Podarillu November 16 Episode: పొదరిల్లు.. కిచెన్‌లో చక్రి, మహా రొమాన్స్.. విడాకులు కావాల్సిందేనన్న మహా.. నారాయణ ఎమోషనల్

Podarillu Serial November 16th Episode: పొదరిల్లు సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్ లో కన్నాను నారాయణ కాపాడతాడు. ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. ఇటు చక్రి నుంచి విడాకులు కావాలని మహా తేల్చి చెప్పగా.. చక్రి మాత్రం రొమాన్స్ కలలు కంటుంటాడు.

Published on: Nov 16, 2026, 07:58:23 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగిపోయింది. బృందావనంలో తండ్రీ కొడుకులు ఎమోషనల్ కావడంతోపాటు.. ఆ కుటుంబంలో కలిసిపోతుందనుకున్న వేళ మళ్లీ విడాకులు కావాల్సిందే అని మహా పట్టుబట్టడం పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్లయింది.

పొదరిల్లు సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ నవంబర్ 16 ఎపిసోడ్

కన్నాను కాపాడిన నారాయణ

దీపావళి వేళ పటాకులు కాలుస్తూ కన్నా సంబరాలు చేసుకునే సీన్ తో సీరియల్ సోమవారం (నవంబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. అయితే ప్రమాదవశాత్తూ షాట్స్ పక్కకు ఒరగడంతో అవి కన్నావైపు దూసుకొస్తుంటాయి. అక్కడే ఉన్న నారాయణ వెళ్లి అతన్ని గట్టిగా పట్టుకొని అడ్డుగా నిలబడతాడు.

కన్నా గట్టిగా అరవడంతో అందరూ పరుగెత్తుకుంటూ వస్తారు. కానీ అప్పటికే నారాయణ వీపుకి చాలా గాయాలు అవుతాయి. కన్నాకు మాత్రం ఎలా గాయాలు కావు. అందరూ వచ్చి కన్నా, నారాయణను తీసుకెళ్తారు.

నారాయణకు గాయాలు.. క్లాస్ పీకిన మహా

కన్నాను లోనికి తీసుకెళ్లి చక్రి, మహా, మాధవ ఓదారుస్తుంటారు. తనకేమీ కాలేదని, ఆయనకే అయ్యాయని అంటాడు. కన్నాను పొదిగి పట్టుకోవడంతో ఏమీ కాన్నట్లుందని మహా అంటుంది. అటు తండ్రిని హాస్పిటల్ కు వెళ్దామని కేశవ అడుగుతాడు. ఈ మాత్రం దానికి అవసరం లేదని అతడు అంటాడు. నారాయణ వీపు నిండా గాయాలు కనిపిస్తాయి. మీరేమైనా సూపర్ మ్యానా అంటూ నారాయణకు మహా క్లాస్ పీకుతుంది.

ఏమనుకుంటున్నారు.. మీకు నలుగురు కొడుకులు ఉన్నారు.. ఒకరికి సమస్య వస్తే మరో ముగ్గురు చూసుకోరా అని అడుగుతుంది. వాళ్ల కంటే నా ముందు కదా అని నారాయణ అంటాడు. అయినా ఆ కన్నా మిమ్మల్ని తండ్రిగా కాదు కదా.. కనీసం మనిషిగా కూడా చూడటం లేదు.. అలాంటివాడికోసం ఇంత చేస్తారా అని నిలదీస్తుంది. కన్నా బయటకు వచ్చి ఇదంతా చూస్తున్నాడని గమనించి నారాయణకు కావాలని మరింత తిడుతుంది మహా.

ప్రాణమైనా ఇస్తానన్న నారాయణ.. కన్నా ఎమోషనల్

అటు నారాయణ కూడా వెనక్కి తగ్గడు. వాడికోసం ప్రాణాలైనా ఇస్తానంటాడు. అవసరమైతే అగ్నిగుండంలోనూ దూకుతానని అంటాడు. అది విన్న కన్నా ఎమోషనల్ అవుతాడు. వాడు నన్ను తండ్రిగా చూసినా చూడకపోయినా వాడు నా కొడుకు.. వాడిని కాపాడుకునే బాధ్యత నాపై ఉంది అని తేల్చి చెబుతాడు. దీంతో కన్నాతోపాటు అందరూ ఎమోషనల్ అవుతారు.

మహా మాత్రం కన్నాను గమనించి నారాయణకు క్లాస్ పీకుతూనే ఉంటుంది. ముందు హాస్పిటల్ కు వెళ్దాం పదా అని కేశవ అడిగినా కూడా నారాయణ రానంటూ మొండిగా కూర్చొంటాడు. తన దగ్గర ఆయింట్‌మెంట్ ఉందని, తీసుకొస్తానని మహా లోనికి వెళ్తుంది.

కన్నాకు మహా క్లాస్.. నీపై ప్రేమ కాదు పిచ్చి అంటూ..

