...
...
Next Story

క్వీన్ ఈజ్ బ్యాక్.. బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ రెడీ.. అదిరిపోయిన ట్రైలర్

క్వీన్ ఈజ్ బ్యాక్.. మహారాణి మళ్లీ వచ్చేస్తోంది. సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మహారాణి నాలుగో సీజన్ ట్రైలర్ బుధవారం (అక్టోబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇది కొత్త సీజన్ పై మరింత ఆసక్తి రేపుతోంది.

Published on: Oct 29, 2025, 15:00:08 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మహారాణి.. ఇండియన్ ఓటీటీ స్పేస్ లోని సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో ఒకటి. సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్న ఈ సిరీస్ నాలుగో సీజన్ వచ్చే వారమే స్ట్రీమింగ్ కానుంది. తాజాగా బుధవారం (అక్టోబర్ 29) రిలీజైన ట్రైలర్ ఎంతో ఉత్కంఠ రేపేలా సాగింది.

మహారాణి సీజన్ 4 ట్రైలర్

క్వీన్ ఈజ్ బ్యాక్.. బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ రెడీ.. అదిరిపోయిన ట్రైలర్
క్వీన్ ఈజ్ బ్యాక్.. బ్లాక్‌బస్టర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ రెడీ.. అదిరిపోయిన ట్రైలర్

ప్రముఖ బాలీవుడ్ నటి హుమా ఖురేషీ నటించిన వెబ్ సిరీస్ మహారాణి. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. బీహార్ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ప్రతి సీజన్ కు ఉత్కంఠ రేపుతూ వెళ్తున్న ఈ వెబ్ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్ తో వస్తోంది. ఈసారి ఫైట్ బీహార్ వర్సెస్ ఢిల్లీ అనేలా సాగింది.

మహారాణి బీహార్ వదిలి ఏకంగా ఢిల్లీ ప్రధానమంత్రి పీఠంపై కన్నేయడం ఇందులో చూడొచ్చు. తాజాగా రిలీజైన ట్రైలర్లో రాణీ భారతి సీఎం పీఠాన్ని తన కూతురికి అప్పగించి ఢిల్లీ రాజకీయాలపై దృష్టి పెట్టడం చూడొచ్చు. అదే సమయంలో ఆమె కొడుకు చేసే అరాచకాన్ని కూడా చూపించారు. ఈ ట్రైలర్ ఢిల్లీలోని సంకీర్ణ కేంద్ర ప్రభుత్వానికి ఓ పార్టీ మద్దతు ఉపసంహించుకునే సీన్ తో మొదలైంది.

ఆ పార్టీ స్థానంలో కేంద్రానికి మద్దతిచ్చే ఏకైక వ్యక్తిగా రాణీ భారతి సీన్ లోకి ఎంటరైంది. అయితే తాను మద్దతిచ్చే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి ఆఫర్ ను తిరస్కరిస్తుంది. అప్పుడే ఆమె అసలు కష్టాలు మొదలవుతాయి. పాత శత్రువులు, కొత్త శత్రువులు కలిసి ఆమెను ఓ పాత కేసులో మళ్లీ జైలు పాలు చేయడానికి ప్లాన్ చేస్తారు. ఈ కొత్త సవాలును రాణీ భారతి ఎలా ఎదుర్కొంటుందన్నది మహారాణి సీజన్ 4లో చూడొచ్చు. ఈ కొత్త సీజన్ నవంబర్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మహారాణి వెబ్ సిరీస్ గురించి..

ఇందులో రాణీ భారతి అనే ఓ పవర్ ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ నటించింది. ఓ చదువు రాని గ్రామీణ మహిళ పాత్ర నుంచి బీహార్ లాంటి రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రిగా ఆమె ఎదిగిన తీరును ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. అయితే నాలుగో సీజన్ లో ఆమె ఏకంగా ప్రధాని పదవిపైనే కన్నేయడం ఆసక్తికరంగా మారింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe