Podarillu October 16 Episode: పొదరిల్లు.. జమున రెండో భర్తను వెంటాడిన నారాయణ.. తప్పు తెలుసుకున్న మహా.. కన్నా గొడవ

Podarillu Serial October 16th Episode: పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 16 ఎపిసోడ్ లో కేశవకు ఇంట్లో వాళ్లందరూ సాయం చేస్తారు. ఆ డబ్బుపై కన్నేసిన జమున తన రెండో భర్తకు విషయం చెప్పగా అతడు నేరుగా ఇంటికే వస్తాడు. దీంతో నారాయణ అతని వెంట పడతాడు.

Published on: Oct 16, 2026, 08:40:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ బృందావనంలో అన్నదమ్ముల ప్రేమలు, ఆప్యాయతలను మరోసారి కళ్లకు కట్టడంతోపాటు జమున దొంగ బుద్ధిని కూడా కళ్లకు కట్టింది. అయితే ఎపిసోడ్ చివర్లో జమున రెండో భర్త ఏకంగా ఇంటికే రావడం, నారాయణ అతన్ని కొట్టడానికి వెళ్లడం కూడా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది.

పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 16 ఎపిసోడ్
పొదరిల్లు సీరియల్ అక్టోబర్ 16 ఎపిసోడ్

మహా మారిపోయిందన్న చక్రి

జమునతో ఏం చెప్పారని మహాను చక్రి అడిగే సీన్ తో సీరియల్ శుక్రవారం (అక్టోబర్ 16) ఎపిసోడ్ మొదలైంది. మాధవ కంటే ముందే ఎందుకు పెళ్లి చేసుకున్నారని అడిగితే తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని చెప్పానని మహా అంటుంది. దీంతో చక్రి తెగ మురిసిపోతాడు. మీరు మారిపోయారు అని అంటాడు. అంతగా మురిసిపోకు ఆమె సడెన్ గా అడిగేసరికి అలా చెప్పానని మహా అంటుంది.

ఇప్పుడు వెళ్లి అదంతా అబద్ధం.. మేము పెళ్లి చేసుకోలేదు.. అయినా ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకుంటున్నాం అని చెప్పాలా అని అనడంతో వద్దులే అని చక్రి వెళ్లిపోతాడు. లోనికి వెళ్లిన తర్వాత అసలు నేను ప్రేమ పెళ్లి అని ఎందుకు అబద్ధం చెప్పానని మహా కూడా ఆలోచనలో పడుతుంది.

తాను అనాథనని మహాకు చెప్పిన జమున.. అతనెవరంటూ..

మరుసటి రోజు ఉదయం జమున బయటకు వెళ్లి ఫోన్ మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. అప్పుడే మహా వచ్చి పలకరిస్తుంది. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నారని అడుగుతుంది. తనకు ఎవరూ లేరని, తాను ఓ అనాథనని జమున అంటుంది.

మరి ఎవరూ లేనప్పుడు ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్లారని మహా అడిగితే.. నారాయణ పెట్టే హింస భరించలేక వెళ్లినట్లు చెబుతుంది. ఇన్నాళ్లూ ఎక్కడున్నారని అడిగితే.. ఓ పెద్దావిడ దగ్గర పని చేస్తున్నానని అంటుంది. మరి చక్రి మీతోపాటు మరో వ్యక్తిని చూశానని చెప్పాడని నిలదీస్తుంది. అతడు ఆ పెద్దావిడ దగ్గరికి వచ్చిన వ్యక్తి అంతే.. అంటూ అబద్ధం చెప్పి జమున వెళ్లిపోతుంది.

షాపు కోసం మాధవ, చక్రి, మహా సాయం.. కేశవ ఎమోషనల్

ఆ తర్వాత కేశవ షాపు గురించి మాధవ అడుగుతాడు. డబ్బు సర్దుబాటు కాలేదు కదా అని అతడు అంటే.. తన దగ్గర ఉన్న రూ.2 లక్షలు ఇస్తాడు మాధవ. ఆ తర్వాత చక్రి కూడా వెళ్లి తాను తీసుకున్న రూ.1.5 లక్షల అడ్వాన్స్ ఇస్తాడు. తాను వేసిన చిట్టీ తీసుకుంటే మరో రూ.1.2 లక్షలు వచ్చాయని కేశవ చెబుతాడు. అవన్నీ లెక్కలు రాసి ఎంతయ్యాయో చెప్పమని కన్నాను అడుగుతాడు మాధవ. కన్నా రాస్తాడు. చివరికి మహా తీసుకొని తాను మరో రూ.1.5 లక్షలు ఇస్తున్నట్లు చెబుతుంది. అది విని కేశవ ఎమోషనల్ అవుతాడు.

నీకు సాయం చేయడానికి వదిన ఫ్రీలాన్స్ జాబ్ చేస్తూ రేయింబవళ్లు కష్టపడుతుందని కన్నా చెబుతాడు. నువ్వెందుకు నీ డబ్బు ఇస్తావమ్మా అని మాధవ అంటే.. నేనూ ఈ ఇంటి మనిషినే అని మహా అంటుంది. కేశవ కంటతడి పెడుతూ బయటకు వెళ్తాడు. నీలో వాడు మా అమ్మను చూసుకున్నాడు అని చక్రి చెప్పడంతో మహా వెళ్లి కేశవను ఓదారుస్తుంది.

