Dhurandhar 2: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ధురంధర్ 2.. 3 వేల కోట్ల ఫ్రాంఛైజీపై ముఖేష్ అంబానీ ప్రశంసల వర్షం.. ఏమన్నారంటే?

Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) సిరీస్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సాధించిన రికార్డులపై రిలయన్స్ ఇండస్ట్రీస్ బాస్ ముఖేష్ అంబానీ స్వయంగా స్పందిస్తూ మూవీ సక్సెస్ ను ప్రశంసించారు.

Published on: Jun 3, 2026, 21:16:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dhurandhar 2: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ జియో స్టూడియోస్ (Jio Studios) అన్‌స్టాపబుల్‌గా దూసుకుపోతోంది. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్’ ఫ్రాంచైజీ హిందీ సినిమా లెక్కలను మార్చేయడమే కాకుండా, ఈ ప్రొడక్షన్ హౌస్‌కు భారీ మైలేజ్‌ను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఈ సినిమాల సక్సెస్‌ను, జియో స్టూడియోస్ ఎదుగుదలను అఫీషియల్‌గా అభినందించారు. ధురంధర్ 2 మూవీ గురువారం (జూన్ 4) జియోహాట్‌స్టార్ లోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే.

Dhurandhar 2: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ధురంధర్ 2.. 3 వేల కోట్ల ఫ్రాంఛైజీపై ముఖేష్ అంబానీ ప్రశంసల వర్షం.. ఏమన్నారంటే? (Netflix)
Dhurandhar 2: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి ధురంధర్ 2.. 3 వేల కోట్ల ఫ్రాంఛైజీపై ముఖేష్ అంబానీ ప్రశంసల వర్షం.. ఏమన్నారంటే? (Netflix)

వరుసగా మూడేళ్లు ఇండస్ట్రీ హిట్స్: ముఖేష్ అంబానీ

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం.. ముఖేష్ అంబానీ షేర్‌హోల్డర్లతో పంచుకున్న యాన్యువల్ లెటర్‌లో జియో స్టూడియోస్ సక్సెస్ ట్రాక్‌ను స్పెషల్‌గా ప్రస్తావించారు.

"2024 లో 'స్త్రీ 2' (Stree 2), 2025 లో 'ధురంధర్' (Dhurandhar), 2026 లో 'ధురంధర్: ది రివెంజ్' (Dhurandhar: The Revenge) సినిమాలతో వరుసగా మూడేళ్లపాటు అత్యధిక వసూళ్లు సాధించిన బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన ఏకైక నిర్మాణ సంస్థగా జియో స్టూడియోస్ నిలిచింది. ఇది మా లీడర్‌షిప్‌కు, నిలకడకు అసలైన నిదర్శనం. స్పై యాక్షన్ థ్రిల్లర్స్‌గా వచ్చిన 'ధురంధర్' సిరీస్.. గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర, రిలీజ్ స్ట్రాటజీల్లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ ఆల్-టైమ్ హయ్యస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్‌గా రికార్డు సృష్టించగా, సెకండ్ పార్ట్ వచ్చే వరకు వరుసగా 15 వారాల పాటు థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా ఆడింది" అని ముఖేష్ అంబానీ తన లెటర్‌లో రాసుకొచ్చారు.

‘ధురంధర్’ బాక్సాఫీస్ సునామీ వెనుక అసలు కారణం

ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ‘ధురంధర్’ పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించాయి. ట్రేడ్ వెబ్‌సైట్ శాక్‌నిల్క్ (Sacnilk) లెక్కల ప్రకారం.. 'ధురంధర్: ది రివెంజ్' (పార్ట్ 2) వరల్డ్‌వైడ్‌గా ఏకంగా 1,812.96 కోట్లు వసూలు చేసింది. దీంతో ఆమిర్ ఖాన్ 'దంగల్' తర్వాత ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో సినిమాగా రికార్డులకెక్కింది.

