Podarillu October 27 Episode: పొదరిల్లు- మాధవకు మనీషా ముద్దు- కొత్త విలన్ మనీషా బావ ఎంట్రీ- ఇంట్లోంచి వెళ్లిపోయిన కన్నా
Podarillu Serial October 27th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 27వ ఎపిసోడ్లో మాధవ మటన్ బిర్యానీ చేస్తాడు. దాన్ని మనీషా కోసం కొంత దాస్తాడు మాధవ. దాంతో ముగ్గురు తమ్ముళ్లు ఏడిపిస్తారు. మహా చెప్పడంతో మనీషాకు బిర్యానీ తీసుకెళ్తాడు పెద్ది. మటన్ సేమ్ మాధవలాగే ఉందని చెంపపై ముద్దు పెడుతుంది మనీషా.
Podarillu Serial Today Episode: పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో కేశవ బైక్‌ను వేలంపాట వేస్తుంది శైలు. కేశవ వచ్చి అడిగితే.. అవసరం లేనివాటిని ఉంచుకోకూడదుగా, టైమ్ పాటించట్లేదుగా అని శైలు అంటుంది. కేశవ అందరిని పింపిస్తుంటే శైలు ఆపుతుంది. సినిమాకు, షాపింగ్‌కు, కాలేజ్‌కు తీసుకెళ్తానని చెప్పి తీసుకెళ్లలేదని శైలు చెబుతుంది.

పేద ప్రేమికుడికి ఫ్రీగా
బైకును పదివేలకు చెబుతుంది శైలు. ఇంతలో ఒకడు అక్కా నా దగ్గర ఐదు వేలు మాత్రమే ఉన్నాయి. కానీ, ఈ బైక్ నాకు చాలా అవసరం. నా పిల్లను పార్క్‌కు తీసుకెళ్లాలి, రోజు ఐస్ క్రీమ్ తినిపించాలి, టెంపుల్స్‌కి తీసుకెళ్లాలి. ఈ పేద ప్రేమికుడి బాధను అర్థం చేసుకో అక్క అని అతనంటాడు. నచ్చేసావురా బంగారం. నీకు 5 వేలు ఏంటీ ఫ్రీగా తీసుకోమ్మని చెబుతుంది శైలు.
అది ప్రేమ అంటే అని కేశవను తిడుతుంది శైలు. చూడు బాబు బాగా చదివి కష్టపడి డబ్బు సంపాదించి దాంతో బైకో, కారో కొని నీ పిల్లను తీసుకెళ్లు. అంతేగానీ అప్పనంగా ఎదుటోడి కష్టాన్ని దోచుకోవడం కాదని కేశవ అంటాడు. అందరిని తిట్టిపంపిస్తాడు కేశవ. మరోవైపు మటన్ బిర్యానీ చేసిన మాధవ వంటగదిలో పెడతాడు. మటన్ తానే తెచ్చానని ప్రతిసారి చక్రి అంటాడు.
అందరిని ఫ్రెష్ అయి రమ్మని పంపిస్తాడు మాధవ. ఎవరు చూడకుండా బాక్సులో మటన్ బిర్యానీ పెడతాడు. మనీషాకు కాల్ చేసి వంట చేయకని, మటన్ బిర్యానీ తీసుకొస్తానని, అరగంటలో వస్తానని చెబుతాడు మాధవ. కానీ, అదంతా ముగ్గురు తమ్ముళ్లు చూస్తారు. మాధవ లోపలికి వెళ్లి రెడీ అవుతాడు. మటన్ బిర్యానీ పెట్టిన బ్యాగ్‌ను ముగ్గురు దాచేస్తారు.
ఆటపట్టించిన తమ్ముళ్లు
మాధవ వచ్చి చూస్తే కనిపించకపోయేసరికి కంగారుపడిపోతాడు. ఇల్లంతా వెతుకుతాడు. అది చూసి వాళ్లు నవ్వుకుంటారు. మీరే తీశారా, హాట్ క్యారేజ్ డబ్బా అని మాధవ అడుగుతాడు. మాకేం తెలియదే అని ముగ్గురు అంటారు. ఓవరాక్షన్ చేయకండి. అందులో మటన్ బిర్యానీ పెట్టాను. బన్సీ కోసం అని మాధవ చెబుతాడు. మనీషా కోసం కాదా అని కేశవ అంటాడు.
అలా మటన్ బిర్యానీతో మాధవను ముగ్గురు తమ్ముళ్లు ఆటపట్టిస్తారు. చెప్పొచ్చుగా అని మాధవ అంటే.. చెబితే మాకేంటీ.. దెబ్బలు పడతాయా అని ఏడిపిస్తారు. ఇంతలో బ్యాగుతో మహాలక్ష్మి వస్తే తీసుకెళ్లింది మహా. మాకు దెబ్బలు పడతాయంటావేంటనీ మహాపైకి నెట్టేస్తారు. ఈ మూడు కోతులు ఓవరాక్షన్ చేస్తున్నారేంటని మహా అడుగుతుంది.
