...
...
Next Story

Posani Krishna Murali: మగాడు మగాడు కలుస్తాడా.. విజయ్‌ని అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీల కుట్రలు: పోసాని కృష్ణమురళి

Posani Krishna Murali: తమిళనాడు రాజకీయాలపై నటుడు పోసాని కృష్ణ మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దళపతి విజయ్‌ను ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని, విరుద్ధ భావజాలం ఉన్న పార్టీలు సైతం ఏకమవుతున్నాయని ఆయన విమర్శించారు.

Published on: May 7, 2026, 15:14:17 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Posani Krishna Murali: తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసి 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన రెండేళ్లలోనే సీఎం పదవి చేపట్టేందుకు సిద్ధమవుతుండటంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తమిళ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు తెరవెనుక పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

విరుద్ధ భావజాలం ఉన్న పార్టీల కలయికపై విస్మయం

Posani Krishna Murali: మగాడు మగాడు కలుస్తాడా.. విజయ్‌ని అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీల కుట్రలు: పోసాని కృష్ణమురళి
Posani Krishna Murali: మగాడు మగాడు కలుస్తాడా.. విజయ్‌ని అడ్డుకునేందుకు ఆ రెండు పార్టీల కుట్రలు: పోసాని కృష్ణమురళి

తమిళనాడులో దశాబ్దాలుగా ఉప్పు-నిప్పులా ఉండే డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీలు విజయ్‌ను అడ్డుకునే విషయంలో చేతులు కలపడంపై పోసాని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

"డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య చాలా లోతైన విభేదాలు ఉన్నాయి. అస్సలు పొసగని ఈ రెండు పార్టీలు ఇప్పుడు విజయ్‌ను అడ్డుకోవడానికి ఎలా కలుస్తాయి.. కాస్త ఇబ్బందికరంగా చెప్పాలంటే మగాడు మగాడు ఎక్కడైనా కలుస్తాడా" అని ఆయన ప్రశ్నించడం గమనార్హం.

ఈ రెండు పార్టీల మధ్య ఉన్న దూరం భారత్ - పాకిస్థాన్ మధ్య ఉన్నంత ఉంటుందని, అలాంటిది అధికార దాహంతో విజయ్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇవి ఏకమవ్వడం గమనార్హమని విశ్లేషించారు.

గవర్నర్ తీరుపై విమర్శలు

విజయ్ రాజకీయ ప్రస్థానంలో అడ్డంకులు సృష్టించడంపై పోసాని అసహనం వ్యక్తం చేశారు. కనీసం ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా గవర్నర్ అవకాశం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్న ఒక వ్యక్తిని ఇలా అడ్డుకోవడం ఏమాత్రం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ప్రజాస్వామ్యంలో కొత్త శక్తులు ఉద్భవించినప్పుడు వాటిని అణిచివేయాలని చూడటం వ్యవస్థకే ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల కోసమే విజయ్ పోరాటం

"ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని వస్తున్న వ్యక్తిని అడ్డుకోవడం తప్పు. ఇలాంటి కుట్రలు రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పరిణామం కాదు," అని ఆయన స్పష్టం చేశారు. విజయ్ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే పాత రాజకీయ శక్తులన్నీ ఏకమవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తమిళనాట కూడా ఈ అంశంపై చర్చ మొదలైంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

తమిళనాడు రాజకీయాలపై పోసాని కృష్ణమురళి ఏమన్నారు?

విజయ్‌ను ముఖ్యమంత్రి కాకుండా డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని, గవర్నర్ సైతం ఆటంకాలు సృష్టిస్తున్నారని పోసాని విమర్శించారు.

విజయ్ పార్టీ పేరు ఏమిటి?

తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన పార్టీ పేరు 'తమిళగ వెట్రి కళగం' (TVK).

డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను పోసాని వేటితో పోల్చారు?

ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరాన్ని భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న వైరంలాంటిదని పోసాని అభివర్ణించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe