బిగ్ బాస్‌లోకి 2 వైల్డ్ కార్డ్స్- రాగానే కోడిగుడ్ల గొడవ- కొత్త కెప్టెన్‌గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో- ఆమెకు ఇమ్యూనిటీ!
Bigg Boss Telugu 10 New Captain Mukesh Gowda This Week: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ జోరగా సాగుతోంది. ఇప్పటికే హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. మరో ఇద్దరిని వైల్డ్ కార్డ్ ద్వారా మిథిలేష్ రెడ్డి, అపూర్వ తుంగతుర్తిని పంపించారు. బిగ్ బాస్ కొత్త కెప్టెన్‌గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ అయ్యాడు.
Bigg Boss 10 Telugu 2 Wild Card Entry And Mukesh Captain: తెలుగు ఓటీటీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 సరికొత్త వ్యూహాలతో సాగిపోతుంది. ప్రారంభమైన మొదటి రోజు నుంచే గొడవలు, గ్రూపులతో తెగ వినోదం పంచిన బిగ్ బాస్ తెలుగు 10లోకి మరో ఇద్దరు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు.

హౌజ్‌మేట్స్‌కు టెన్షన్ ఇచ్చేందుకు
ఇప్పటికే బిగ్ బాస్ 10 తెలుగు హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. తాజాగా ఇద్దరిని వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపారు. బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 25 ఎపిసోడ్‌లో కామనర్ అపూర్వ తుంగతుర్తి ఎంట్రీ ఇచ్చింది. ఇదివరకు హౌజ్ కంటెస్టెంట్స్‌తో పెట్టిన ఓటింగ్‌లో అపూర్వకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి.
కాబట్టి, హౌజ్‌మేట్స్‌కు ఏమాత్రం నచ్చని కంటెస్టెంట్‌ను తీసుకొచ్చి 15 మందికి టెన్షన్ ఇస్తున్నట్లుగా బిగ్ బాస్ చెప్పాడు. అపూర్వకు అందరూ స్వాగతం పలికారు. అంతేకాకుండా అగ్నిపరీక్ష 2లో చేసినట్లుగా రోహిత్, అపూర్వతో డ్యాన్స్ చేయించారు ముఖేష్ గౌడ, వర్షిణి.
రామకృష్ణ అవుట్
అనంతరం బిగ్ బాస్ హౌజ్ మేట్ అయ్యేందుకు మరో ఇద్దరు కామనర్స్ అయిన మిథిలేష్ రెడ్డి, రామకృష్ణకు పోటీ పెట్టారు. మొదట ఒక కాకి, నక్క, కుండనీళ్లు కథ చెప్పిన బిగ్ బాస్ ఆ సీక్వెన్స్ ప్రకారం బోర్డ్‌పై ఫొటోలు పెట్టమన్నాడు. కానీ, ఇద్దరు సరిగా పెట్టకుండా బెల్ కొట్టడం, బెల్ లాక్కుని వాదులాడుకోవడంతో ఆ టాస్క్‌ను క్యాన్సిల్ చేశాడు బిగ్ బాస్.
ఆ తర్వాత ఇద్దరికి చెరో సైడ్ లైన్ ఉంచి ఆ లైన్ లోపల ఎవరికి ఎక్కువ టైర్స్ ఉంటే వారు విన్ అయినట్లు అని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. మిథిలేష్, రామకృష్ణ గట్టిగా తలపడ్డారు. కానీ, చివరికి మూడు టైర్లలో రెండు మిథిలేష్ సైడ్ ఉండటంతో అతను బిగ్ బాస్ హౌజ్ కంటెస్టెంట్‌గా గెలిచాడు. బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టాడు.