సాధారణంగా రొమాంటిక్ లేదా ఎనర్జిటిక్ రోల్స్ చేసే రణ్‌వీర్ సింగ్.. దానికి పూర్తి భిన్నంగా రఫ్ అండ్ రా స్పై అవతార్‌లోకి మారడం ఈ సిరీస్ సక్సెస్‌కు మెయిన్ రీజన్ అని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. పైగా జియో స్టూడియోస్ వాడిన అగ్రెసివ్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఈ సిరీస్‌ను పాన్-ఇండియా లెవల్‌లో నిలబెట్టింది.

ధురంధర్ 2 ఓటీటీ రిలీజ్

మరోవైపు ధురంధర్ 2 మూవీ మరికొన్ని గంటల్లో ఇండియాలో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే ఇతర దేశాల్లో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. జూన్ 4న రాత్రి 7 గంటలకు జియోహాట్‌స్టార్ లో డిజిటల్ ప్రీమియర్ ఉండనుంది. ఆ తర్వాత జూన్ 5 నుంచి రెగ్యులర్ స్ట్రీమింగ్ మొదలుకానుంది. ఐదు భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇప్పటికే ఆ ఓటీటీ వెల్లడించింది.

ఒకవైపు హిట్స్.. ఇంకోవైపు ‘డాన్ 3’ వివాదం

రణ్‌వీర్ సింగ్ కెరీర్ పరంగా భారీ హిట్స్ కొడుతున్నప్పటికీ, మరోవైపు ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్‌లో రావాల్సిన ‘డాన్ 3’ (Don 3) ప్రాజెక్ట్ విషయంలో పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో రణ్‌వీర్ ఈ సినిమా నుంచి సడెన్‌గా తప్పుకోవడంతో.. ప్రీ-ప్రొడక్షన్ టైమ్‌లో జరిగిన నష్టానికి గాను ఫర్హాన్ అఖ్తర్ ఏకంగా రూ.45 కోట్లు డిమాండ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఈ ఇష్యూపై స్పందించిన ‘ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్’ (FWICE) మొదట రణ్‌వీర్‌పై నాన్-కోఆపరేషన్ బ్యాన్ విధించింది. కానీ రణ్‌వీర్ సింగ్ లీగల్ నోటీసులు పంపడంతో వాళ్లు వెనక్కి తగ్గారు. అయితే ‘ప్రొడ్యూసర్స్ గిల్డ్’ మాత్రం ఫర్హాన్ అఖ్తర్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ.. యాక్టర్స్ లాస్ట్ మినిట్‌లో సినిమాల నుంచి తప్పుకోవడం కరెక్ట్ కాదని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ముఖేష్ అంబానీ తన లెటర్‌లో జియో స్టూడియోస్‌కు చెందిన ఏయే సినిమాలను మెన్షన్ చేశారు?

వరుసగా మూడేళ్లపాటు భారీ వసూళ్లు సాధించిన ఇండస్ట్రీ హిట్స్ ‘స్త్రీ 2’ (2024), ‘ధురంధర్’ (2025), ‘ధురంధర్: ది రివెంజ్’ (2026) సినిమాలను ఆయన స్పెషల్‌గా ప్రస్తావించారు.

‘ధురంధర్: ది రివెంజ్’ (Dhurandhar 2) టోటల్ కలెక్షన్స్ ఎంత?

ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా 1,812.96 కోట్లు కలెక్ట్ చేసి, ‘దంగల్’ తర్వాత ఇండియాలోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా సంచలనం సృష్టించింది.

రణ్‌వీర్ సింగ్, ఫర్హాన్ అఖ్తర్ మధ్య ఉన్న 'డాన్ 3' వివాదం ఏంటి?

‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుంచి రణ్‌వీర్ సింగ్ చివరి నిమిషంలో తప్పుకోవడంతో, తనకు జరిగిన నష్టాల కింద ఫర్హాన్ అఖ్తర్ 45 కోట్లు అడగడం వల్లే ఈ వివాదం మొదలైంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More