రణ్‌వీర్‌ను కాదు వాళ్లను బ్యాన్ చేయాలి.. ధురంధర్ సక్సెస్ చూసి భయపడుతున్నారు.. ఉపాధి కల్పించేది ఇలాంటి స్టార్లే: ఆర్జీవీ

Ranveer Singh: రణ్‌వీర్ సింగ్‌పై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) విధించిన బ్యాన్‌పై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది కేవలం ఇద్దరి మధ్య జరిగిన ప్రైవేట్ వ్యవహారమని, ఇందులో తలదూర్చడానికి ఆ సంఘం ఎలాంటి న్యాయస్థానం కాదని ఆర్జీవీ తేల్చిచెప్పారు.

Published on: May 30, 2026, 09:36:05 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ranveer Singh: బాలీవుడ్ ప్రముఖ హీరో రణ్‌వీర్ సింగ్‌పై సినీ కార్మిక సంఘం 'FWICE' సహాయ నిరాకరణ ప్రకటించిన విషయం తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 'ఎక్స్' వేదికగా చాలా ఘాటుగా స్పందించారు. రణ్‌వీర్ సింగ్‌ను కాదు, ఆ ఫెడరేషన్‌నే బ్యాన్ చేయాలంటూ సంచలన పోస్ట్ పెట్టారు. ఈ వివాదంలో తలదూర్చే హక్కు FWICEకు లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆర్జీవీ తన సుదీర్ఘ పోస్టులో ఏమన్నాడో చూడండి.

రణ్‌వీర్‌ను కాదు వాళ్లను బ్యాన్ చేయాలి.. ధురంధర్ సక్సెస్ చూసి భయపడుతున్నారు.. ఉపాధి కల్పించేది ఇలాంటి స్టార్లే: ఆర్జీవీ
రణ్‌వీర్‌ను కాదు వాళ్లను బ్యాన్ చేయాలి.. ధురంధర్ సక్సెస్ చూసి భయపడుతున్నారు.. ఉపాధి కల్పించేది ఇలాంటి స్టార్లే: ఆర్జీవీ

అదొక కంగారూ కోర్టు..

రణ్‌వీర్ సింగ్ వ్యవహారంలో ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ.. అదేమీ కోర్టు కాదంటూ ఆర్జీవీ అన్నారు.

"గాంధీజీ తరహాలో సహాయ నిరాకరణ చేస్తాం, బ్యాన్ చేస్తాం అనడం చివరికి FWICE పాలిట ఒక పెద్ద జోక్‌గా మారుతుంది. ఇది పరిశ్రమను లేదా కార్మికులను రక్షించడం కాదు. కాలం చెల్లిన ఒక యూనియన్ వ్యవస్థ తన ఉనికిని కాపాడుకోవడం కోసం కండబలం ప్రదర్శించుకునే ఒక డ్రామా మాత్రమే. లక్షలాది మంది కార్మికుల తరఫున మాట్లాడుతున్నామని వారు చెప్పుకుంటున్నా.. ఆ కార్మికులకు అసలు ఈ వివాదంలో ఉన్న నిజాలేమిటో కూడా తెలియదు. FWICE అనేది చట్టబద్ధమైన న్యాయస్థానం కాదు, ప్రభుత్వ గుర్తింపు పొందిన నియంత్రణ సంస్థ అంతకన్నా కాదు. అదొక కంగారూ కోర్టు. ఒక అజెండాతో కొంతమంది ప్రైవేట్‌గా కూర్చుని ముందే తీర్పులు రాసేసుకునే పంచాయితీ అది" అని ఆర్జీవీ చాలా ఘాటుగా స్పందించారు.

