Podarillu October 24 Episode: పొదరిల్లు.. మహాకు షాకింగ్ నిజం చెప్పిన నారాయణ.. సుపుత్రుడిని దేవుడిలా చూసి.. కన్నాపై జాలి

Podarillu Serial October 24th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 24 ఎపిసోడ్ లో జమునతోపాటు నారాయణ కూడా కన్నా గురించి ఓ షాకింగ్ నిజాన్ని మహాకు చెబుతారు. అది విన్న తర్వాత సుపుత్రుడిని ఓ దేవుడిలా చూస్తుంది మహాలక్ష్మి.

Published on: Oct 24, 2026, 07:23:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కన్నా పుట్టుక గురించి మహాకు దిమ్మదిరిగే నిజం తెలవడం, దాని చుట్టూ ఉన్న ట్విస్టులను చూపించింది. కన్నా నారాయణ కన్న కొడుకు కాదన్న నిజం తెలుసుకున్న మహా.. అతన్ని నిలదీస్తుంది. అతడు కూడా కన్నా అసలు ఎవరు, ఎలా వచ్చాడన్న విషయాలు వివరిస్తాడు.

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 24 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 24 ఎపిసోడ్

కన్నాను పట్టించుకోని ఇంట్లో వాళ్లు

కన్నాను ఇంట్లో వాళ్లు పట్టించుకోకుండా వెళ్లిపోయే సీన్ తో సీరియల్ శనివారం (అక్టోబర్ 24) ఎపిసోడ్ మొదలైంది. వెజ్ పులావ్ చేసుకుందామని అందరూ డిసైడవుతారు. మహా తనకు పని ఉందని వెళ్లిపోతుంది. కేశవ, మాధవ, చక్రి తలా ఓ దిక్కుకు వెళ్లిపోవడంతో కన్నా మరింత బాధపడతాడు.

జమునను నిలదీసిన మహా..

బయటకు వెళ్లిన మహాకు జమున కనిపిస్తుంది. దీంతో ఆమెను అడ్డగిస్తుంది. నిలదీస్తుంది. అసలు ఇంటికి ఎందుకు వచ్చారు? ఎందుకు వెళ్లిపోయారు? మీకోసం వచ్చిన ఆ వ్యక్తి ఎవరు? కన్న కొడుకును 20 ఏళ్ల తర్వాత చూసి కూడా ఎందుకలా వదిలేసి వచ్చారు? కన్న కొడుకు ఇంట్లోనే డబ్బు దొంగతనం చేయాలని ఎలా అనిపించింది? మీరు వచ్చిన రోజు కూడా కన్నాపై కంటే కూడా డబ్బుపైనే ఎక్కువ మక్కువ చూపించడం గమనించాను.. ఆ డబ్బేమీ లక్షల కొద్దీ బ్యాంకుల్లో దాచుకొని తెచ్చింది కాదు.. అందరూ ఒక్కో రూపాయి కష్టపడి సంపాదించిన డబ్బు.. అలాంటి డబ్బును ఎందుకు దొంగతనం చేయాలని అనుకున్నారు అని మహా నిలదీస్తుంది.

నీకు నిజం చెప్పాల్సిన అవసరం లేదు.. అయినా చెప్పకపోతే ఏం చేస్తావ్ అని జమున ముందు బుకాయిస్తుంది. మిమ్మల్ని దోషిగా నిలబెట్టాలనుకుంటే ఇప్పటికే ఇంట్లో వాళ్లందరినీ పిలిచి అసలు నిజం చెప్పేసేదాన్ని.. అసలు కన్నాను ఎందుకు వదిలేసి వచ్చారు.. మీ వెంట ఉన్న ఆ వ్యక్తి ఎవరు అని మరోసారి మహా అడుగుతుంది.

నిజం చెప్పేసిన జమున

దీంతో జమున అసలు విషయం చెబుతుంది. నేను కలిసి ఉంటున్న వ్యక్తి నా భర్త.. ఊరి నిండా అప్పులు చేశాడు.. అతని అప్పులు తీర్చడానికే నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. అయినా 20 ఏళ్ల తర్వాత నేను మళ్లీ వచ్చానంటే అది కన్న కొడుకుపై ప్రేమతో అని ఎలా అనుకున్నారు.. ఇన్నేళ్లు ఆ కన్నప్రేమ అలాగే ఉంటుందని ఎలా అనుకున్నారని ప్రశ్నిస్తుంది.

మరి నారాయణ మిమ్మల్ని ఎందుకు అంతలా ద్వేషిస్తున్నాడు.. మీరు వెళ్లిపోయినప్పటి నుంచీ కన్నా నారాయణనే నిందిస్తున్నాడు అసలేం జరిగిందని మహా అడుగుతుంది. దీంతో కన్నా అసలు నారాయణ కన్న కొడుకు కాదు అని చెప్పడంతో మహా షాక్ తింటుంది. ఇంతకంటే ఇక నిజాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు.. ఇంకా ఏమైనా కావాలంటే వెళ్లి ఆ నారాయణనే అడుగు అని చెప్పి వెళ్లిపోతుంది.

