Podarillu November 10 Episode: పొదరిల్లు- శైలుకు కేశవ మాయమాటలు, చీర- నారాయణకు కొత్త బట్టలు- కన్నాతో నారాయణ కాళ్లకు దండం
Podarillu Serial November 10th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 10వ ఎపిసోడ్లో కేశవ షాప్‌కి ఏం పేరు పెట్టాలో అంతా వాదించుకుంటే చీటీలు వేయమని నారాయణ ఐడియా ఇస్తాడు. అందులో శైలు పేరే రాశానని చెప్పి రాయడు కేశవ. అది తెలిసిన శైలు గొడవ పడితే చీర గిఫ్టుగా ఇస్తాడు కేశవ. నారాయణకు కొత్త బట్టలు ఇస్తాడు కేశవ.
Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో వంట గదిలో పెద్ది, మనీషా నవ్వుకుంటారు. అప్పుడే వచ్చిన చక్రి అబ్బో.. వంట గదిలోకి అన్న తప్పా ఇంకెవరు వెళ్లలేదు. అప్పుడే మనీషా వంటలో పాలు పంచుకుంటుందని చక్రి అంటాడు. వంట గదిలో వంట నేర్పుతున్నారా లేక ప్రేమ పాఠాలు నేర్పుతున్నారా అని చక్రి అంటాడు.

సచ్చా ఆద్మీనా అచ్చా హై
ఇంతలో కేశవ, శైలు వస్తారు. షాప్‌కి పేరు పెట్టడం గురించి మాట్లాడుతారు. పేరు మారిస్తే కలిసివస్తుందని నేను, కన్నా మహాలక్ష్మి పేరు పెడదామనుకుంటున్నామని చక్రి అంటాడు. దాంతో శైలు ఫీల్ అవుతుంది. అది మహా, కేశవ గమనిస్తారు. నా పేరు వద్దు పెద్ది పేరు పెడదామని, కేశవ ఈ స్థాయికి రాడానికి కారణం పెద్దినే కారణం కదా. మాధవ బైక్ సర్వీసెస్ అని పెడితే బాగుంటుందని మహా అంటుంది.
సచ్చా ఆద్మీనా అచ్చా హై అని మనీషా అంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి అంతా మంచే జరుగుతుంది. నీ పేరు పెడదామని మాధవ అంటాడు. అంతా వాదించుకుంటారు. ఇంతలో నారాయణ వచ్చి ఏ పేరు పెట్టాలనుకుంటున్నారో చిటీ వేయమని సలహా ఇచ్చి వెళ్తాడు. ఈ ఐడియా బాగుందని చక్రి అంటాడు. అంతా ఓకే అంటారు. కేశవను బయటకు తీసుకెళ్తుంది శైలు.
వాళ్లంతా ఏదో పేరు పెట్టాలనుకుంటున్నారు. అసలు నీకు ఏ పేరు పెట్టాలనిపిస్తుందో చెప్పురా అని శైలు అడుగుతుంది. నాకైతే మహాలక్ష్మి పేరుగానీ, అన్నయ్య పేరు గానీ పెడితే బాగుంటుందనిపిస్తుందని కేశవ మనసులో అనుకుంటాడు. నీ మనసులో నా పేరే పెట్టాలని ఉందిగా. చూశావా నేను ఎలా కనిపెట్టానో అని శైలు అంటుంది. ఇప్పుడు దీని పేరు చెప్పకుంటే గొడవ చేస్తుందనుకున్న కేశవ బయటకు కూడా అవునే బుస్సు నీ పేరే పెట్టాలని ఉందంటాడు.
షాప్ పేరులో సస్పెన్స్
లోపలికి వెళ్తారు. అంతా చిట్టీలు రాసి బౌల్లో వేస్తారు. కేశవ అన్నయ్య పేరు రాస్తానని రాస్తాడు. శైలు చిటీ తీస్తానంటే మహాలక్ష్మి అందరికి లక్కీ అని, తనే తీస్తుందని చెబుతాడు చక్రి. కేశవ కూడా అదే అంటాడు. దాంతో కేశవను కోపంగా చూస్తుంది శైలు. మహాలక్ష్మి చిటీ తీస్తుంది. హమ్మయ్య నేను రాసిన చీటినే వచ్చిందోచ్.. అని సంతోషిస్తుంది మహా.
ఏం పేరు వచ్చిందని కన్నా అడిగితే.. సస్పెన్స్.. నేను అనుకుందే వచ్చిందిగా.. రేపు పూజ టైమ్‌కి నా తరఫున ఈ పేరు మీద బోర్డ్ రాయించి రెడీగా ఉంచుతానని మహా అంటుంది. మీకెందుకు శ్రమ అని కేశవ అంటే.. ఇది నా గిఫ్ట్ అని మహా అంటుంది. బోర్డ్ ఎక్కడ రాయిస్తారు అని కన్నాతో వెళ్లిపోతుంది మహా. వెంటే చక్రి కూడా వెళ్లాడు. అంతా వెళ్లిపోతారు.
