Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ లో ఓవైపు చక్రి ఫ్రస్ట్రేషన్, మరోవైపు తన జీవితంలో చక్రి ఎంత ప్రత్యేకమో మహా చెప్పే తీరు ఆసక్తి రేపుతాయి. అటు కేశవతో ఫైట్ చేసి అతనితో కలిసి వెళ్లిన శైలు బృందావనంలో పెద్ద రచ్చకు కారణమవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
తల్లి, అన్నతో శైలు గొడవ

శైలు అందంగా రెడీ అయ్యే సీన్ తో సీరియల్ శనివారం (నవంబర్ 28) ఎపిసోడ్ మొదలైంది. ఆమెను చూడగానే అన్న సురేష్ రెచ్చిపోతాడు. పొద్దున్నే ఎందుకు రెడీ అవుతున్నావ్.. ఎక్కడికెళ్తున్నావ్.. ఆ మెకానిక్ గాడి దగ్గరికేనా అని నిలదీస్తాడు. తాను కాలేజీకి వెళ్తున్నానని చెప్పినా వినడు. దీంతో అవును.. అతని దగ్గరికే వెళ్తున్నా.. ఇద్దరం కలిసి సినిమాకు వెళ్తున్నాం అని అంటుంది.
దీంతో తల్లి వరాలును పిలుస్తాడు సురేష్. పెళ్లికి ఒప్పుకోవడం లేదని వాడితో లేచిపోయి పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా అని అంటుంది. వెళ్లొద్దని అడ్డు పడటంతో సరే.. ఎస్సైకి ఫోన్ చేస్తాను అని శైలు బెదిరిస్తుంది. దీంతో ఏమీ చేయలేక ఆమెకు అడ్డు తొలగుతారు.
మహా మెసేజ్ చూసి మళ్లీ ఫీలైన చక్రి
అటు తాను కనబడుటలేదు అంటూ మహా క్రియేట్ చేసిన మెసేజ్ చూసి మరోసారి ఫీలవుతాడు చక్రి. ఇదేమైనా పద్ధతిగా ఉందా.. ఇంటికి రమ్మని పిలవడానికి ఇలాంటి మెసేజ్ పెడతారా.. కనిపించినా తీసుకురావద్దు అంటారా.. మరీ కామెడీ పీస్ లా తయారైంది నా బతుకు అని అనుకుంటాడు. మరోవైపు ట్రిప్ లో కస్టమర్ ఎంతకీ రాకపోవడంతో దాని తాలూకు ఫ్రస్ట్రేషన్ కూడా అతనిలో కనిపిస్తుంది.
లక్కీ ఫొటో చూసి మురిసిపోయిన విక్కీ.. స్టేటస్‌లో పెట్టి..
ఇటు ఆఫీసులో లక్కీని దూరం నుంచి చూస్తూ మురిసిపోతుంటాడు విక్కీ. నువ్వు నేరుగా వాచ్ ఇస్తే తీసుకోవనే.. ఇలా అందరికీ ముందు ఇచ్చి నీకు చివరికి ఇచ్చాను.. నేను గెలిచాను.. నిజానికి వాచ్ తీసుకొని నన్ను గెలిపించావ్ అని విక్కీ తనలో తాను అనుకుంటాడు. తర్వాత మహా ఫొటో చూస్తూ మురిసిపోతాడు. ఫొటోనే ఇంత బాగుంటే.. దీనిని స్టేటస్ లో పెడితే ఇంకెంత బాగుంటుందో అంటూ మహాతో కలిసి దిగిన ఫొటోను స్టేటస్ లో పెడుతూ రెడ్ హార్ట్, కిస్ ఎమోజీలు కూడా యాడ్ చేస్తాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటాడు.
స్టేటస్ చూసి చక్రి షాక్
{{/usCountry}}ఇటు ఆఫీసులో లక్కీని దూరం నుంచి చూస్తూ మురిసిపోతుంటాడు విక్కీ. నువ్వు నేరుగా వాచ్ ఇస్తే తీసుకోవనే.. ఇలా అందరికీ ముందు ఇచ్చి నీకు చివరికి ఇచ్చాను.. నేను గెలిచాను.. నిజానికి వాచ్ తీసుకొని నన్ను గెలిపించావ్ అని విక్కీ తనలో తాను అనుకుంటాడు. తర్వాత మహా ఫొటో చూస్తూ మురిసిపోతాడు. ఫొటోనే ఇంత బాగుంటే.. దీనిని స్టేటస్ లో పెడితే ఇంకెంత బాగుంటుందో అంటూ మహాతో కలిసి దిగిన ఫొటోను స్టేటస్ లో పెడుతూ రెడ్ హార్ట్, కిస్ ఎమోజీలు కూడా యాడ్ చేస్తాడు. ఇప్పుడు పర్ఫెక్ట్ గా ఉంది అనుకుంటాడు.
స్టేటస్ చూసి చక్రి షాక్
{{/usCountry}}ఇటు కస్టమర్ కోసం ఎదురు చూస్తూ ఫ్రస్ట్రేషన్ లో ఉన్న చక్రి.. అప్పుడే విక్కీ పెట్టిన స్టేటస్ చూస్తాడు. మహాలక్ష్మితో వీడు ఫొటో ఎందుకు దిగాడు.. దానిని స్టేటస్ లో పెట్టి ఇలా లవ్, కిస్ సింబల్స్ పెట్టడమేంటి.. నా భార్యకు అసలు వీడెవడు గిఫ్ట్ ఇవ్వడానికి అని అనుకుంటాడు. ఆ స్టేటస్ అతన్ని షాక్ కు గురి చేస్తుంది.
