక్రి ఊహించుకుంటాడు. చక్రికి రొమాంటిక్‌గా ముగ్గు పూసి లోపలికి వెళ్తుంది మహా. వంట గదిలో దోశలు వేస్తుంది మహా. మహాను వెనుకనుంచి గట్టిగా హగ్ చేసుకుంటాడు చక్రి. అదంతా ఊహించుకుని సంతోషిస్తాడు.

బయటపడిన జమున దొంగబుద్ధి

తర్వాత జమునకు రెండో భర్త ముఖేష్ ఫోన్ చేస్తాడు. ఏమైనా గిట్టిబాటు అయ్యేలా ఉందా అని అడుగుతాడు. ముగ్గురు నలుగురు సంపాదిస్తున్నారు. ఎక్కడెక్కడ దాచారో తెలియాలి. ఇంట్లో అందిని కాడికి లేపేస్తాను అని జమున అంటుంది. ఇల్లంతా డబ్బు దొంగతనం చేయడానికి వెతుకుతుంది జమున. డబ్బు దొరుకుతుంది.

నారాయణ వస్తాడు. ఏ బయటకు రావే అని నారాయణ అంటాడు. మహా చక్రి కన్నా అంతా ఉంటారు. దొంగతనం చేసి జమున దొరికిపోయినట్లుగా చూపిస్తారు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More