ఈ ముంగిస గాడు ఏం పేరు రాశాడని చిటీలు తీసి చూస్తుంది. అందులో శైలు పేరు కేశవ రాయనట్లు తెలుస్తుంది. తర్వాత కేశవను నిలదీస్తుంది శైలు. చిటీలు వద్దు ఏమొద్దు శైలు పేరు పెడదామని చెప్పాలిగా అని శైలు అంటుంది. నాకు మాధవ అన్నయ్యో ఎంతో చేశారు. తన పేరు చెప్పకుంటే ఎలా ఉంటుందని కేశవ అంటాడు. మరి చిటీలో నా పేరు ఎందుకు రాయలేదని నిలదీస్తుంది శైలు.
శైలుకు కేశవ మాయమాటలు
దీనికెలా తెలిసిందనుకున్న కేశవ.. నేను నీ పేరే రాశాను అని అబద్ధం చెబుతాడు కేశవ. దాంతో చిటీలు చూపిస్తుంది. నా మీద అనుమానం ఉందా అని అంటాడు కేశవ. కేశవ చిటీ తీసి చూపిస్తుంది. దేవుడా అన్నయ్య పేరు రాశానని తెలిస్తే గోల చేస్తుందని అనుకుంటాడు కేశవ. మీ అన్నయ్య పేరు రాశావ్. నీ మాటలన్నీ అబద్ధం. నా మీద ప్రేమ లేదని శైలు కోప్పడుతుంది.
నేను నీ పేరు రాయలేదే. ఆల్రెడీ నువ్వు నా గుండెల్లో ఉన్నావ్. నా అణువణువు ఉన్నావు. మనమంటే ఒక్కరమేగా. అది మన షాప్. ఆఫ్ట్రాల్ ఆ షాప్‌కు నీ పేరు పెట్టి మన ప్రేమను తగ్గించమంటావా. అందుకే రాయలేదు. కావాలంటే చెప్పు అందరికి చెప్పి నీ పేరే రాయిస్తానని కేశవ మాయమాటలు చెబుతాడు. దాంతో నీ గుండెల్లో ఉన్నా అది చాలంటుంది శైలు.
నీకోసం చీర తీసుకున్నా అని గిఫ్ట్ ఇస్తాడు కేశవ. రేపు పూజకు ఇదే కట్టుకోమంటాడు. దాంతో చాలా సంతోషపడి వెళ్లిపోతుంది శైలు. షాప్ పూజకు కావాల్సిన సామాన్లు తీసుకురమ్మని చక్రికి చెబుతుంది మహా. ఇంట్లో అందరికి కేశవ బట్టలు తీసుకొస్తాడు. అందరికి ఇస్తాడు. మనీషాకు కూడా బట్టలు ఇస్తాడు. మనీషా ఎందుకంటే నాలుగు రోజులు పోతే మా ఇంట్లో పెద్ద వదినగా అడుగుపెడతారు అని కేశవ అంటాడు.
నారాయణకు కేశవ బట్టలు
కన్నాకు మాత్రం రెండు జతల బట్టలు ఇస్తాడు కేశవ. పూజకు, దీపావళికి అని చెబుతాడు కేశవ. నారాయణకు కూడా బట్టలు తీసుకొస్తాడు కేశవ. మీ చేత్తోనే ఇచ్చి రేపు ఓపెనింగ్‌కి రమ్మనండని మహా అంటుంది. కన్నా ఫీల్ అవుతాడు. నారాయణ దగ్గరికి వెళ్లి బట్టలు తీసుకొచ్చానని కేశవ చెబితే.. నన్ను మనిషిలెక్కలో వేశావ అంటాడు నారాయణ.
రేపు షాప్ ఓపెనింగ్‌కి కూడా రమ్మంటాడు కేశవ. ఈ బట్టలే జీర్ణం కావట్లేదు. సరే వస్తాలే అంటాడు నారాయణ. అదంతా చూసిన కన్నా కోపంతో పక్కకు వెళ్లిపోతాడు. మీరంతా నాకు నచ్చట్లేదు. ఐ హేట్ యూ ఆల్ అంటాడు కన్నా. ఏమైందని చక్రి, మాధవ అడిగితే నన్ను ఒంటరిగా వదిలేయండి. వదిలేయడమేంటీ ఒంటరివాన్నేగా. నా మీద ఎవరికి ప్రేమ లేదని కన్నా అంటాడు.
నువ్వు నాకు ప్రాణంరా అని మాధవ అంటాడు. అలాంటప్పుడు నేను బాధపడే పనులు ఎందుకు చేస్తున్నారు. ఆ నారాయణకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు ఆయన్ను నెత్తిమీద పెట్టుకుంటున్నారు. మా పెద్దమ్మను చంపేశాడు. మా అమ్మ ప్రేమకు దూరం చేశాడని కన్నా ఓవరాక్షన్ చేస్తాడు.
కన్నాతో నారాయణ కాళ్లకు దండం
తర్వాత కన్నాను మా నాన్నతో కలిపేస్తానని అన్నారని చక్రి ఛాలెంజ్‌ను గుర్తుచేస్తుంది మహా. నేనున్నానుగా అంటాడు చక్రి. పూజకు అంతా రెడీ అవుతారు. మాధవ, మనీషాలను నారాయణ దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటాడు చక్రి. నారాయణ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. కన్నా చేత కూడా మా నాన్న కాళ్లకు దండం పెట్టిస్తా చూడు అని మహాతో అంటాడు చక్రి.
కేశవను కూడా ఆశీర్వదిస్తాడు నారాయణ. కన్నాను కూడా అదే చేత్తో ఆశీర్వదించు అని చక్రి అంటాడు. నారాయణ షాక్ అవుతాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


