Poonam Pandey: ఏప్రిల్ ఫూల్.. అంతా ఉత్తదే.. ఏదో నవ్విద్దామని అలా చేశా: ప్రెగ్నెన్సీ ఫొటోలపై పూనమ్ పాండే

Poonam Pandey: మోడల్ పూనమ్ పాండే తన ప్రెగ్నెన్సీ ఫోటోలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే ఇది కేవలం 'ఏప్రిల్ ఫూల్' ప్రాంక్ మాత్రమేనని ఆమె స్వయంగా క్లారిటీ ఇచ్చింది. గతంలో తన మరణం గురించి కూడా ఆమె ఇలాంటి స్టంటే చేసింది.

Published on: Apr 1, 2026, 16:19:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వివాదాలకు కేరాఫ్ అడ్రస్, మోడల్, నటి పూనమ్ పాండే ఇంటర్నెట్‌లో పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో తనకు తానే సాటి అని మరోసారి నిరూపించుకుంది. గతంలో సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)పై అవగాహన కల్పించేందుకంటూ తన మరణం గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేసిన ఆమె.. ఇప్పుడు 'ప్రెగ్నెన్సీ' పేరుతో కొత్త డ్రామాకు తెరలేపింది.

Poonam Pandey: ఏప్రిల్ ఫూల్.. అంతా ఉత్తదే.. ఏదో నవ్విద్దామని అలా చేశా: ప్రెగ్నెన్సీ ఫొటోలపై పూనమ్ పాండే
Poonam Pandey: ఏప్రిల్ ఫూల్.. అంతా ఉత్తదే.. ఏదో నవ్విద్దామని అలా చేశా: ప్రెగ్నెన్సీ ఫొటోలపై పూనమ్ పాండే

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'బేబీ బంప్'తో ఉన్న ఫోటోలను షేర్ చేసి నెటిజన్లను ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. అయితే ఆమె ట్రాక్ రికార్డు తెలిసిన నెటిజన్లు ఇది నిజమా లేక మరో గారడీనా అని సందేహాలు వ్యక్తం చేశారు. ఊహించినట్లుగానే ఇది కేవలం ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ అని పూనమ్ స్వయంగా వెల్లడించింది.

అసలేం జరిగింది?

పూనమ్ పాండే షేర్ చేసిన ఫోటోలలో ఆమె తన బేబీ బంప్‌ను చూపిస్తూ కెమెరాకు నవ్వుతూ ఫోజులిచ్చింది. ఒక ఫోటోలో టీ-షర్ట్ పైకి రోల్ చేసి ఉండగా, మరో ఫోటోలో సాధారణంగా పోజు ఇచ్చింది. ఈ ఫోటోలకు క్యాప్షన్ ఏమీ రాయకుండా.. కేవలం గర్భిణీ స్త్రీ, పాల సీసా, చిన్న పిల్లల ఎమోజీలను మాత్రమే జత చేసింది. దీంతో ఆమె నిజంగానే గర్భవతి ఏమో అని కొందరు భ్రమపడ్డారు. అయితే ఏప్రిల్ 1న (ఏప్రిల్ ఫూల్స్ డే) ఆమె ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ అసలు విషయం చెప్పింది.

"గాయ్స్, మీ అందరి విషెస్‌కు చాలా థాంక్స్. కానీ నేను ప్రెగ్నెంట్ కాదు. ఈరోజు ఏప్రిల్ ఫూల్స్ డే కాబట్టి ఇది కేవలం ఒక ప్రాంక్ మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరుగుతున్నాయి.. అందరూ ఒత్తిడిలో ఉన్నారు. అందుకే మిమ్మల్ని కాస్త ఎంటర్టైన్ చేద్దామని ఇలా చేశాను. నేను పూనమ్ పాండేని.. మిమ్మల్ని షాక్‌కు గురిచేసే హక్కు నాకుంది. జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకోకండి, కాస్త చిల్ అవ్వండి" అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది.

నెటిజన్ల రియాక్షన్

పూనమ్ ఫోటోలు షేర్ చేసిన వెంటనే చాలా మంది ఇది ప్రాంక్ అని పసిగట్టారు. "అద్భుతమైన ప్రోస్తెటిక్ మేకప్! ఏప్రిల్ 1 కంటే ఒక రోజు ముందే వచ్చేసినట్లు ఉన్నావుగా?" అని ఒకరు కామెంట్ చేయగా.. మరికొందరు ఇవి ఏఐ (AI) ద్వారా సృష్టించిన ఫోటోలని అనుమానం వ్యక్తం చేశారు. "మళ్ళీ పబ్లిసిటీ కోసం ఇలాంటి పనులు ఎందుకు?" అని కొందరు నెటిజన్లు ఆమె తీరును తప్పుబట్టారు.

గతంలో 'మరణం' డ్రామా

2024లో పూనమ్ పాండే చేసిన ఒక పని దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో మరణించిందంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్ టీమ్ ఒక పోస్ట్ పెట్టింది. ఆ వార్త చూసి సినీ ప్రముఖులు కూడా సంతాపం ప్రకటించారు. కానీ రెండు రోజుల తర్వాత ఆమె ప్రత్యక్షమై.. "నేను బతికే ఉన్నాను, సర్వైకల్ క్యాన్సర్ నన్ను ఏమీ చేయలేదు" అంటూ వీడియో రిలీజ్ చేసింది.

కేవలం ఈ వ్యాధిపై అవగాహన కల్పించడానికే తాను చనిపోయినట్లు నాటకమాడానని అప్పట్లో ఆమె సమర్థించుకుంది. టీకాలు వేయించుకోవడం, పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్‌ను నివారించవచ్చని ఆమె అప్పుడు సందేశం ఇచ్చింది. అయితే ఆ సమయంలో కూడా ఆమెపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రెగ్నెన్సీ ప్రాంక్ ద్వారా పూనమ్ మరోసారి వార్తల్లో నిలిచింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More