Podarillu November 5 Episode: పొదరిల్లు- బాలులా మహాలక్ష్మి- కేశవ, శైలు లాంగ్ డ్రైవ్- తిట్ల రౌడీలతో మాధవ ఫైట్, కత్తిపోటు
Podarillu Serial November 5th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 5వ ఎపిసోడ్లో మాధవను చాలా స్టైల్‌గా రెడీ చేసి మనీషాతో డేటింగ్‌కు పంపిస్తారు మహా అండ్ కో. మనీషా, మాధవ స్వీట్స్ తినిపించుకుంటారు. వాళ్ల డేటింగ్‌పై చక్రి జోకులు వేస్తారు. తను పులిహార కలిపితే నీకేంటని చక్రి అడిగితే మహా తడబడుతుంది.
Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో మనీషాతో డేట్‌కి వెళ్తున్న మాధవ డ్రెస్ చూసి షాక్ అవుతారు. చాలా స్టైలిష్‌గా ఉండాలని, మనీషా ఫ్లాట్ కావాలని మహాలక్ష్మి అంటుంది. దాంతో కన్నా మాధవను లోపలికి తీసుకెళ్లి చాలా స్టైల్‌గా బయటకు తీసుకొస్తాడు.

అచ్చం హీరోలా ఉన్నారు పెద్ది
జీన్స్, షర్ట్, వాచ్ పెట్టి, షూస్ వేసి తీసుకొస్తాడు. మాధవను చూసి అంతా ఆశ్చర్యపోతారు. అచ్చం హీరోలా ఉన్నారని మహాలక్ష్మి అంటుంది. బ్లాక్ షేడ్స్ పెడతాడు కన్నా. మాధవకు ఎలా నడవాలో ట్రైనింగ్ ఇస్తాడు కన్నా. మాధవ నడుస్తాడు. బాషా.. బాషా.. అంటూ అరుస్తారు. నాకు సిగ్గేస్తుందని మాధవ అంటాడు. సైకిల్ మీద వెళ్తానని మాధవ అంటే.. కేశవ తన బైక్ కీస్ ఇస్తాడు.
బుల్లెట్ బైక్‌పై అంతా కలిసి మాధవను పంపిస్తారు. బాషా బాషా అంటూ మళ్లీ అరుస్తారు. మాధవ వెళ్లిపోతాడు. చక్రి ఆకలేస్తుందంటే.. అన్నం గిన్నే మొత్తం తీసుకొచ్చి ఇస్తాడు కన్నా. మరోవైపు మనీషా కూడూ చుడిదార్‌లో అందంగా రెడీ అయి ఉంటుంది. మాధవను చూసి మనీషా ఆశ్చర్యపోతుంది. డ్రెస్ చాలా బాగుందని ఒకరికొకరు చెప్పుకుంటారు.
ఇద్దరు బైక్‌పై వెళ్తారు. వాళ్లిద్దరిని శైలు చూస్తుంది. నన్ను మాత్రం వాడి బైక్‌పై డ్రాప్ చేయమంటే సుత్తి కారణాలు చెబుతాడు. చెబుతా వాడి సంగతనుకుంటుంది శైలు. చెరువు గట్టు దగ్గర మనీషా అల్లరి చేస్తుంది. ఈ ప్లేస్ చాలా బాగా నచ్చిందని చెబుతుంది మనీషా. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు. ఇంటినుంచి చేసుకుని తీసుకొచ్చిన స్వీట్స్ ఇస్తుంది మనీషా.
ఏదేదో ఊహించుకుంటున్నారా
ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటారు. మనీషా సంతోషంగా అల్లరి చేస్తే.. ఎప్పుడు సైలెంట్‌గా ఉండే చిన్న పిల్లలా ఎంజాయ్ చేస్తున్నావని మాధవ అడుగుతాడు. మనసుకు నచ్చిన వ్యక్తి పక్కన ఉంటే సంతోషంగా ఉంటుంది. అందుకే ఇలా ఆడుతున్నాను అని మనీషా అంటుంది. నువ్వు చెప్పింది నా మనసు వింటుందని తన గుండెకు మనీషా చేయి పెట్టి చూపిస్తాడు మాధవ.
మాధవ గుండెలపై వాలుతుంది మనీషా. ఇద్దరు కలిసి పాటలు వింటారు. మరోవైపు గాల్లో చక్రి లెక్కలు వేస్తాడు. మహా వచ్చి అడుగుతుంది. అన్నయ్య మనీషాను డేట్‌కి ఎలా తీసుకెళ్లి ఉంటాడో అని చక్రి అంటాడు. దాంతో మహా కోప్పడుతుంది. ఛీ ఛీ.. అన్నయ్య కాబోయే వదినను డేట్‌కి తీసుకెళ్తే ఏదోదో ఊహించుకుంటున్నారా. అసలు మీరు మనిషా పర్వటెడా.. అని ఘోరంగా తిడుతుంది మహా.
