Podarillu September 3 Episode: పెద్దికి మహా సపోర్ట్.. చక్రి కాలర్ పట్టుకొని కుర్చీతో కొట్టిన మహా.. రోడ్డుపై గోపికకు లైన్
Podarillu Serial September 3rd Episode: పొదరిల్లు సీరియల్ సెప్టెంబర్ 3 ఎపిసోడ్ లో పెద్దికి మహా సపోర్ట్ దొరుకుతుంది. తన పెళ్లి చూపుల గురించి అతడు ఆమెకు చెబుతాడు. మరోవైపు గోపిక విషయంలో ఉడికిస్తున్న చక్రి కాలర్ పట్టుకుంటుంది మహా.
Podarillu Serial Today Episode: స్టార్ మా సీరియల్ పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్ ఫన్నీగా సాగిపోయింది. ఓవైపు పెద్ది తన పెళ్లి చూపులకు సిద్ధమవుతూ మహాకు సపోర్ట్ కోరతాడు. మరోవైపు గోపికను ఇంప్రెస్ చేస్తూ మహాను ఉడికించడానికి ట్రై చేస్తున్న చక్రికి పెద్ద షాకే తగులుతుంది.

పరధ్యానంలో పెద్ది.. మహా, కేశవ షాక్
తన పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తూ పెద్ది పరధ్యానంలో ఉన్న సీన్ తో పొదరిల్లు సీరియల్ గురువారం (సెప్టెంబర్ 3) ఎపిసోడ్ మొదలైంది. కేశవ వచ్చి ఏదో అడిగితే ఈరోజు ఆదివారం కదా అని పెద్ది అంటాడు. ఇవాళ సోమవారం కదా అని అంటే మరచిపోయాను అని చెబుతాడు. తర్వాత కన్నా వచ్చి లంచ్ బాక్స్ అడిగితే.. పొయ్యిపై ఉన్న గిన్నె తీసి ఇస్తాడు.
పెద్దిని చూసి కేశవ, మహా షాక్ తింటారు. రెస్ట్ తీసుకోకుండా ప్రతి రోజూ ఇలా పని చేస్తూ వెళ్తే ఇలాగే ఉంటుంది.. అందుకే కాస్త రెస్ట్ తీసుకోండి అని పెద్దికి చెబుతుంది మహా. సరే అని అతడు వెళ్లిపోతాడు.
మహా ముందు చక్రి పరువు తీసిన కేశవ, కన్నా
అటు చక్రి బాగా దువ్వుకుంటూ, పర్ఫ్యూమ్ కొట్టుకొని రెడీ అవుతుంటాడు. తన కోసం గోపిక వేచి చూస్తోందని కేశవ, కన్నా ముందు బిల్డప్ ఇస్తుంటాడు. తనలాంటి అందగాళ్ల కోసం ప్రపంచంలో ఎంత డిమాండ్ ఉందో తెలుసా అంటాడు. అప్పుడే మహా అక్కడికి వస్తుంది. ఏది అంటూ చక్రి కాళ్ల దగ్గర అటూ ఇటూ వెతుకుతాడు కేశవ. ఏం వెతుకుతున్నావంటే అందం అన్నావ్ కదా.. ఎక్కడ ఉందా అని చూస్తున్నాను అని అనడంతో మహా నవ్వుతుంది.
ఆమె ముందు కేశవ, కన్నా కలిసి చక్రి పరువు మరింత తీస్తారు. తనలాంటి అందగాళ్లను కాపాడుకోవాలని చక్రి అంటే.. అలా అనుకొని సంతోషించే వాళ్లు చాలా మంది ఉంటారని మహా కౌంటర్ వేస్తుంది. ఇంట్లో వాళ్లకు తన అందం గురించి తెలియదని, బయటి వాళ్లు పడిపోతారని చక్రి అంటే.. మళ్లీ లేవరు అని కేశవ కౌంటర్ వేస్తాడు.
చక్రికి పెద్ది వార్నింగ్.. నీకు పెళ్లి జరిగిందంటూ..
అప్పుడే పెద్ది వస్తాడు. చక్రికి వార్నింగ్ ఇస్తాడు. ఎవరో అమ్మాయి వెంట పడుతున్నావట.. దెబ్బలు పడతాయి.. నీకు పెళ్లయిన విషయం గుర్తు లేదా అని మాధవ అడుగుతాడు. నాకు పెళ్లయింది.. ఎప్పుడు అని చక్రి అడిగితే.. పోలీస్ స్టేషన్ లో అయింది కదా అని మాధవ అంటాడు.
ఆ విషయం మహాలక్ష్మి గారిని చెప్పమనండి అని చక్రి అడుగుతాడు. నా జీవితంలో జరిగిన విషాదాలను మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోలేను అని మహా అనడంతో ఆ పెళ్లిని విషాదం అనుకుంటోంది అని కేశవ అంటాడు. తనకోసం తన బస్టాప్ బర్డ్ వేచి చూస్తోంది తాను వెళ్తాను అంటూ మరోసారి పర్ఫ్యూమ్ కొట్టుకుంటాడు చక్రి.
