Podarillu September 2 Episode: పొదరిల్లు.. పెద్దికి పెళ్లి చూపులు.. విడాకుల మాట విని అందరూ షాక్.. చక్రితో ఆడుకున్న మహా

Podarillu Serial September 2nd Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 2 ఎపిసోడ్ లో కొత్త లవర్ గోపిక పేరు చెప్పి మహాను ఉడికించాలని చూసిన చక్రితో ఆమె ఆడుకుంటుంది. అటు విడాకుల అమ్మాయితో పెద్ది పెళ్లి చూపుల సీన్ అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

Published on: Sep 2, 2026, 08:04:45 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ కాస్త ఎమోషనల్ గా, మరికాస్త ఫన్నీగా సాగిపోయింది. తన కొత్త లవర్ గోపిక సోషల్ మీడియా ప్రొఫైల్ దొరికిందంటూ మహాను ఉడికించాలని చక్రి ప్రయత్నిస్తాడు. కానీ అది కాస్తా రివర్స్ అవుతుంది. అటు తన పెళ్లి విషయంలో డైలమాలో ఉన్న పెద్ది.. ధైర్యం చేసి పెళ్లి చూపులకు రెడీ అవుతాడు. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ ఎదురవుతుంది.

Podarillu September 2 Episode: పొదరిల్లు.. పెద్దికి పెళ్లి చూపులు.. విడాకుల మాట విని అందరూ షాక్.. చక్రితో ఆడుకున్న మహా
Podarillu September 2 Episode: పొదరిల్లు.. పెద్దికి పెళ్లి చూపులు.. విడాకుల మాట విని అందరూ షాక్.. చక్రితో ఆడుకున్న మహా

మహా కట్టిన రాఖీని విసిరికొట్టిన ఆది

తన చెల్లెలు మహాలక్ష్మి కట్టిన రాఖీని ఆది విసిరి కొట్టే సీన్ తో సీరియల్ బుధవారం (సెప్టెంబర్ 2) ఎపిసోడ్ మొదలైంది. మహా ఎంతో ప్రేమగా రాఖీ కట్టినా.. డబ్బు విసిరి మీ మందకు నెలంతా భోజనం పెట్టు అని అవమానించేలా మాట్లాడతాడు ఆది. దీంతో మహా ఆవేశంతో అతన్ని తిడుతుంది. నువ్వు మారవు.. ఛీ అంటూ చక్రిని తీసుకొని వెళ్లిపోతుంది. అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి కావడంతో హారిక కూడా ఫీలవుతుంది.

మహాలక్ష్మికి జరిగిన అవమానం గురించి చెప్పిన చక్రి

చక్రి, మహా ఇంటికి వస్తారు. బయట బీడీ తాగుతున్న నారాయణను పట్టించుకోకుండా వెళ్లిపోతుంది మహా. దీంతో ఈమెకు ఏమైంది అని అతడు లోనికి వస్తాడు. అప్పుడే పెద్ది కూడా వచ్చి మహాను పలకరిస్తాడు. ఆమె బాధగా కూర్చొంటుంది. ఏం జరిగిందని చక్రిని అడుగుతాడు.

తన వల్లే మహా హర్ట్ అయిందని, కానీ హర్ట్ చేసింది మాత్రం తాను కాదని, ఆమె అన్న ఆది అని చక్రి చెబుతాడు. రాఖీ కట్టిద్దామని రెస్టారెంట్ కు తీసుకెళ్తే అక్కడ మహాను అవమానించే ఆది ప్రవర్తించాడని చక్రి చెబుతాడు. దీంతో పెద్ది, నారాయణ బాధపడతారు. వాడు అలాంటి వాడని తెలిసి కూడా ఎందుకు తీసుకెళ్లావని చక్రిని నారాయణ తిడతాడు.

