Bigg Boss 10: ఈసారి నో ఎలిమినేషన్- ఆ ఇద్దరిని కాపాడిన ముఖేష్- కెప్టెన్సీ అవుట్, డైరెక్ట్ నామినేషన్- ఆమెకు జాక్‌పాట్-ఎలా?
Bigg Boss Telugu 10 September 27 Episode: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ సరికొత్తగా సాగుతోంది. అయితే, ఎప్పుడు సండే రోజున ఎలిమినేషన్ ఉంటుంది. కానీ, ఈసారి ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. ఎలిమినేషన్‌కు దగ్గరిగా ఉన్న ఇద్దరిని గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ కాపాడాడు. దీంతో ఆమెకు మాత్రం జాక్‌పాట్ తగిలింది.
Bigg Boss Telugu 10 September 27 Episode: తెలుగు బుల్లితెర రియాలిటీ షో రోజుకోపుంతలు తొక్కుతోంది. ఊహించని వ్యూహాలతో అటు ఆడియెన్స్‌కు ఇటు కంటెస్టెంట్స్‌కు ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోంది బిగ్ బాస్ తెలుగు 10 సీజన్.

కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం
బిగ్ బాస్ 10 తెలుగులోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా వచ్చిన మిథిలేష్ రెడ్డి రూ. 15 లక్షలు తీసుకుని హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇదంతా శనివారం (సెప్టెంబర్ 26) నాటి ఎపిసోడ్‌లో జరిగింది. మిథిలేష్ వెళ్లగానే హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇక ఆదివారం నాటి బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 27 ఎపిసోడ్‌లో ఎప్పుడు నిర్వహించే ఎలిమినేషన్ విధానాన్ని అమలుపరిచాడు హోస్ట్ నాగార్జున. ఒక్కొక్కరుగా సేవ్ అవుతూ ఎలిమినేషన్ గండం నుంచి తప్పించుకున్నారు. చివరికి ఇద్దరు మిగిలి ఆ తర్వాత ఒక్కరు ఎలిమినేట్ కావాలి. కానీ, ఈసారి ఒక చిన్న మెలికతో నాగార్జున ద్వారా ట్విస్ట్ ఇప్పించాడు బిగ్ బాస్.
ఎలిమినేషన్‌లో ఇద్దరు
బిగ్ బాస్ 10 తెలుగు మూడో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో చివరిగా యాంకర్ వర్షిణి సౌందరరాజన్, టాలీవుడ్ విలన్ టెంపర్ వంశీ ఇద్దరు మిగిలారు. వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారని యాక్టివేట్ రూమ్‌కి పంపించాడు నాగార్జున. ఇక్కడ హాల్‌లో కొత్త కెప్టెన్ అయిన గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడతో నాగార్జున ఓ డీల్ మాట్లాడాడు.
"వర్షిణి, వంశీలో ఎవరైనా ఒక్కరు కచ్చితంగా ఎలిమినేట్ అవుతారు. వారిద్దరు అలా ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే నువ్వో పని చేయాలి" అని నాగార్జున చెప్పాడు. దానికి ఏంటని ముఖేష్ అడిగాడు. "నీ కెప్టెన్సిషిప్‌ను కోల్పోవాలి. అలా చేస్తే నీ కెప్టెన్సీ పోతుంది. అలాగే, నీకు వచ్చిన ఇమ్యూనిటీ పోతుంది. దాంతోపాటు నెక్ట్స్ నామినేషన్స్‌కి డైరెక్ట్ నామినేట్ అవుతావ్" అని హోస్ట్ నాగార్జున వివరించాడు.
నాకు కెప్టెన్సీ వద్దు సార్
"వర్షిణి, వంశీ ఇద్దరు పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్సే. ఇద్దరు ఎలిమినేట్ అవడం నాకు ఇష్టం లేదు సర్. నేను నా కెప్టెన్సీని వదులుకుంటాను. నామినేషన్స్‌లో ఉండటానికి కూడా నాకు ఎలాంటి ఇబ్బందేం లేదు" అని ముఖేష్ గౌడ చెప్పాడు. "నాకు అలా వద్దు సర్. ఆడియెన్స్ ఎలాంటి తీర్పు ఇచ్చారో అదే ఫాలో అవుతా" అని వర్షిణి అంది.
"నువ్వు ఓకే.. కానీ వంశీ కూడా ఉన్నాడుగా. అయినా ఇది మీకు సంబంధం లేదు. ఇది ముఖేష్‌కు ఇచ్చే టెంప్టేషన్ అండ్ టెన్షన్. మీకు టెంప్టేషన్ ముఖేష్‌కి మాత్రమే టెన్షన్" అని నాగార్జున అన్నాడు. మరోసారి బాగా ఆలోచించుకుని చెప్పమని నాగార్జున అడగ్గా.. ముఖేష్ కెప్టెన్సీ వద్దని చెప్పాడు.
అపూర్వకు కెప్టెన్సీ బాధ్యతలు
దాంతో ఈసారి ఎలిమినేషన్ లేదు అని నాగార్జున ప్రకటించాడు. అలా తన కెప్టెన్సీషిప్‌ను త్యాగం చేసి వర్షిణి, వంశీని ఎలిమినేషన్ నుంచి కాపాడాడు సీరియల్ హీరో ముఖేష్ గౌడ. ఆ తర్వాత ముఖేష్‌కు ఉన్న కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను తీయమని అపూర్వను ఆదేశించాడు నాగార్జున. ఆ బ్యాడ్జ్‌ని అపూర్వకు కట్టమని అమన్‌కి చెప్పాడు నాగార్జున.
అంటే, నెక్ట్స్ వీక్ కెప్టెన్‌గా ముఖేష్ స్థానంలోకి అపూర్వ తుంగతుర్తి వచ్చింది. కెప్టెన్సీ కోసం పోటీ పడిన టాస్క్‌లో ముఖేష్, అపూర్వ ఇద్దరు జంటగా ఆడారు. అంటే, ఇద్దరు గెలిచినట్లు. ఇక ముఖేష్ త్యాగం చేయడంతో అపూర్వకు కెప్టెన్ పదవి అనే జాక్‌పాట్ తగిలింది.
వెనువెంటనే జాక్‌పాట్
బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన రోజే కెప్టెన్సీ కంటెండర్‌గా మారడం, అందులో గెలిచి ఇమ్యూనిటీ పొందడమే కాకుండా ఇప్పుడు కెప్టెన్‌గా కూడా అయింది అపూర్వ. ఇలా వెనువెంటనే జాక్‌పాట్ కొట్టింది లేడి కామనర్ కంటెస్టెంట్ అపూర్వ తుంగతుర్తి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