వైల్డ్ కార్డ్స్‌గా అపూర్వ, మిథిలేష్
అలా బిగ్ బాస్ 10 తెలుగులోకి ఇద్దరు కామనర్స్ అపూర్వ, మిథిలేష్ వైల్డ్ కార్డ్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అపూర్వ ఎగ్స్ తినదని, వాటిని మిథిలేష్, తనకు ఇవ్వమని రోహిత్ అడగడం స్టార్ట్ చేశాడు. ఇచ్చినదానికి తనకేంటీ లాభం అని అపూర్వ క్వశ్చన్ చేసింది. ఏవైనా ఫ్రూట్స్, స్వీట్స్ ఇంకేమైనా అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఇలాగే కాసేపు కన్వర్జేషన్ జరిగింది. ఈ క్రమంలోనే నామినేషన్స్ వేయకుంటే ఎగ్స్ ఇస్తానువంటివి మాత్రం పెట్టుకోకు. అది డెడ్ లైన్ అని రోహిత్ అన్నాడు. దాంతో అపూర్వ సీరియస్ అయింది. నేను మరి అంత డంబ్‌లా కనిపిస్తున్నానా అంటూ రెచ్చిపోయింది. ఆ వివాదం గట్టిగానే రాజుకుంది. రోహిత్, అపూర్వ ఇద్దరికిద్దరు డిఫెండ్ చేసుకున్నారు, వాదించుకున్నారు.
కోడిగుడ్ల పంచాయతీ
ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తనకు మాత్రమే తెలుస్తుంది. కానీ, నామినేషన్స్ గురించి అనడం కరెక్ట్ కాదని మిథిలేష్ అన్నాడు. ఊరికే అలా మాటలు జారతావ్ అని రోహిత్‌పై ఫైర్ అయింది అపూర్వ. తర్వాత కెప్టెన్ ఝాన్సీతో "ఆ ఎగ్స్ ఎవరైనా తీసుకుంటే నేను చేసే వర్క్ వాళ్లతో చేయించొచ్చు కదా. అసలే నాకు ప్రొటీన్ ఉండదు. వర్క్ చేయలేకపోవచ్చు. ఇలాంటివి నేను ఆలోచించుకుంటానుగా" అని తన వెర్షన్ చెప్పుకొచ్చింది అపూర్వ.
అలా వైల్డ్ కార్డ్స్ రాగానే కోడిగుడ్ల కోసం గొడవ జరిగింది. అనంతరం కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెండర్స్‌గా ఉన్న ముఖేష్, ఝాన్సీ, అమన్, సృష్టి నలుగురిలో ఇద్దరిని తీసేయాలని అపూర్వ, మిథిలేష్‌కు బిగ్ బాస్ చెప్పాడు. దాంతో అమన్, సృష్టి ఇద్దరి తీసేశారు. ఇక్కడ కూడా రచ్చ రచ్చ జరిగింది.
కెప్టెన్‌గా ముఖేష్
మిగిలిన ఇద్దరితో టైఅప్ అయి కెప్టెన్సీ కోసం పోటీ పడాలని బిగ్ బాస్ చెప్పాడు. గుప్పెడంత మనసు సీరియల్ హీరో ముఖేష్‌ను జోడీగా అపూర్వ సెలెక్ట్ చేసుకుంది. ఇక ఝాన్సీతో మిథిలేష్ జతకట్టాడు. నలుగురికి బ్యాలెన్స్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ఆ టాస్క్‌లో ముఖేష్, అపూర్వ గెలిచారు.
దాంతో సీరియల్ హీరో ముఖేష్ కొత్త కెప్టెన్ కాగా అపూర్వకు ఇమ్యూనిటీ లభించింది. అంటే, వచ్చేవారం నామినేషన్స్‌లో అపూర్వను ఎవరు నామినేట్ చేయకూడదు. ఇదివరకు కెప్టెన్ ఎవరు అవుతారో వారికి ఈ ఇమ్యూనిటీ ఉండేది. ఇప్పుడు ఇద్దరు కలిసి ఆడారు కాబట్టి కెప్టెన్‌గా ముఖేష్ ఉంటే.. నామినేషన్స్ నుంచి తప్పించుకునే ఇమ్యూనిటీ అపూర్వకు దక్కింది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