చక్రిని కుర్చీతో కొట్టాలన్నంత కసిలో మహా
అతడు అడుగు ముందుకు వేయగానే ఎగిరి డోర్ దగ్గర పడతాడు. వెనక్కి తిరిగి చూస్తే మహా కుర్చీ పట్టుకొని ఆవేశంగా చూస్తూ ఉంటుంది. దీంతో అందరూ భయపడి దూరంగా పరుగెత్తుతారు. మళ్లీ కొట్టబోతే పెద్ది అడ్డుకొని కుర్చీ లాక్కుంటాడు. దీంతో చక్రి కాలర్ పట్టుకొని పెద్ద అందగాడివా అని నిలదీస్తుంది. అయితే ఇదంతా మహా ఊహించుకుంటుందన్న విషయం తర్వాత తెలుస్తుంది. చక్రిని అలా కొట్టాలన్నంత కసి ఆమెలో కనిపిస్తుంది.
గోపిక దగ్గరికి చక్రి.. బస్టాప్‌లో లైన్ వేస్తూ.. ఉడుక్కున్న మహా
అటు గోపిక దగ్గరికి చక్రి వెళ్తాడు. బస్టాప్ లో తనకోసం ఎదురు చూస్తున్న చక్రిని దూరం నుంచి గోపిక, ఆమె ఫ్రెండ్ చూస్తారు. ఆయన ప్రొఫైల్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని తన ఫ్రెండ్ తో అంటుంది గోపిక. వెళ్లి మాట్లాడమని ఆమె చెబుతుంది. గోపిక తన దగ్గరికి రావడం చూసిన చక్రి.. ఈ సమయంలో మహా ఉంటే బాగుండేది అనుకుంటాడు. అప్పుడే కన్నాతో కలిసి మహా వస్తుంది.
చక్రి ఇచ్చే బిల్డప్ చూసి ఉడుక్కుంటుంది. మహాను చూసి చక్రి మరింత రెచ్చిపోతాడు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటాడు. ఫోన్ తీసి కావాలని ఎవరితోనో మాట్లాడినట్లు బిల్డప్ ఇస్తాడు. తర్వాత గోపిక దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంటాడు. కన్నా ఆమె ఫ్రెండ్ తో మాట్లాడుతుంటాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములను చూసి కన్నా అంటూ ఆవేశంగా పిలిచి తాను వెళ్లిపోతున్నానని ఆటోలో మహా వెళ్లిపోతుంది.
పెళ్లి గురించి మహాకు చెప్పడానికి వెళ్లిన పెద్ది
ఆ తర్వాత మహా పని చేసే ఆఫీసుకు వెళ్తాడు పెద్ది. నీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా అని మహాతో అంటాడు. ఏంటి అని అడిగితే.. పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని పెద్ది చెప్పడంతో మహా చాలా సంతోషిస్తుంది. అయితే వెంటనే చక్రికి ఫోన్ చేసి అమ్మాయిని చూడమని చెబుతానని మహా అంటుంది.
అవసరం లేదు.. నేను చూశాను.. రెండు రోజుల కిందట మాట్లాడాను.. ఇవాళ వాళ్లు మన ఇంటికి చూడటానికి వస్తారు అని పెద్ది చెప్పడంతో మహా ఆశ్చర్యపోతుంది. ఇదే ముందే చెబితే ఆఫీసుకు లీవ్ పెట్టేదాన్ని కదా అని అంటుంది. సాయంత్రం 5 గంటలకు వాళ్లు వస్తారని పెద్ది చెప్పడంతో తాను 3 గంటలకే వచ్చి అన్ని ఏర్పాట్లు చూసుకుంటాను.. మీరేమీ కంగారు పడొద్దు అని చెప్పి పెద్దిని పంపించేస్తుంది మహా.
చక్రికి షాకిచ్చిన మహా
అటు చక్రికి ఫోన్ చేసి ఇంటికి పిలుస్తుంది. ఇంట్లో చాలా పని ఉంది అని చెబుతుంది. ఇంటికి వచ్చిన చక్రి.. గోపికతో అలా లంచ్ కు వెళ్దామనుకుంటున్నాను.. మీరు ఫోన్ చేశారు అని ఆమెను ఉడికించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆమె రివర్స్ అవుతుంది. అవునా అయితే వెళ్లండి.. మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లు ఉన్నాను అని అనడంతో చక్రి షాకవుతాడు. ఆమె ఇంటికి వెళ్లిపోయింది.. ఇప్పుడు బయటకు రాదని కవర్ చేసుకుంటారు.
ఎందుకు పిలిచారు అని అడిగితే.. వెంటనే ఇల్లంతా ఊడ్చి, తుడవండి.. కిచెన్ లో సింకులో చాలా అంట్లు ఉన్నాయి అవి తోమండి.. వెంటనే ఇల్లంతా రెడీ చేయండి అని ఆర్డర్ వేస్తుంది. ఎందుకు అని అడిగితే మాత్రం ఆమె చెప్పదు. పెద్ది పెళ్లి చూపుల కోసం ఆమె ఏర్పాట్లు చేస్తుంటుంది. అక్కడితో పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