కేశవతో విజయవాడకు శైలు.. బైకుపై హంగామా
మరోవైపు విజయవాడ వెళ్లడానికి రెడీ అవుతున్న కేశవ దగ్గరకు శైలు వస్తుంది. తాను కూడా వస్తానని మొండికేస్తుంది. వద్దని కేశవ వారిస్తాడు. ఇప్పటికే మీ ఇంట్లో వాళ్లు గొడవ చేస్తున్నారు.. ఇప్పుడు నా వెంట వస్తే గొడవ మరింత పెద్దదవుతుంది.. వద్దు అని కేశవ తేల్చి చెబుతాడు. అయినా శైలు వినదు. కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే అని అంటుంది. దీంతో చేసేది లేక సరే అంటాడు. బైకుపై వెళ్తూ శైలు హంగామా చేస్తుంది. కూర్చోకుండా గాల్లోకి లేస్తూ చున్నీ ఎగరేస్తూ తెగ మురిసిపోతుంది. కేశవ వద్దని చెబుతున్నా వినదు.
నారాయణకు బాధ చెప్పుకున్న చక్రి.. విక్కీ గురించి చెప్పి..
ఇటు చక్రి ఇంటికి వస్తాడు. ఇంట్లో ఎవరూ కనిపించరు. దీంతో చిరాగ్గా హాల్లో కూర్చొంటాడు. ఆ స్టేటస్ గురించే ఆలోచిస్తుంటాడు. అప్పుడే నారాయణ భోజనం చేస్తూ చక్రి దగ్గరికి వస్తాడు. ఈ ఇంట్లో తన గురించి పట్టించుకునే వాడే లేడు.. తన బాధ ఎవరికీ పట్టదు.. మహాను దగ్గర చేయడానికి ఒక్కడూ రాలేదు కానీ ఇప్పుడు దూరం చేయడానికి మాత్రం అందరూ తయారయ్యారు.. ఇక్కడ మీరు.. అక్కడ వాడు అని చక్రి అంటాడు.
వాడెవడు అని నారాయణ అడిగితే.. విక్కీ గురించి చెబుతాడు. నా భార్యపై వాడికి ఏదో ఆసక్తి ఉన్నట్లు కనిపిస్తోంది.. ఆమెతో చనువుగా ఉంటున్నాడు అని చక్రి అనడంతో వాడి పళ్లు రాలగొట్టి రాకపోయావా అని నారాయణ అంటాడు. పైగా ఇప్పుడు ఆమెతో దిగిన ఫొటోను స్టేటస్ లో పెట్టి లవ్, కిస్ సింబల్స్ పెట్టాడని దానిని చూపిస్తాడు. చక్రి ఏదేదో వాగుతూ తన ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తూ ఉంటే.. నారాయణ మెల్లగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతాడు.
టీ షాపు దగ్గర శైలుని వదిలేసి వెళ్లిన కేశవ
అటు విజయవాడ లాంగ్ ట్రిప్ కు వెళ్తూ ఓ టీ షాపు దగ్గర ఆగుతారు కేశవ, శైలు. టీ తాగిన తర్వాత బైకు ఎక్కడానికి వస్తారు. కానీ శైలు తన బ్యాగు మరచిపోవడంతో తిరిగి వెళ్తుంది. ఆమె బైకు ఎక్కిందనుకొని కేశవ అలాగే వెళ్లిపోతాడు. బ్యాగు తీసుకొని వచ్చి కేశవను శైలు పిలిచినా అతడు పట్టించుకోకుండా వెళ్తాడు. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత తన వెనుక శైలు లేదని గమనిస్తాడు. అప్పటికే శైలు మరో బైకుపై లిఫ్ట్ అడిగి వస్తుంది. కేశవకు క్లాస్ పీకుతుంది.
చక్రి గిఫ్ట్ చాలా స్పెషల్ అన్న మహా
ఆఫీసులో దివ్యతో కలిసి మహా కెఫేకి వెళ్తుంది. అక్కడికి విక్కీ వస్తాడు. మాట కలుపుతాడు. అదే సమయంలో మహా చేతికి పాత వాచ్ ఉండటం చూసి తాను ఇచ్చిన బ్రాండెడ్ వాచ్ ఉండగా.. ఇదెందుకు.. ఇది బాలేదు.. పాత మోడల్ లా ఉంది అని అంటాడు. ఈ గిఫ్ట్ తనకు చాలా స్పెషల్ అని మహా అంటుంది. చక్రి తనకు ఈ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంది. అయినా గిఫ్ట్ ఇవ్వడం వరకే మీ పని.. దానిని ఎప్పుడు పెట్టుకోవాలో నా ఇష్టం.. ఏదైనా ఈవెంట్ ఉంటే పెట్టుకుందామని ఆగాను అని మహా చెప్పడంతో విక్కీ బిక్కమొహం వేసుకొని వెళ్లిపోతాడు.
శైలు కనిపించక వరాలు రచ్చ
అటు కేశవతో కలిసి శైలు విజయవాడలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇటు ఇంట్లో ఆమె కనిపించకపోవడం, ఫోన్ కూడా స్విచాఫ్ కావడంతో తన భర్తను పిలుస్తుంది వరాలు. వాడితో కలిసి లేచిపోయినట్లుంది అని అంటుంది. వాడి ఇంటికే వెళ్లి తేల్చుకుందామంటూ తన భర్త, కొడుకుతో కలిసి కేశవ ఇంటికి వెళ్తుంది. మీవాడు తన కూతురిని లేపుకెళ్లాడని రచ్చ చేస్తుంది. విజయవాడ వెళ్లాడని మాధవ చెప్పడంతో దుర్గమ్మ సాక్షిగా మూడు ముళ్లు వేసి ఉంటాడని వరాలు ఏడుస్తుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHOR
హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.