మేమే పెట్టామని చక్రి చెబుతాడు. ఇందులో ఏముందని మహా అడిగితే.. మాధవ సిగ్గుపడతాడు. మనీషా కోసం మటన్ బిర్యానీ అని చక్రి చెబుతాడు. నేను తీసుకెళ్లను అని మాధవ అలుగుతాడు. ఈ ముగ్గురు ఏమైనా సరిగ్గా ఉన్నారా అని తిడుతుంది. ఈ దొండకాయి సత్యతో పులిహార కలుపుతున్నాడని నా అనుమానం అని మహా అంటుంది.
మాధవకు మనీషా ముద్దు
మహా చెప్పడంతో మాధవ మటన్ బిర్యానీ మనీషా ఇంటికి తీసుకెళ్తాడు. మాధవకు కూడా మనీషా వడ్డిస్తుంది. నాకోసం తమ్ముళ్లు ఎదురుచూస్తుంటారు తినను అంటాడు మాధవ. నాకోసం ఇక్కడ కొంచెం తినండి. తమ్ముళ్లతో పూర్తిగా తినండి. మీకోసమే ఎదురుచూస్తున్నా అని మనీషా అంటుంది. దాంతో మాధవ సరేనంటాడు. ముగ్గురు తింటారు.
ఫ్లోలో మాధవకు మనీషా తినిపించబోతుంది. బన్సీ ఉన్నాడన్నది గుర్తుచేసుకుని ఆగిపోతుంది. మాధవ చేతిలో ముద్దపెడుతుంది మనీషా. చాలా బాగుందని చూపులతోనే సైగలు చేసుకుంటారు మాధవ, మనీషా. తింటారు. మీరు మాట్లాడుతూ ఉండండి. ఐస్ క్రీమ్ తీసుకొస్తానని చెప్పి బన్సీ వెళ్లిపోతాడు. మాధవ, మనీషా సిగ్గుపడుతూ ఉంటారు.
బిర్యానీ ఎలా ఉందని మాధవ అడిగితే.. మీలాగే ఉందని మనీషా అంటే బాగాలేదా అని మాధవ అంటాడు. చాలా బాగుందని చెబుతుంది మనీషా. ఇంత మంచి బిర్యానీ చేసినందుకు మీకోటి ఇవ్వాలని చెప్పి మాధవ చెంపపై ముద్దుపెడుతుంది మనీషా. దాంతో మాధవ ఆశ్చర్యపోతాడు. ఇద్దరు కాసేపు తన్మయత్వంతో ఉంటారు. నీ బహుమతి చాలా నచ్చింది. థ్యాంక్యూ అని మాధవ అంటాడు.
మనీషా విలన్ ఎంట్రీ
ఇంతలో మనీషాకు కాల్ వస్తుంది. ఐ లవ్యూ అంటాడు. ఎవరని మనీషా అంటే.. గుర్తు పట్టలేదా అని అతనంటాడు. జిజు అని మనీషా భయంతో అంటే.. బావ కాదే బంగారం, నీ మొగుడు అని అతనంటాడు. తాళికట్టకుండానే మొగుడు అనుకుంటున్నావా. నీకు నాకు పెళ్లి అయింది. నన్ను పెళ్లి చేసుకోకుండా పిచ్చి వేషాలు వేస్తే నీ కుటుంబాన్ని వదిలిపెట్టను. నరికేస్తా.. నీకోసం నా మనిషి వెతుకుతున్నాడు. ఒక్కసారి దొరికితే.. అని వార్నింగ్ ఇచ్చి పెట్టేస్తాడు మనీషా బావ.
దాంతో మనీషా ఏడుస్తూ ఉంటుంది. ఏమైందని మాధవ అడుగుతాడు. మనీషా ఏం చెప్పకుండా గుక్కపెట్టి ఏడుస్తుంది. ఇంటలో బన్సీ వచ్చి అడిగితే ఫోన్ గురించి చెబుతాడు మాధవ. ఎవరని అడిగితే.. జిజు అని మనీషా చెబుతుంది. ఆ హిట్లర్ ఫోన్ చేశాడా అని బన్సీ అంటాడు. నేను వాడి పెళ్లాన్ని అంటా.. అని బావ చెప్పింది చెబుతుంది మనీషా.
అలా మనీషా, పెద్ది జీవితంలోకి విలన్‌గా బావ వస్తాడని తెలుస్తోంది. మరోవైపు నారాయణ తాగి తాగి చస్తే బాగుండు అని కన్నా అన్నందుకు చెంప పగలగొడుతుంది మహాలక్ష్మి. ఈ మనిషి కోసం నన్ను కొట్టావ్. ఇష్టముంటే ఉండు లేకుంటే పొమ్మన్నావ్. నేను పోతున్నా అని కన్నా వెళ్లిపోతాడు. తర్వాత మహాతో చక్రి గొడవ పడతాడు.
ఇంట్లోంచి వెళ్లిపోయిన కన్నా
అమ్మ పోయిన కోపంలో అన్నాడు. ఆ మనిషే సరిగ్గా ఉంటే వాడెందుకు అంటాడు. మా తల్లిన చంపిన నారాయణ దేవుడు ఎలా అయ్యాడని చక్రి నిలదీస్తాడు. అక్కడితో నేటి పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