అక్కడ కన్నా ఉండటం చూసి అతనికి క్లాస్ పీకుతుంది. చూశావా నువ్వు అతన్ని ఎంత హీనంగా చూసినా, కాలర్ పట్టుకున్నా నీపై తండ్రి ప్రేమ చూపించాడు.. నీపై అతనికి ఉన్నది ప్రేమ కాదు.. పిచ్చి.. బాధ్యత లేకుండా తిరిగాడని అన్నావ్. ఇంతకంటే బాధ్యత ఇంకేం ఉంటుంది.. అని కన్నాను మహా నిలదీస్తుంది. దీంతో కన్నా వెనక్కి తగ్గుతాడు. అయినా తన తల్లితో ఎలా వ్యవహరించాడో చూశారు కదా.. ఆమె వెళ్లిపోవడానికి ఆయనే కారణం కదా అంటాడు.

ఆయనే కారణమని ఎలా అంటావ్.. వాళ్ల మధ్య ఇంకా ఏమైనా కారణం ఉందేమో.. అయినా ఇలా అంటున్నానని మరోలా అనుకోకు.. మీ అమ్మకు మరో ప్రపంచం ఉంది.. దానిని చక్కదిద్దుకోవడానికే వెళ్లినట్లుంది.. ఇక్కడ ఉన్నప్పుడు కూడా నాలుగైదుసార్లు ఫోన్లో మాట్లాడటం చూశాను అని కన్నాకు వివరిస్తుంది.

నారాయణ కోసం కన్నా ఆయింట్‌మెంట్.. నారాయణ ఎమోషనల్

దీంతో కన్నా బాగా ఎమోషనల్ అవుతాడు. బయటకు వచ్చిన మహా తన దగ్గర ఉన్న ఆయింట్‌మెంట్ అయిపోయిందని చెబుతుంది. తాను వెళ్లి తీసుకొస్తానని కేశవ అంటే.. చక్రిని వెళ్లమంటుంది. అయితే అప్పుడే కన్నా వచ్చి తన దగ్గర ఉందని ఇస్తాడు. వెంటనే ఇది పెట్టండి లేదంటే గాయాలు మరింత ఎక్కువ అవుతాయి అని అంటాడు.

అసలు నీకు ఆయనంటేనే పడదు.. ఆయన కోసం ఎందుకురా ఆయింట్‌మెంట్ ఇస్తున్నావని మహా అంటుంది. నాకోసం ఇంత చేశాడు.. ఈమాత్రం చేయనా అని కన్నా అంటాడు. అది విన్న నారాయణ ఎమోషనల్ అవుతాడు. కన్నా తన గురించి ఆలోచించడం చూసి సంతోషిస్తాడు. తర్వాత కేశవ అతనికి ఆయింట్‌మెంట్ రాస్తాడు.

విక్కీ దగ్గరికి లక్కీ.. స్పెషల్ గిఫ్ట్ వద్దంటూ..

మరుసటి రోజు లక్కీ ఆఫీసులో పని చేసుకుంటూ ఉంటుంది. కానీ ఓ ప్రాజెక్టు విషయంలో ఆమె స్ట్రక్ అవుతుంది. అది ఎలా పూర్తి చేయాలో తెలియదు. దీంతో విక్కీ దగ్గరికి వెళ్తుంది. ఆమె తన సమస్య చెబుతుంటే విక్కీ మాత్రం ఆమెనే చూస్తుంటాడు. చివరికి ఆ సమస్యను విక్కీ పరిష్కరిస్తాడు. లక్కీ థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంటే.. నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చానంటూ ఓ కాస్ట్ లీ పర్ఫ్యూమ్ విక్కీ ఇవ్వబోతాడు. కానీ లక్కీ మాత్రం తీసుకోదు. మీరు ఇష్టంగా తీసుకొచ్చినంత మాత్రాన అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టొద్దు కదా అని చెప్పి వెళ్లిపోతుంది.

మహాకు లాయర్ ఫోన్.. విడాకులు కావాలన్న మహా

బయటకు వెళ్లగానే మహాకు లాయర్ ఫోన్ చేస్తాడు. ఆమెకు క్లాస్ పీకుతాడు. వెంటనే విడాకులు కావాలని చెప్పి.. ఇప్పటి వరకూ ఒక్క కౌన్సిలింగ్ కు కూడా రాలేదు.. ఓసారి మీరు బిజీ అంటారు.. మరోసారి మీ ఆయన బిజీ అంటాడు.. జడ్జి నన్ను తిడుతున్నాడు అని లాయర్ అంటాడు.

అసలు మీకు విడాకులు కావాలా వద్దా అని అడుగుతాడు. దీంతో మహా తనకు విడాకులు కావాల్సిందేనని తేల్చి చెబుతుంది. అలా అయితే ఎల్లుండి కౌన్సిలింగ్ కు కచ్చితంగా రావాలని లాయర్ అంటాడు. మీ ఆయనను కూడా తీసుకురావాలని అంటే.. వస్తామని మహా చెబుతుంది.

చక్రి రొమాన్స్ కలలు

మరోవైపు చక్రి మాత్రం ఇంట్లో రొమాన్స్ కలలు కంటుంటాడు. అతన్ని కన్నా, మాధవ కదిలిస్తారు. ఈ మధ్య మహా పూర్తిగా మారిపోయిందని, మన ఇల్లు, మన కుటుంబం అని మాట్లాడుతోందని, ఇద్దరం ఇక కలిసిపోయినట్లే అని చక్రి అంటాడు. అంతేకాదు కిచెన్ లో మహాతో రొమాన్స్ చేస్తున్నట్లు కూడా కలలు కంటుంటాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More