...
...
Next Story

బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. పీఎం కాబోతున్న మహారాణి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మహారాణి సరికొత్త సీజన్ తో తిరిగి వస్తోంది. ఈ మచ్ అవేటెడ్ సీజన్ స్ట్రీమింగ్ తేదీని గురువారం (అక్టోబర్ 9) సోనీ లివ్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మహారాణి ఇప్పుడు సీఎం పదవి వదిలి దేశాన్ని ఏలడానికి సిద్ధమవుతోంది.

Published on: Oct 9, 2025, 16:07:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఇండియన్ ఓటీటీలోని టాప్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి మహారాణి. సోనీ లివ్ ఓటీటీలో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్ తో వస్తోంది. ఈ నాలుగో సీజన్ ట్రైలర్ తోపాటు స్ట్రీమింగ్ తేదీని గురువారం (అక్టోబర్ 9) మేకర్స్ అనౌన్స్ చేశారు. 'మహారాణి 4' నవంబర్ 7న SonyLIVలో విడుదలవుతుందని మేకర్స్ ఎట్టకేలకు వెల్లడించారు. ఈ కొత్త సీజన్లో రాణీ భారతి పాట్నాను వదిలి ఢిల్లీ రాజకీయాలకు వెళ్లనున్నట్లు చూపించారు.

'మహారాణి 4' స్టోరీ ఇదే..

బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. పీఎం కాబోతున్న మహారాణి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వచ్చేస్తోంది.. పీఎం కాబోతున్న మహారాణి.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ లీడ్ రోల్లో నటించిన వెబ్ సిరీస్ మహారాణి. తొలి మూడు సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు 'మహారాణి 4' కేవలం పాట్నాలో అధికారం కోసం జరిగే పోరాటంపై మాత్రమే కాకుండా.. దేశ సింహాసనం కోసం జరిగే పోరాటంపై కూడా దృష్టి పెడుతుంది. ఈ కొత్త సీజన్ రాణి భారతి (హుమా ఖురేషి) కథను కొనసాగిస్తుంది. ఆమె బీహార్, ఢిల్లీలలో మరింత ప్రమాదకరమైన రాజకీయ వాతావరణంలో ఎలా తనదైన మార్గాన్ని ఏర్పరుచుకుంటుందో చూపించబోతోంది.

ఈ కథలో మరింత శక్తివంతమైన రాణి భారతి కొత్త రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇది ఆమె రాజకీయ ప్రయాణాన్ని కొత్త స్థాయికి తీసుకువెళుతుంది. తాజాగా రిలీజైన ట్రైలర్లో ఆమె దేశ ప్రధానికే వార్నింగ్ ఇవ్వడం చూపించారు. పీఎం నుంచి ఎదురైన అవమానంతో ఆమె ఇక ముఖ్యమంత్రి పదవి వదలి ప్రధాన మంత్రి పదవి కోసం బయలుదేరినట్లు చూపించారు.

మేకర్స్ ఈ ట్రైలర్‌ను షేర్ చేస్తూ.. "తన ఇంటిని రక్షించుకోవడానికి సింహం తిరిగొచ్చింది. రాణి తన అతిపెద్ద యుద్ధానికి సిద్ధమవుతోంది" అని క్యాప్షన్ ఇచ్చారు.

రాణి భారతి పాత్రను పోషిస్తున్న హుమా ఖురేషి 'మహారాణి 4' గురించి మాట్లాడుతూ.. తన ప్రయాణం ఎప్పుడూ అడ్డంకులను ధిక్కరించడం గురించే ఉంటుందని, అయితే ఈ సీజన్‌లో ఆమె ఆశయం ఒక సరికొత్త స్థాయికి చేరుకుందని చెప్పింది. "ఇది రాణి అత్యంత సాహసోపేతమైన, తీవ్రమైన, ఫిల్టర్ లేని వెర్షన్. ఆమె ఎదుగుదలను ప్రేక్షకులు చూసేందుకు నేను వేచి ఉండలేకపోతున్నాను" అని హుమా అన్నది.

మహారాణి 4 గురించి..

మహారాణి వెబ్ సిరీస్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్లు ఈ నాలుగో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వచ్చిన ట్రైలర్ తో వాళ్లలో ఉత్సాహం రెట్టింపైంది. మరి నవంబర్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ కొత్త సీజన్ వాళ్ల అంచనాలను అందుకుంటుందా లేదా చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks