Podarillu October 1 Episode: పొదరిల్లు.. మహా షాకింగ్ నిర్ణయం.. చక్రికి మరో పెళ్లి.. ఇంట్లో వాళ్లూ సై.. మైండ్ బ్లాక్
Podarillu Serial October 1st Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 1 ఎపిసోడ్ లో చక్రికి దిమ్మదిరిగే షాకిస్తుంది మహాలక్ష్మి. తమ పెళ్లి చెల్లదని, గోపికతో నీ పెళ్లి జరిపిస్తానని చెప్పి ఆమె ఇంటికి వెళ్తుంది. దీంతో చక్రి ఏం చేయాలో తోచక తలపట్టుకుంటాడు.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా సాగింది. గోపిక ఫ్రెండ్స్ వచ్చి చక్రికి వార్నింగ్ ఇస్తారు. ఇది చాలదన్నట్లు మహాలక్ష్మి కూడా అతనికి క్లాస్ పీకుతుంది. గోపికతో నీ పెళ్లి జరిపిస్తాను.. నేను వెళ్లిపోతాను అనడంతో చక్రి మైండ్ బ్లాకవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

శ్రీమతి కుమారిగారు అంటూ మహాకు చక్రి క్లాస్..
తాను ఏ తప్పూ చేయలేదని చక్రి వాదించే సీన్ తో సీరియల్ గురువారం (అక్టోబర్ 1) ఎపిసోడ్ మొదలువుతుంది. అసలు మహాలక్ష్మిగారితో తన పెళ్లే జరగలేదని, కావాలంటే ఆ విషయం ఆమెనే చెప్పమనండి అంటూ మాధవతో చక్రి వాదిస్తాడు. ఏమండీ పెళ్లయిన శ్రీమతి కుమారిగారు అంటూ మహాకు కూడా చక్రి క్లాస్ పీకుతాడు.
ఓ అపరిచితుడితో కొన్నాళ్లపాటు ఇంట్లో కలిసి ఉన్నంత మాత్రాన పెళ్లయిపోయినట్లు మీరు మనస్ఫూర్తిగా భావిస్తున్నారా అని వెటకారంగా అడుగుతాడు. మీరు గీసుకున్న లక్ష్మణ రేఖ దాటి ఒక అడుగు ముందుకు వేయగలరా అని అంటాడు. చక్రి ఇంత మాట్లాడుతున్న మహా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతుంది. దీంతో ఇంత నటించినా ఏమీ మాట్లాడలేదేంటి అని చక్రి అనుకుంటాడు.
ఇంటికి గోపిక ఫ్రెండ్స్.. చక్రికి వార్నింగ్
గదిలోకి వెళ్లిన మహా.. చక్రి అన్న మాటలను తలుచుకొని బాధపడుతుంది. అదే సమయంలో చక్రి ఇంటికి గోపిక ఫ్రెండ్స్ వస్తారు. గోపికను ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు.. ఎందుకు ఆమెకు పెళ్లయిన విషయం చెప్పలేదు.. ఎందుకు ఆమెతో చాట్ చేశారు అని నిలదీస్తారు.
దీంతో తాను ఎప్పుడూ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పలేదని, ఆమె ఎప్పుడైతే బాయ్‌ఫ్రెండ్ అని చెప్పిందో అప్పుడే దూరంగా జరిగానని, అయినా ఆమె ఫోన్ నంబర్ తాను అడిగానా అని చక్రి అంటాడు. అదంతా అనవసరం.. ఇప్పుడు గోపిక గదిలోకి వెళ్లి తలుపు తీయడం లేదు.. ఆమెకు ఏదైనా జరిగితే నిన్ను వదలం అని వార్నింగ్ ఇస్తారు. దీంతో కేశవ వాళ్లను తిడతాడు. అయినా సరే వాళ్లు మాత్రం చక్రికి వార్నింగ్ ఇచ్చి వెళ్తారు.
చక్రికి ఇంట్లో వాళ్ల క్లాస్.. మహా షాకింగ్ నిర్ణయం..
వాళ్లు వెళ్లిపోయిన తర్వాత చక్రికి మాధవ మరోసారి క్లాస్ పీకుతాడు. నీకు పెళ్లయిందని చెప్పలేదు కాబట్టే ఇంత వరకూ వచ్చిందని అనడంతో మరోసారి పెళ్లయిందని అనకు అని చక్రి అంటాడు. మళ్లీ మహాను కెలకడంతో ఇక ఆమె రెచ్చిపోతుంది. అవును మనకు జరిగింది అసలైన పెళ్లి కాదు.. ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిందో మనకు తెలుసు.. ఆ విషయం నేను చెబుతాను.. పెళ్లి సర్టిఫికెట్ కూడా చూపిస్తాను.. అంతేకాదు త్వరలోనే విడాకులు కూడా తీసుకుంటున్నామని చెబుతాను.. కానీ మీకు కాదు గోపికకు చెబుతాను అనడంతో అందరూ షాకవుతారు.