కేశవ డబ్బు, కన్నా ఉంగరంపై జమున కన్ను

అప్పటి వరకూ కిచెన్ లో ఉన్న జమున.. ఇక్కడ చాకిరీ చేయడం తప్ప ఏమీ దక్కేలా లేదని లోలోపల విసుక్కుంటూ ఉంటుంది. కేశవ కోసం అందరూ చేస్తున్న సాయం విని తన పంట పండిందని అనుకుంటుంది. అన్నీ లెక్కలు వేయగా రూ.6.2 లక్షలు అవుతాయి. మరో రూ.30 వేలు తక్కువయ్యాయని అనడంతో తన ఉంగరం తీసుకోమన్నాను కదా అని కన్నా అంటాడు. వీడి దగ్గర ఉంగరం కూడా ఉందా.. అదెక్కడ దాచాడో అని జమున అనుకుంటుంది.

కేశవకు నారాయణ కూడా సాయం

నీ ఉంగరం అవసరం లేదు.. నేను అడ్వాన్స్ తీసుకుంటానని చక్రి అంటాడు. ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుంటానని కేశవ.. తానే తీసుకొస్తానని మాధవ అంటారు. చివరికి నారాయణ వస్తాడు. లోనికి వెళ్లి తాను దాచుకున్న డబ్బు తీసుకొచ్చి మహాకు ఇచ్చి లెక్కబెట్టమంటాడు. రూ.30505 ఉంటాయి. ఆ రూ.500 తనకు సాయంత్రం మందుకు కావాలని, ఆ రూ.30 వేలు వాడికి ఇవ్వు అని చెప్పి నారాయణ వెళ్లిపోతాడు. అది చూసి కేశవ మరింత ఎమోషనల్ అవుతాడు. ఈ తాగుబోతు సచ్చినోడు కూడా డబ్బు దాస్తున్నాడా అని జమున అనుకుంటుంది.

జమునపై మహాకు అనుమానం.. ఫోన్‌లో ఎవరంటూ నిలదీసి..

అందరూ హాల్లో టేబుల్ పై తమ దగ్గరున్న డబ్బును పెడతారు. జమున కిచెన్ లో నుంచి ఆ డబ్బునే చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. మహా అప్పుడే జమునను చూస్తుంది. ఆమె ముఖం చూసి అనుమానం మొదలవతుంది. మహాను చూసి జమున కిచెన్ లో మళ్లీ పని చేసినట్లు నటిస్తుంది. తర్వాత బయటకు వెళ్లి తన రెండో భర్తకు ఫోన్ చేసి ఇంట్లో జరిగింది చెబుతుంది. రేపు ఉదయం కల్లా ఆ డబ్బు తీసుకొస్తానని, ఇద్దరం కలిసి ఉడాయిద్దామని అంటుంది.

ఫోన్ పెట్టేయగానే మహా వెనుక ఉండటం చూసి షాక్ తింటుంది. ఫోన్ లో ఎవరు అని మహా నిలదీస్తుంది. కస్టమర్ కేర్ అని జమున చెబితే.. దానికి ఇంతసేపు మాట్లాడతారా అని అడుగుతుంది. జమున సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో మహాలో అనుమానం మొదలవుతుంది.

అనుమానం మరింత పెంచిన నారాయణ

అప్పుడే నారాయణ కూడా అక్కడికి వస్తాడు. ఏం జరిగిందని అడిగితే మహా ఏమీ చెప్పదు. పామును ఇంట్లో తెచ్చి పెట్టావు జాగ్రత్త.. నువ్వు జాగ్రత్త.. ఇల్లు జాగ్రత్త.. కన్నా జాగ్రత్త అని చెబుతాడు. అసలు ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందా.. మీరు పంపించేశారా అని మహా అడుగుతుంది. నా మొదటి భార్యను చంపానని కూడా అన్నారు.. అవన్నీ నేను పట్టించుకోను.. నేను నాలాగే ఉంటాను.. కానీ దానితో జాగ్రత్త అని నారాయణ అనడంతో మహా ఆలోచనలో పడుతుంది. నేను ఆమెను తీసుకొచ్చి నిజంగానే తప్పు చేశానా.. ఆ తప్పు త్వరలోనే నాకు తెలియబోతోందా అని మనసులో అనుకుంటుంది.

రెండో భర్తతో దొరికిపోయిన జమున

ఆ తర్వాత డబ్బు కోసం జమున ఇంట్లో బ్యాగులు వెతుకుతూ ఉంటుంది. అప్పుడే రెండో భర్త ఫోన్ చేస్తాడు. ఇంటి ముందే ఉన్నానని చెప్పడంతో ఆమె కంగారు పడుతూ పరుగెత్తుకెళ్లి.. ఆ నారాయణ చూస్తే చంపేస్తాడని అంటుంది. అప్పుడే నారాయణ బయట నుంచి వస్తుంటాడు. జమునను అతనితో చూసి వెంట పడతాడు. అతడు ఇంట్లో పరుగెత్తుతాడు. నారాయణ అతని వెంట పడటం, అది చూసి కన్నా కూడా గొడవ పడటానికి నారాయణ వెంట పరుగెత్తుతాడు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More