'ధురంధర్' సక్సెస్ చూసి భయపడుతున్నారు

"ఇటీవల రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్' (Dhurandhar) సినిమా సాధించిన మెగా సక్సెస్ చూసి భయపడి వణికిపోతున్న కొందరు నటులు కూడా ఈ గ్రూపులో ఉండి ముందే తీర్పును డిసైడ్ చేసేశారు. ఇది FWICEకు పీఆర్ పరంగా పెద్ద డిజాస్టర్ కాబోతోంది. లక్షలాది మంది కార్మికుల బతుకులు ఏ ఒక్క హీరో పైనో, ఏ ఒక్క ప్రాజెక్టు పైనో ఆధారపడి ఉండవనేది పచ్చి నిజం. సోషల్ మీడియాలో సానుభూతి కోసం వారు కార్మికుల పేరుతో అబద్ధాలు ఆడుతున్నారు" అని ఆర్జీవీ అన్నారు.

అది వారి వ్యక్తిగత వివాదం..

"ఈ వ్యవహారంలో అసలు విషయం ఏమిటంటే.. ఒక నిర్మాత తనకు ప్రీ-ప్రొడక్షన్ వల్ల భారీ నష్టాలు వచ్చాయని చెబుతున్నాడు. అది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వివాదం. ఇండియాలోని అన్ని వ్యాపారాల్లో ఇలాంటివి లక్షల్లో జరుగుతుంటాయి. అప్పుడు ఈ FWICE ఎక్కడికి పోయింది? అందులో ఏం జరిగిందనేది ఆ ఇద్దరికి మాత్రమే తెలుసు. సివిల్ కోర్టుకు వెళితే జడ్జి నిర్ణయిస్తారు. అంతే తప్ప ఇందులో మిగతా వాళ్లు దూరి రణ్‌వీర్ సింగ్‌ను బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు" అని స్పష్టం చేశారు.

నిజం ఏమిటంటే..

"FWICE ఎన్ని హెచ్చరికలు చేసినా.. రణ్‌వీర్ సింగ్ ఒక్కసారి తలూపితే చాలు, రేపు ఉదయం ఆయన ఇంటి ముందు నిర్మాతలు చెక్కులు పట్టుకుని కిలోమీటరు పొడవునా క్యూ కడతారు. ఎందుకంటే థియేటర్లలో టికెట్లు అమ్మించేది రణ్‌వీర్ లాంటి స్టార్స్.. FWICE కాదు. లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించేది రణ్‌వీర్ లాంటి స్టార్స్.. FWICE కాదు. రణ్‌వీర్ లాంటి స్టార్స్ ఉన్నారు కాబట్టే పరిశ్రమ ఉంది.. ఆ ఫెడరేషన్ కూడా ఉంది. కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సివిల్ వివాదంలో అనవసరంగా తలదూర్చకండి" అంటూ ఆర్జీవీ తన పోస్ట్‌ను ముగించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

రణ్‌వీర్ సింగ్‌పై FWICE ఎందుకు బ్యాన్ విధించింది?

డాన్ 3 సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ దశలో తనకు భారీ నష్టాలు వచ్చాయని ఒక నిర్మాత చేసిన ఆరోపణల (వ్యక్తిగత కాంట్రాక్ట్ వివాదం) నేపథ్యంలో FWICE రణ్‌వీర్‌పై సహాయ నిరాకరణ (బ్యాన్) ప్రకటించింది.

రణ్‌వీర్‌పై విధించిన నిషేధంపై రామ్ గోపాల్ వర్మ ఏమని స్పందించారు?

ఇది పూర్తిగా ఇద్దరి మధ్య జరిగిన సివిల్ వివాదమని, ఇందులో తలదూర్చడానికి FWICE ఒక కంగారూ కోర్టు లాగా ప్రవర్తిస్తోందని ఆర్జీవీ విమర్శించారు.

ఆర్జీవీ ప్రకారం ఈ వివాదానికి అసలు కారణం ఏమిటి?

రణ్‌వీర్ నటించిన 'ధురంధర్' సినిమా భారీ విజయం సాధించడంతో, అది చూసి ఓర్వలేక భయపడుతున్న కొందరు నటులు ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని వర్మ ఆరోపించారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More