పెద్ది, నారాయణతో బాధ చెప్పుకున్న మహా

దీంతో మహా కూడా నోరు విప్పుతుంది. నీ పరిస్థితి, నా పరిస్థితి ఒకేలా ఉంది సుపుత్ర అని నారాయణతో మహా అంటుంది. నీ చెల్లి రాఖీ కట్టి ఆస్తి అడిగింది.. ఆ వెధవ ప్రేమగా రాఖీ కడితే అవమానించాడు అని బాధపడుతూ మహా వెళ్లిపోతుంటే భోజనం చేసి వెళ్లమ్మా అని పెద్ది అంటాడు. తనకు ఆకలిగా లేదని ఆమె గదిలోకి వెళ్లిపోతుంది.

అన్నకు క్షమాపణ చెప్పిన చక్రి

మహా వెళ్లిన తర్వాత పెద్దికి చక్రి క్షమాపణ చెబుతాడు. తనవల్లే మహా బాధపడిందని అంటాడు. ఇందులో నీ తప్పేమీ లేదు.. అన్నాచెల్లెళ్లను కలపాలనుకోవడం మంచి పని అని, అతడు చేసిన పనికి నువ్వేం చేస్తావని ఓదారుస్తాడు. మహాకు భోజనం తీసుకెళ్లు అని చెప్పి చక్రికి ఇచ్చి పంపిస్తాడు.

చక్రికి థ్యాంక్స్ చెప్పిన మహా.. ఫుల్లుగా తినేసి..

మహాకు భోజనం తీసుకెళ్తాడు చక్రి. ఆమెకు క్షమాపణ చెబుతాడు. కానీ మహా మాత్రం తన అన్నను తిడుతుంది. వెధవ, ఇడియట్ అని అనడంతో చక్రి తనను అనుకుంటాడు. సరే వదిలేయండి.. ముందు భోజనం చేయండి అని అడుగుతాడు. మహా పెద్దగా వద్దని చెప్పకుండా తీసుకొని తింటుంది. అదేంటి మీరు వద్దంటారేమో.. బతిమాలాలి.. వద్దంటే నేనే తినిపించాలి.. అది కదా జరగాలి అని చక్రి అంటాడు. అంతలేదు.. కర్రీ బాగుంది.. ఇంకా పెట్టుకొని వస్తాను అని చెప్పి బయటకు వెళ్తుంది. ఆమె ఇష్టంగా తినడం చూసి పెద్ది సంతోషిస్తాడు.

గోపిక పేరు చెప్పి మహాను ఉడికించిన చక్రి.. ఆడుకున్న మహా..

ఇక ఆ తర్వాత గోపిక గురించి చక్రిని కన్నా తిడతాడు. నాకు పడుతుందేమో అనుకుంటే.. పెళ్లయిన నీ వెంట పడుతోంది అంటాడు. దీంతో చక్రి ఏదో ఫీలైపోతుంటాడు. అప్పుడే మహాలక్ష్మి రావడంతో ఆమెను కావాలని ఉడికిస్తాడు. గోపిక సోషల్ మీడియా ప్రొఫైల్ దొరికిందని అంటాడు. ఆమె ఏదో నీ నంబర్ అడిగిందని చెప్పి ఫీలైపోకు.. అంతలేదు అని కేశవ అంటాడు. ఇష్టం లేకుండా.. నంబర్ ఎవరూ అడగరు కదా అని మహాను మరింత ఉడికిస్తాడు చక్రి.

అవును మరి.. ఈయన చాలా అందగాడు.. ఈయన ఆస్తులు చూసి అమ్మాయిలు వెంట పడుతున్నారు.. యూనివర్సిటీ ఆంటీలు కూడా వెంటపడుతున్నారు అంటూ మహాలక్ష్మి ఆడుకుంటుంది. అంతేకాదు లోనికి వెళ్లి వస్తాను.. ఆలోపు వాడు చదువుతూ ఉండాలి.. మీ ఇద్దరూ పడుకోవాలి.. లేదంటే సుత్తితో చక్రి ఫోన్ పగలగొడతానని ముగ్గురికీ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.

ఆమె వెళ్లిన తర్వాత చక్రి మరింత గొప్పగా ఫీలవుతుంటాడు. చూశారా.. గోపిక పేరు చెప్పగానే మహా ఎలా ఉడుక్కుంటుందో.. ఆమెను వాడుకొని మహాను తనవైపుకు తిప్పుకుంటాను అని చక్రి అంటాడు.

