Bigg Boss: బిగ్ బాస్ ఫస్ట్ కెప్టెన్‌గా రైతుబిడ్డ ఝాన్సీ- ఆ వెంటనే లక్ష రూపాయల బంపర్ ఆఫర్- మిస్ చేసుకున్న రామ్ ప్రసాద్
Bigg Boss Telugu 10 First Captain Jhansi: బిగ్ బాస్ తెలుగు 10లో రసవత్తరంగా సాగిన కెప్టెన్సీ పోరులో రైతుబిడ్డ, సింగర్ ఝాన్సీ విజేతగా నిలిచింది. అంతేకాకుండా లక్ష రూపాయల బంపర్ ఆఫర్ అందుకుంది. మరి అదేంటీ, ఎలా అనే వివరాలను బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 19 ఎపిసోడ్ హైలెట్స్‌లో చూద్దాం.
Bigg Boss 10 Telugu September 18 Episode Highlights: తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కొత్త సీజన్‌తో జోరుగా సాగుతోంది. బిగ్ బాస్ తెలుగు 10 సెప్టెంబర్ 18 ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య కెప్టెన్సీ పోరు రసవత్తరంగా సాగింది.

ఫస్ట్ కెప్టెన్‌గా రికార్డ్
ఈ కెప్టెన్సీ పోటీలో రైతుబిడ్డ, ఫోక్ సింగర్ ఝాన్సీ విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా బిగ్ బాస్ 10 తెలుగు సీజన్‌కే ఫస్ట్ కెప్టెన్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది ఝాన్సీ. ఆ వెంటనే లక్ష రూపాయల బంపర్ ఆఫర్‌ను అందుకుని ఝాన్సీ మిగతా కంటెస్టెంట్స్‌కి షాక్ ఇచ్చింది.
బిగ్ బాస్ 10 తెలుగు నిన్నటి ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్స్‌కి జైలు టాస్క్ ఇచ్చారు. త్రిగుణ్, ముఖేష్, ఝాన్సీ, శాలిని, రామ్ ప్రసాద్ ఐదుగురు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడ్డారు. వీరందరిని జైలులో ఉంచుతారు. మిగతా హౌజ్‌మేట్స్ అంతా పోలీసుల్లాగా, గార్డ్స్‌గా కాపాల ఉంటారు.
ఒక్కో రౌండ్‌లో ఒక్కొక్కరు అవుట్
సైరన్ మోగినప్పుడు ఇద్దరు పోలీసులు రోహిత్, వంశీ జైలు లాక్ ఓపెన్ చేస్తారు. దాంతో వారంతా పరుగెత్తి ముందున్న గోడ దూకి తమని తాము కెప్టెన్సీ పోటీలో ఇంకా పాల్గొనేందుకు కాపాడుకోవాలి. గార్డ్స్ అంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుని కెప్టెన్‌గా చూడొద్దనుకునే కంటెండర్‌ని ఆపొచ్చు. మరోసారి సైరన్ మోగేవరకు వాళ్లు గోడ దూకకుండా పట్టుకుని ఉండాలి.
ఈ క్రమంలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు డీల్స్ చేసుకోవచ్చు. ఇలా మొదటి రౌండ్‌లో శాలినిని అంతా పట్టేసుకున్నారు. దాంతో శాలిని కెప్టెన్సీ రేసు నుంచి పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. రెండో రౌండ్‌లో ముఖేష్, మూడో రౌండ్‌లో త్రిగుణ్ అవుట్ అయ్యారు.
ఫిజికల్ కావడంతో
అయితే, ఈ రౌండ్స్ మధ్యలో గార్డ్స్‌లో ఇద్దరిని ఎలిమినేట్ చేసే పవర్ పోలీసులకు ఇచ్చాడు బిగ్ బాస్. ఇద్దరు గార్డ్స్ వెళ్లిపోయాక కెప్టెన్సీ రేసు నుంచి అవుట్ అయిన కంటెండర్స్ గార్డ్స్‌గా విధుల్లో చేరుతారు. అలా శాలిని, ముఖేష్ గార్డ్స్‌గా మారారు. త్రిగుణ్‌ను పట్టుకునేందుకు ముఖేష్, వర్షిణి చాలా ట్రై చేసి సక్సెస్ అయ్యారు.
ఈ క్రమంలో ముఖేష్ కాస్తా ఫిజికల్ అయ్యాడు. తన బాడీ ముఖ్యమని ఆలోచించిన త్రిగుణ్ క్విట్ చేశాడు. ఫైనల్‌గా కెప్టెన్సీ కంటెండర్స్‌గా రామ్ ప్రసాద్, ఝాన్సీ ఇద్దరు మిగిలారు. ఈ ఇద్దరికి కెప్టెన్ ఫ్లాగ్ ఎత్తే టాస్క్ ఇచ్చారు. ముందుగా గడ్డి ఉన్న బాక్స్‌లో కట్టర్ తీసుకుని, ముందుగా ఉన్న బాక్స్ లైన్స్‌లో ఒకే కాలితో (తొక్కుడు బిల్ల లాగా) వెళ్లాలి.
కెప్టెన్సీ చివరి టాస్క్ ఇలా
ఆ తర్వాత తీసుకున్న కట్టర్‌తో ఫెన్సింగ్ కట్ చేసి అందులోనుంచి ముందుకు వెళ్లి బ్యాగ్‌లో ఉన్న వెయిట్స్ సాక్స్, C అనే లెటర్ తీసుకోవాలి. అనంతరం ముందున్న ఒకే కెప్టెన్ జెండాలో C అక్షరం అంటించి వెయిట్స్ సాక్స్‌ను చివరిలో తగిలించాలి. దాంతో ఆ జెండా ఎగరవేసినట్లుగా అవుతుంది.
ఈ టాస్క్‌లో సింగర్ ఝాన్సీ చాలా ఫాస్ట్‌గా చేసి బిగ్ బాస్ సీజన్ 10 ఫస్ట్ కెప్టెన్ అయింది. అనంతరం ఫస్ట్ కెప్టెన్ అయినందుకు వైట్ గోల్డ్ మనీ కంపెనీ నుంచి బంగారు మెడల్‌ను గిఫ్ట్‌గా అందించారు. దాని విలువ లక్ష రూపాయలు అని ఆ మెడల్‌తో వచ్చిన లెటర్‌లో రాసి ఉంది. దానిని వైట్ గోల్డ్ మనీ స్టోర్‌లో ఎక్కడైనా నగదుగా మార్చుకోవచ్చని కూడా ఉంది.
మిస్ చేసుకున్న రామ్ ప్రసాద్
అదంతా విన్న జబర్దస్త్ రామ్ ప్రసాద్ తాను కెప్టెన్ అవనందుకు అప్పుడు ఫీల్ అయ్యాడు. గెలిస్తే తనకు కూడా లక్ష రూపాయలు వచ్చేవని. అయితే, ముందు అంతా రామ్ ప్రసాదే కెప్టెన్ అవుతరానుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఝాన్సీ కెప్టెన్ అయింది. ఆ వెంటనే లక్ష రూపాయల బంపర్ ఆఫర్ కూడా అందుకుంది.
అలా జబర్దస్త్ రామ్ ప్రసాద్ ఆ లక్ష రూపాయల ఆఫర్‌ను మిస్ చేసుకున్నందుకు ఫీల్ అయ్యాడు. అయితే, ప్రతివారం అయ్యే కెప్టెన్‌కు ఇలా గోల్డ్ మెడల్ దక్కుతుందని వైట్ గోల్డ్ మనీ స్పాన్సర్ నోట్‌లో చెప్పారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