గుడిలో నారాయణను నిలదీసిన మహా

ఆ షాక్ లో మహా ఇంటికి వెళ్తుంది. అప్పటికే అక్కడ నారాయణతో కన్నా గొడవ పడుతుంటాడు. నీ వల్లే మా అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.. వదిన మాట్లాడటం లేదు అంటాడు. నారాయణ ఏమీ పట్టించుకోడు. మహా వచ్చి నారాయణను బయటకు తీసుకెళ్తుంది. నేరుగా గుడికి వెళ్లడంతో అతడు భయపడతాడు. అసలు ఏం జరిగింది? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడుగుతాడు.

గుళ్లో దేవుడికి రోజూ అభిషేకాలు చేస్తారు.. నిజరూప దర్శనాలు చేస్తారు.. కానీ మీరు నిజంగానే దేవుడు అని నారాయణను పొగుడుతుంది మహా. దీంతో అతడు షాకవుతాడు. ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతాడు. అసలు కన్నా ఎవరు? అతనికి కన్న తండ్రి ఎవరు? జమునను కలిశాను? అసలు ఆమె ఎవరు? ఎందుకు ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది అని అడుగుతుంది. ఆ నిజం ఇన్నాళ్లూ తన కన్న కొడుకులకు కూడా తెలియదని, ఇప్పుడు కూడా నీకు తప్ప మరెవరికీ తెలియకూడదని చెప్పడం మొదలు పెడతాడు.

జమున గురించి నిజం చెప్పిన నారాయణ

కన్నా నా కన్న కొడుకు కాదు.. నేను లారీ నడిపే రోజుల్లో దేశమంతా తిరిగేవాడిని.. అలా గుజరాత్ వెళ్లినప్పుడు ఓ హోటల్లో దానిని నడిపే జమునాబాయి పరిచయం అయింది.. ఆమె భర్త గోవిందు.. అప్పటికే వాళ్లకు కన్నా జన్మించాడు.. గోవిందు చనిపోయిన తర్వాత జమున ఒంటరిదైంది.. ప్రతి ఒక్కరూ ఆమెను అనుభవించాలని చూసేవాళ్లు.. అలాంటి పరిస్థితుల్లో నేను జమునను తీసుకొచ్చాను..

చిన్న వాళ్లయిన నా కొడుకులకు ఆ నిజం చెప్పినా అర్థం కాదు.. ఈ సమాజం కూడా అర్థం చేసుకోలేదు.. దీంతో ఆమెను నా భార్యగా.. కన్నాను నా కొడుకుగానే చూశారు.. నేను ఆమెను పెళ్లి చేసుకోలేదు.. ఆశ్రయం ఇచ్చానంతే.. కానీ ఒకరోజు ఇక్కడ ముకేష్ అనే వాడు పరిచయం అయ్యాడు.. వాడి కోసం, ఆమె సుఖం కోసం నెలల పసివాడిని వదిలేసి వాడితో వెళ్లిపోయింది.. అందుకే ఆమెంటే నాకు అంత కోపం.. అప్పటి నుంచి కన్నాను నా కొడుకులతో సమానంగా నేను పెంచుతున్నాను అని నారాయణ చెబుతాడు.

కన్నాకు నిజం చెప్పొద్దన్న నారాయణ

అదంతా విన్న మహా బాగా ఎమోషనల్ అవుతుంది. ఆమె కోసం ఇంటికి వచ్చిన వ్యక్తి ఆ ముకేషే అని అనుకుంటుంది. కానీ జమున అతని కోసం డబ్బు దొంగతనం చేయడానికి ప్రయత్నించిన విషయం మాత్రం నారాయణకు చెప్పదు. అటు నారాయణ కూడా ఈ నిజం కన్నాకు చెప్పొద్దని అంటాడు. ఇప్పటికే తల్లి వదిలేసి వెళ్లింది.. నేను కూడా కన్న తండ్రిని కానని తెలిస్తే తనను తాను ఓ అనాథగా అనుకుంటాడు అని అంటాడు.

అది విన్న మహా మరింత ఎమోషనల్ అవుతుంది. అతని చేతిని మొక్కుతూ.. మీరు నిజంగానే దేవుడు.. మీరెక్కడ.. మేమెక్కడ.. మీరు చాలా గొప్పవాళ్లు అని కంటతడి పెడుతుంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా నారాయణను ఎక్కడికి తీసుకెళ్లారు.. మీరేదో దాస్తున్నారు అని చక్రి అడిగినా కూడా మహా నిజం చెప్పదు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More