చక్రి మాటలతో నిద్ర కోల్పోయిన మహా.. చక్రికి నిద్ర లేకుండా చేసి..

అయితే చక్రి మాటలతో మహాకు నిద్ర పట్టదు. తాను ఇంట్లో ఉండగా.. మరో అమ్మాయి గురించి తన ముందే మాట్లాడతాడా అంటూ ఆమె ఉడుక్కుంటుంది. చక్రికి కూడా నిద్ర లేకుండా చేయాలని అనుకుంటుంది. బయట పడుకున్న చక్రి దగ్గరికి వెళ్లి ముఖాన నీళ్లు కొట్టి వెంటనే గదిలోకి వెళ్లిపోతుంది. ఉలిక్కి పడి లేచి చక్రి.. పక్కనే ఉన్న కన్నాను లేపుతాడు.

ఏం చేశావ్ రా.. ఈ నీళ్లు ఎక్కడివి అని అడుగుతాడు. నీళ్లెక్కడివి.. పైన బల్లి పోసిందేమో అని చెప్పి పడుకుంటాడు. నిజంగా బల్లి పనేనా అని చక్రి ఛీ అనుకుంటాడు. ఇదంతా చూసి మహా నవ్వుకుంటుంది. ఇక హాయిగా పడుకుంటానని అనుకున్నా.. ఆమెకు నిద్ర పట్టదు. అయినా ఈ విషయంలో తాను ఎందుకు ఇంత రియాక్ట్ అవుతున్నాను అనుకుంటుంది.

పెళ్లి గురించి మాధవ డైలమా

ఉదయాన్నే వంట చేస్తూ మాధవ తన పెళ్లి గురించి డైలమాలో పడతాడు. విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిన పెద్ది.. ఆ విషయం ఇంట్లో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంటాడు. ఇంతలో మధ్యవర్తి ఫోన్ చేస్తాడు. అమ్మాయి వాళ్లు ఇవాళ సాయంత్రమే చూడటానికి వస్తారట అని చెప్పడంతో మాధవ షాక్ తింటాడు. ఇంకా ఇంట్లో చెప్పలేదు అని అంటాడు. కానీ వాళ్లు మాత్రం ఇవాళే వస్తారట అని కచ్చితంగా చెప్పడంతో సరే తాను చూసుకుంటాను అని పెద్ది ఫోన్ పెట్టేస్తాడు.

పెద్దిని నిలదీసిన మహాలక్ష్మి.. అబద్ధం చెప్పి తప్పించుకొని..

వెనక్కి తిరిగేసరికి మహా ఉంటుంది. ఫోన్ ఎవరు అని పెద్దిని నిలదీస్తుంది. అతడు తడబడతాడు. మా దగ్గర ఏదైనా దాస్తున్నారా అని ఆమె అడుగుతుంది. అదేం లేదు.. కస్టమర్ కేర్ నంబర్.. ఊరికే ఫోన్ చేసి లోన్లు కావాలా అని అడుగుతుంటే.. అవసరం లేదు అని చెబుతున్నాను అని పెద్ది ఏదో కవర్ చేస్తాడు. కానీ పెద్ది అదోలా ఉండటం చూసి మహా, కేశవలోనూ అనుమానం వస్తుంది.

మాధవకు పెళ్లి చూపులు

మొత్తానికి మాధవకు ఇంట్లో పెళ్లి చూపులు ఏర్పాటు చేసినట్లు ఎపిసోడ్ చివర్లో చూపించారు. అమ్మాయిని కేశవ, కన్నా ఏవో ప్రశ్నలు అడగబోతే ఆమె దురుసుగా సమాధానం చెబుతుంది. పెళ్లి గురించి నారాయణ అడిగితే.. విడాకులు అయిపోగానే చూద్దామని ఆమె తరుఫు వాళ్లు అంటారు. విడాకులు ఎవరికి అని మహా అడిగితే.. నాకే అని ఆమె అంటుంది. దీంతో అందరూ షాకవుతారు. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More