మీ అత్త పెట్టిన శాపం నిజం కాకూడదని చెప్పడానికే ఈ ఇంట్లో ఉన్నాను.. మనం పెళ్లి చేసుకున్న అపరిచితులం.. ఈ ఇంటికి అతిథిగా వచ్చాను.. అతిథిగానే వెళ్లిపోతాను.. పెళ్లి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో మీకు తెలుసు పెద్ది.. పోలీసుల ముందు కమిట్ అయిపోయాము కాబట్టి భార్యాభర్తలుగా కలిసి ఉంటున్నాం.. ఇదే విషయం గోపికకు చెబుతాను.. ఆమెతోపాటు వాళ్ల అమ్మానాన్నలను కూడా ఒప్పిస్తాను.. మీ పెళ్లి నేను దగ్గరుండి జరిపించి వెళ్లిపోతాను.. ఈ గండం నుంచి మిమ్మల్ని బయటపడేస్తాను.. అక్కడ ఆమె గదిలో నుంచి రావడం లేదంటేనే మీకు ఇక్కడ తడిసిపోయింది.. ఈ విషయం నేను చూసుకుంటాను.. మీరు మీ ప్రేమను కొనసాగించండి అని మహా అంటుంది. అంత పని చేయొద్దు.. నేనే గోపికతో మాట్లాడుకుంటాను అని చక్రి వెళ్లిపోతాడు. అతన్ని తీసుకురా.. నేను మాట్లాడుతుంటే అలా వెళ్లిపోతాడేంటి అని కన్నాకు చెప్పి పంపిస్తుంది.
అదిరిన మహా నాటకం.. ఇంట్లో వాళ్ల సపోర్ట్
చక్రి బయటకు వెళ్లగానే మహా నవ్వుతుంది. ఎలా ఉంది నా నాటకం అని పెద్ది, కేశవ, నారాయణలను మహా అడుగుతుంది. దీంతో వాళ్లు షాకవుతారు. ఇంతసేపూ మహా చేసింది డ్రామా అని అర్థమవుతుంది. చక్రికి బుద్ధి చెప్పడానికే ఇలా చేసిందని తెలుసుకొని అందరూ ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఇంతలో కన్నా వెళ్లి చక్రిని తీసుకొస్తాడు.
మీరు ఎక్కడికి వెళ్తున్నారు.. నేనే వెళ్లి గోపికను తీసుకొస్తాను.. మీ ప్రేమ నా వల్ల బ్రేకప్ కావడం ఇష్టం లేదని మహా అంటుంది. చక్రి వద్దంటున్నా ఇంట్లో వాళ్లు కూడా మహాకే సపోర్ట్ చేస్తారు. కన్నాను తీసుకొని గోపిక దగ్గరికి వెళ్తుంది మహా. మీ కొత్త మరదలితో వస్తాను.. అంతలోపు ఇళ్లంతా శుభ్రం చేయండి అని పెద్దితో చెబితే అతడూ సరే అంటాడు.
వద్దన్న కన్నా.. క్లాస్ పీకిన మహా
బయటకు వెళ్లిన తర్వాత నిజంగానే గోపిక దగ్గరికి వెళ్తున్నామా.. ఇదంతా కేవలం అన్నయ్యను భయపెట్టడానికే కదా.. ఓ నాలుగు రౌండ్లు బయట తిరిగి ఇంటికి వెళ్లిపోదాం అని కన్నా అంటాడు. లేదు నిజంగానే గోపిక దగ్గరికి వెళ్దాం.. ఆమెకు జరిగిన విషయం చెబుదామని అనడంతో కన్నా బండి ఆపేసి తాను రానని అంటాడు.
దీంతో మహా అతనికి క్లాస్ పీకుతుంది. మీ అన్నయ్యను నేను నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకొని ఉంటే నువ్వు ఇలాగే చేసేవాడివా.. అతడు మరో అమ్మాయిని చూస్తుంటే ఆమెకు అతని నంబర్ ఇచ్చేవాడివా.. ఆడవాసన తగలని ఆ ఇంటికి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసేవాళ్లా.. మీ అన్నదమ్ములు చందాలు వేసుకొని వాళ్లను హనీమూన్ కు పంపించే వాళ్లా.. పెద్ది తప్ప ఇంట్లో వాళ్లంతా మోసగాళ్లే అంటూ క్లాస్ పీకుతుంది.
గోపిక ఇంటికి మహా
మరోవైపు ఇంట్లో మహా చెప్పినట్లే పెద్ది, కేశవ శుభ్రం చేస్తుంటారు. చక్రి వద్దని వారిస్తున్నా వినరు. అటు గోపిక ఇంటికి వెళ్తుంది మహా. ఆమెను బయటకు రమ్మని బతిమాలినా రాదు. చివరికి మహా వెళ్లి పిలవడంతో మెల్లగా బయటకు వస్తుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