నేను ఏం ఊహించుకున్నానో చెప్పకుండా అలా తిడుతున్నారని చక్రి అంటాడు. ఏం ఊహించుకుంటున్నారని మహా అంటే.. మాధవ బైక్‌ను నడపడానికి బదులు సైకిల్‌ను తోసుకెళ్లినట్లు నడిపించుకుంటూ తీసుకెళ్లినట్లు చెబుతాడు. మీరు ఊహల్లో కూడా 50 శాతమే ఊహిస్తున్నారు అని తిడుతుంది మహా. షాపును చోటుకు రాసి ఇస్తారా. మరి వెళ్లకుండా పనికిమాలిన వాళ్లతో కూర్చున్నారు. పనికొచ్చే పనులు చేయండి అని వారిస్తుంది మహా.
బాలు గాడిలా దిట్ట అనిపించుకోవాలా
దాంతో కేశవ వెళ్తాడు. రేయ్ నీకు చదువుకునేది లేదా. ఈ వేపకాయ వెర్రోడితో మాటలేంటీ అని కన్నాను తిడుతుంది. దాంతో కన్నా వెళ్తాడు. నా మీద చాలా ఉందండి కోపం అని చక్రి అంటాడు. పెద్దికి డేటింగ్ కొత్త.. 50 పర్సంట్ బ్రెయిన్ ఉన్నవాళ్లు 100 పర్సంట్ మంచివాళ్లపై జోకులు వేస్తే నాకు 1000 పర్సంట్ మండుతుంది అని మహాలక్ష్మి అంటుంది.
నేను ఓ మాట అడుగుతాను 50 పర్సంట్ కాకుండా 100 పర్సంట్ చెబుతారా అని చక్రి అంటే.. ఏంటో చెప్పు క్యాబు అని మహా అంటుంది. ఓహో ఇదో పేరా మా బాలు (గుండె నిండా గుడి గంటలు పాత్ర) గాడిలా మీరు పేర్లు పెట్టడంలో దిట్ట అనిపించుకోవాలా అని చక్రి అంటాడు. నేను పులిహార కలిపితే మీకేంటీ. మీరెందుకు స్వంత భార్యలా ఫీల్ అవుతున్నారెందుకు అని చక్రి అడుగుతాడు.
అవునా. నేనెందుకు ఎలా ఫీల్ అవుతున్నాను అని మనసులో అనుకున్న మహాలక్ష్మి బయటకు మాత్రం మీకు నచ్చినట్లు చేసుకోండని అంటుంది. ఎందుకు ప్రతిసారి 50 శాతం దూరుస్తున్నారు. అచ్చమైన గృహిణిలా చేస్తున్నారు. నేను ఇంకొకరితో మాట్లాడటం మీకు నచ్చదు. అందమైన స్వార్థం మొదలవుతుంది. ఆ కోపం నా మీద చూపిస్తుంటారని చక్రి అంటాడు.
వదినకు నీపై ప్రేమ ఉందన్నా
నాకు జెలసీ లేదు జెర్రిపోతు లేదు. కోపం మాత్రం వచ్చిందని మహాలక్ష్మి అంటుంది. ఆ కోపం ఎందుకని చక్రి అంటే.. ఆ గోపికలా ఇంకొకరు హర్ట్ అవకూడదని కోపమని మహా అంటుంది. నేను గోపికతో ఫ్రెండ్లీగానే మాట్లాడా. మీతో ఆ విక్కీ కూడా లక్కీ లక్కీ అంటూ మాట్లాడట్లేదా అని చక్రి అంటాడు. అతను మీలా కాదు విక్కీ చాలా డీసెంట్ అని వెళ్లిపోతుంది మహాలక్ష్మి.
అది విన్న కన్నా నవ్వుతాడు. కన్నాను పట్టుకుని చెవి మెలిపెడతాడు. వదినకు నీ మీద ప్రేమ ఉంది. కానీ బయట పడటం లేదని కన్నా అంటాడు. అది నేను బయటపెట్టిస్తానుగా అని చక్రి అంటాడు. మరోవైపు కేశవ షాప్‌కు శైలు వెళ్తుంది. ఈరోజు నీతో గొడవ పెట్టుకునేందుకు రాలేదు. నీతో సరదాగా లాంగ్ డ్రైవ్‌కి వెళ్దామని వచ్చానని శైలు అంటుంది.
మాధవకు కత్తిపోటు
దాంతో కేశవ షాక్ అవుతాడు. మరోవైపు మనీషా దగ్గరికి బాబీ అంటూ మనీషా బావ తిట్ల రౌడీలు వస్తారు. మాధవ ఐస్‌క్రీమ్ తీసుకొచ్చేందుకు వెళ్తాడు. మనీషాను కారులో ఎక్కిస్తుంటే మాధవ చూస్తాడు. నా మనీషాను నన్ను దాటి తీసుకెళ్తార్రా అని రౌడీలను చితకబాదుతాడు మాధవ. ఇంతలో వెనుక నుంచి మాధవను కత్తితో రౌడీ పొడిచినట్లు చూపిస్తారు. మనీషా అరుస్తుంది. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


